యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడుట, మరణించుట మరియు పునరుత్థానము చెందుట అనేవి క్రైస్తవ విశ్వాసానికే గుండెకాయ వంటివి. క్రైస్తవుడు నమ్మి నిరీక్షించు ప్రతి విషయము అపాత్రులైన పాపులకొరకు సిలువపైన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన మరణము చుట్టూ  పరిభ్రమిస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువు తాను చేసిన నేరములకొరకు చనిపోలేదు, కాని అపారమైన పరిశుద్ధత నీతియుగల దేవుని యెదుట నిలువబడుటకు విమోచన మరియు నీతి పొందవలసియుండిన పాపుల స్థానములో ఆయన చనిపోయాడు అని చెప్పే దైవతీర్పే పునరుత్థానము. యేసు క్రీస్తు ప్రభువు మరణించలేదు మృతులలోనుండి లేవలేదు అని రుజువుచేయబడితే, క్రైస్తవ్యము తరతరాలుగా కోట్లాదిమందిని మోసము చేయుచున్న ఒక అబద్దమే తప్ప మరేమీ కాదు. క్రైస్తవుడు నిరీక్షణ లేకుండా, నీతిని గురించిన నిశ్చయత లేకుండా, తన పాపములలోనే నిలిచియుండిపోతాడు (1కొరింథీయులకు 15:12-19; రోమీయులకు 4:25, 5:8-11).పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

యేసుక్రీస్తు చనిపోలేదు సిలువ కూడా వేయబడలేదు అని ఆధునిక ముస్లింలు ఆరోపించటం సాధారణముగా మనం వింటూనే ఉంటాము. సూరా 4:157ను ప్రామాణికముగా చూపుతూ యేసుక్రీస్తు రూపము ఇస్కరియోతు యూదాపైకి మార్పిడి చేయబడింది అని వారు చెప్పుట కూడా సాధారణముగా వింటూనే ఉంటాము. అంతే కాకుండా, యూదా ఒకసారి యేసువలె కనబడునట్లుగా చేయబడుటవలన ప్రజలు పొరపాటుగా క్రీస్తు స్థానములో ఆయనను సిలువ వేశారు; అందువలన జనసామాన్యము వాస్తవముగా క్రీస్తునే సిలువ వేస్తున్నాము అని అనుకొన్నారు అని కూడా వారు నమ్ముతారు. విచారకరముగా, ఆదిమ ముస్లిం మూలాధార పుస్తకాలలో అటువంటి అభిప్రాయములకు చాలా కొద్దిపాటి ఆధారం కూడా దొరుకదని చాలా మందికి తెలియదు. నిజానికి, ఆదిమ ముస్లిం పండితులందరూ యేసుక్రీస్తు చివరి దినముల గురించి విభేదిస్తూ భిన్నవిభిన్న విశ్వాసాలతో పరస్పర విభేదములు కలిగి ఉన్నారు. ఆదిమ ముస్లిం పండితులందరు కూడా ఒకే అభిప్రాయానికి కట్టుబడియుండక, కొంతమంది క్రీస్తు వాస్తవముగా చనిపోయారు అని నమ్ముతుంటే మరికొందరు దేవుడు ఆయనను చనిపోనియ్యకుండా తిన్నగా పరలోకమునకు పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…