యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడుట, మరణించుట మరియు పునరుత్థానము చెందుట అనేవి క్రైస్తవ విశ్వాసానికే గుండెకాయ వంటివి. క్రైస్తవుడు నమ్మి నిరీక్షించు ప్రతి విషయము అపాత్రులైన పాపులకొరకు సిలువపైన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన మరణము చుట్టూ  పరిభ్రమిస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువు తాను చేసిన నేరములకొరకు చనిపోలేదు, కాని అపారమైన పరిశుద్ధత నీతియుగల దేవుని యెదుట నిలువబడుటకు విమోచన మరియు నీతి పొందవలసియుండిన పాపుల స్థానములో ఆయన చనిపోయాడు అని చెప్పే దైవతీర్పే పునరుత్థానము. యేసు క్రీస్తు ప్రభువు మరణించలేదు మృతులలోనుండి లేవలేదు అని రుజువుచేయబడితే, క్రైస్తవ్యము తరతరాలుగా కోట్లాదిమందిని మోసము చేయుచున్న ఒక అబద్దమే తప్ప మరేమీ కాదు. క్రైస్తవుడు నిరీక్షణ లేకుండా, నీతిని గురించిన నిశ్చయత లేకుండా, తన పాపములలోనే నిలిచియుండిపోతాడు (1కొరింథీయులకు 15:12-19; రోమీయులకు 4:25, 5:8-11).పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…