A.H.
After Hijra. అనగా హిజ్రా తరువాత. ఈ తేదీనుండి ముస్లింలు తమ కాలమును/తేదీలను లెక్కిస్తారు. హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622, జూలై 16న వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. ముస్లింలు ఇక్కడినుంచి తమ శకమును లెక్కించుకుంటారు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముకు బదులుగా, హిజ్రాకు పూర్వము మరియు హిజ్రాకు తరువాత అని వారు కాలమును లెక్కించుకుంటారు. ముస్లింల కాలెండరు నుంచి క్రైస్తవుల కాలెండరు తేదీలను తెలుసుకునే విధానముపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…