యేసు క్రీస్తు పునరుత్థానము ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పటానికి అనేక కారణాలున్నాయి. మొదటిగా, యేసు క్రీస్తు పునరుత్థానము దేవుని యొక్క అపరిమితమైన శక్తిని తెలియజేస్తుంది. పునరుత్థానమును నమ్మటమంటే, దేవుని నమ్మటమే. దేవుడుండియుంటే, ఈ సృష్టిని ఆయన చేసియుంటే మరియు ఈ సృష్టంతటిపైన ఆయనకు అధికారముంటే, ఖచ్చితముగా ఆయనకు మృతులను లేపే శక్తి ఉంటుంది. ఆయనకు ఆ విధమైన శక్తి లేకుంటే, మన విశ్వాసానికి మన ఆరాధనకు ఆయన యోగ్యుడు కాదు. జీవమును సృజించినవాడు మాత్రమే మరణము తరువాత దానిని తిరిగి బ్రతికించగలడు, ఆయన మాత్రమే అఘోరమైన ఆ మరణమును సైతము ఓడించగలడు, ఆయన మాత్రమే మరణపు ముల్లును తీసివేసి, సమాధిపైన విజయమును పొందగలడు (1కొరింథీ 15:54-55).  యేసు క్రిస్తు ప్రభువును సమాధినుండి తిరిగి లేపుటవలన, జీవ మరణములపైన తనకు సార్వభౌమాధికారము కలదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న: యెషయా 44:24లో భూమ్యాకాశములను సృజించినపుడు  యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడని వ్రాయబడింది. యెషయా 42:1ని మత్తయి సువార్త 12:18లో ఉటంకిస్తూ యెహోవా పంపుతాను అనిన ఆయన సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు అని వ్రాసారు. ఇప్పుడు (నిర్గమ 20:2-3 ప్రకారముగా) యెహోవా ఒక్కడే నిజమైన దేవుడైతే, తానొక్కడే భూమ్యాకాశములను సృజించి తన సేవకుని (అనగా యేసు క్రీస్తును) పంపినవాడైతే, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా కాదు అనేది దాని అర్థం అయ్యుండాలి. అయితే క్రైస్తవులు ఎందుకు తమ స్వంత బైబిలు బోధిస్తున్నదానికే విరుద్ధముగా మాట్లాడుతున్నారు? (*)  జవాబు: మొదటిగా గమనించితే, అడుగబడిన ప్రశ్నన యెహోవాను త్రై-వ్యక్తిత్వానికి భిన్నమైన ఏక-వ్యక్తిత్వమును కలిగినవానిగా ఊహించుచు యునిటేరియనిజమ్‌ (ఏకేశ్వరోపాసన) వారు వేసినదిగా మనము గ్రహించగలము. ఆ విధముగా ఊహించుకొని ఆ ప్రశ్నను అడుగుటనుబట్టిపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న:  తండ్రి అద్వితీయ సత్యదేవుడని యేసు క్రీస్తు ప్రభువే అంటున్నారు. త్రిత్వోపాసకులేమో తండ్రి మరియు కుమారుడు వేర్వేరు వ్యక్తులు, ఒక్కడే వ్యక్తి కాదు అంటారు. యేసు క్రీస్తు ప్రభువు దేవుడు అనుటను ఆయనే తృణీకరిస్తున్నట్లు ఇది రుజువు చేయుటలేదా? జవాబు: పై ప్రశ్నను అడుగుతున్నవారు స్పష్టముగా ఏకేశ్వరోపాసనను అనగా ఒకే ఒక వ్యక్తి యైన దేవుడు (పేరుకు తండ్రి) మాత్రమే ఉన్నాడని ఊహించుకుంటూ, ఆ ఊహను లేఖనభాగానికి అంటగట్టుతూ అడుగుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన విషయమును సరిగా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా ఆ లేఖన భాగాన్ని దాని పూర్వోత్తరభాగ సంధర్భమంతటిని చదవాలి:పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…