ప్రశ్న: హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:8-9 వచనముల ప్రకారముగా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునకు పైన వేరొక దేవుడున్నాడు.  కొంతమంది క్రైస్తవులు పై వచనములు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నాయి కాబట్టి, ఒక మానవునిగా ఆయనకు పైన ఒక దేవుడున్నాడు అని అంటారు. అయితే అలా భావిస్తే వచ్చే చిక్కేమంటే,  కేవలం మానవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దైవత్వం ఆపాదించి ఆయన మానవత్వానికే దైవత్వము కట్టబెట్టారు అనే అపవాదు కలుగవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ క్రైస్తవులు ఎలా అధిగమిస్తారు? జవాబు:  ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకోవాలంటే ముందు ఆ వచనాలను వాటి పూర్వోత్తరసందర్భములతో పరిశీలించాలి:పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న: యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ”నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని ఎవరికి ప్రార్థన చేయుచున్నారు? (మార్కు 15:34; మత్తయి 27:46) తాను తనకే ప్రార్థన చేసుకుంటున్నారా? అదే వాస్తవం అయితే, తనను తానే చెయ్యి విడిచిచానని తాను తనకే ఫిర్యాదు చేసుకుంటున్నారా? జవాబు: పరిశుద్ధ గ్రంథములో దేవుని గూర్చి, “దైవం” అనగా అవిభక్తమై ఎవరూ వేరుచేయ సాధ్యముకాని ముగ్గురు విడి విడి వ్యక్తులు, అనగా తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అని వ్రాయబడియున్నది. మరియు వీరు అవిభక్తముగా ఏకమై ఉంటూ అద్వితీయ త్రియేకదేవునిగా ఉన్నారని తెలియజేస్తుంది. దైవంలోని ముగ్గురు వ్యక్తులూ నిత్యమూ అవిభక్తమైన వారు కాబట్టి, వారి మధ్య ఒకరిపట్ల మరొకరికి ప్రేమగల అన్యోన్య సహవాసము మరియు సంభాషణ కలిగి ఉంటారు. కాబట్టి,  ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద తాను తనకే ప్రార్థనపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రశ్న: దేవుడు చనిపోడు కదా, మరి యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే ఆయన ఎలా చనిపోగలరు? యేసు చనిపోయి ఉన్న ఆ మూడు దినములు  విశ్వమును నడుపుచుండినది ఎవరు? జవాబు: పై ప్రశ్నను వేసినవారు ఆ ప్రశ్నను ఏ కోణం నుండి వేస్తున్నారంటే – మరణము అనగా ‘ఉనికిలో లేకుండుట’ లేక ‘అభావముగా మారుట’, కాబట్టి యేసు చనిపోయారు అంటే, దేవుడు తన ఉనికిని నిలుపు చేశాడు లేక అభావముగా అయ్యాడు అని అర్థం కదా, కాని అది ఎన్నటికి జరుగలేని విషయం గదా! అనే భావనతో ఆ ప్రశ్నను వేస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే వారు మరణమునకు తీసుకున్న తప్పు నిర్వచనం.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ప్రభువైన యేసు క్రీస్తు మరియు దేవుడైన యెహోవా ఒక్కరేనని తెలియజేయుచున్న నామములు, బిరుదులు మరియు లక్షణముల యొక్క లేఖన భాగాల పట్టిక “ఒక్కడే దేవుడున్నాడు” – 1 కొరింథీయులకు 8:6 పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ఈ క్లుప్తమైన సమాచారమే క్రీస్తు దైవత్వమును గూర్చి క్రొత్తనిబంధన మనకు ఇస్తున్న సమగ్రమైన సమాచారము అని దీని భావము కాదు. కాని క్రీస్తు దైవత్వమును నిరూపించుటకు ఇది ఒక విధానము.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…