ప్రశ్న: పరలోకమందును భూమిమీదను తనకు సర్వాధికారము ఇయ్యబడింది అని యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మత్తయి వ్రాసిన సువార్తలో వ్రాయబడియున్నది (మత్తయి 28:18 చూడండి), అనగా వేరెవరో ఆయనకు ఆ అధికారము ఇచ్చారు అని అర్థమొస్తోంది. యేసు క్రీస్తు ప్రభువుకంటే ఆ అధికారమును ఆయనకు ఇచ్చిన వారు గొప్పవారు అయి ఉండాలి, అనగా యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారము గలిగిన దేవుడు కాలేరు అని! మెట్టుకు, దేవునికి సర్వాధికారము ముందునుంచే ఉంటుంది కదా, అలాంటప్పుడు అది ఆయనకు ఇవ్వబడాల్సిన అవసరం ఏమిటి? జవాబు: మునుపటి ప్రశ్నలలో ఒకదాని వలెనే, ఇక్కడ ఉన్న సమస్య అంతా ఏమంటేపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

యేసుక్రీస్తు చనిపోలేదు సిలువ కూడా వేయబడలేదు అని ఆధునిక ముస్లింలు ఆరోపించటం సాధారణముగా మనం వింటూనే ఉంటాము. సూరా 4:157ను ప్రామాణికముగా చూపుతూ యేసుక్రీస్తు రూపము ఇస్కరియోతు యూదాపైకి మార్పిడి చేయబడింది అని వారు చెప్పుట కూడా సాధారణముగా వింటూనే ఉంటాము. అంతే కాకుండా, యూదా ఒకసారి యేసువలె కనబడునట్లుగా చేయబడుటవలన ప్రజలు పొరపాటుగా క్రీస్తు స్థానములో ఆయనను సిలువ వేశారు; అందువలన జనసామాన్యము వాస్తవముగా క్రీస్తునే సిలువ వేస్తున్నాము అని అనుకొన్నారు అని కూడా వారు నమ్ముతారు. విచారకరముగా, ఆదిమ ముస్లిం మూలాధార పుస్తకాలలో అటువంటి అభిప్రాయములకు చాలా కొద్దిపాటి ఆధారం కూడా దొరుకదని చాలా మందికి తెలియదు. నిజానికి, ఆదిమ ముస్లిం పండితులందరూ యేసుక్రీస్తు చివరి దినముల గురించి విభేదిస్తూ భిన్నవిభిన్న విశ్వాసాలతో పరస్పర విభేదములు కలిగి ఉన్నారు. ఆదిమ ముస్లిం పండితులందరు కూడా ఒకే అభిప్రాయానికి కట్టుబడియుండక, కొంతమంది క్రీస్తు వాస్తవముగా చనిపోయారు అని నమ్ముతుంటే మరికొందరు దేవుడు ఆయనను చనిపోనియ్యకుండా తిన్నగా పరలోకమునకు పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న: తండ్రి తనకంటే గొప్పవాడని యేసుక్రీస్తు చెప్పాడు, ఆ మాట తాను దేవుడు కాదు అని రుజువు చేస్తుంది. దేవునికంటే గొప్పవారు మరి ఎవ్వరూ లేరు. జవాబు: ప్రశ్నించబడిన వాక్య భాగమును ఇక్కడ వ్రాస్తున్నాము: “నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.” యోహాను సువార్త 14:28 ఆక్షేపకుడు (ముస్లిం)  ఏకేశ్వరోపాసన విశ్వాసం (అనగా ఉనికిగాను వ్యక్తిగాను దేవుడు ఒక్కడే అనే నమ్మకం) కలిగినవాడు. కావున, తనకంటే గొప్పవాడున్నాడని దేవుడు చెప్పటం అంటే అతనికి అర్థంకాదు. అయితే త్రిత్వోపాసకులు నమ్ముచున్నట్లుగా దేవుడు త్రిత్వమైతే అనగా నిత్యుడైన ఒక దేవుడే అవిభక్తమైన (వేరుచేయ సాధ్యము కాని), ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నట్లయితే అప్పుడు దైవత్వములోని ఒక సభ్యుడు లేక వ్యక్తి మిగిలిన వారికంటే కొన్ని విషయములలో గొప్పవానిగా కనబడటం అంత జటిలమైన విషయంకాదు. పరిశుద్ధ త్రిత్వమునకు వెలుపల గొప్పది మరేదియు ఎప్పటికిని లేదు అనేది వాస్తవము, అయితే దీనినిపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ఇస్లామీయ గ్రంథాల (సీరా, హదీత్‌ మరియు ఖుర్‌ఆన్‌) నుండి దిగువనీయబడిన మాటలు దయచేసి గమనించండి. ఇబ్న్‌ఇస్‍హాక్ వ్రాసిన “సీరత్‌ రసూలల్లాహ్‌,” ది లైఫ్‌ఆఫ్‌ముహమ్మద్‌, ఆల్ఫ్రెడ్‌ గియోం అనువాదం, 106వ పేజిపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న: యేసుక్రీస్తు దేవుడని ఆయన చేసిన అద్భుతములు రుజువుచేస్తున్నాయి అని కొందరు క్రైస్తవులు నమ్ముతారు. దీనితో ఉన్న సమస్య ఏమంటే, దరీదాపుగా యేసుక్రీస్తు చేసిన ప్రతీ అద్భుతమునకు సమానమైన అద్భుతము పాతనిబంధనలో కనబడుతుంది. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల వంటివే పాతనిబంధనలోని చాలా మంది ప్రవక్తలు కూడా చేసారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆయనను దేవునిగా చేస్తే, ఇతర ప్రవక్తలు చేసిన అద్భుతాలు వారిని దేవుడు/దేవుళ్ళు గా ఎందుకు రుజువుపర్చవు? జవాబు: ఈ ప్రశ్నకు జవాబు చెప్పటకు ముందు, ముస్లింలు తరచుగా పాత నిబంధనలోనుండి ఎత్తి చూపిస్తున్న కొన్ని ఉదాహరణలు మొదటగా ఇవ్వాలని ఇష్టపడుచున్నాం. వాస్తవానికి, ఒక ముస్లిం తన వెబ్సైటులో వ్రాసిన (*) ఉదాహరణలనే ఇక్కడ ఉటంకించుచున్నాము:పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…