యేసు క్రీస్తు పునరుత్థానము ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పటానికి అనేక కారణాలున్నాయి. మొదటిగా, యేసు క్రీస్తు పునరుత్థానము దేవుని యొక్క అపరిమితమైన శక్తిని తెలియజేస్తుంది. పునరుత్థానమును నమ్మటమంటే, దేవుని నమ్మటమే. దేవుడుండియుంటే, ఈ సృష్టిని ఆయన చేసియుంటే మరియు ఈ సృష్టంతటిపైన ఆయనకు అధికారముంటే, ఖచ్చితముగా ఆయనకు మృతులను లేపే శక్తి ఉంటుంది. ఆయనకు ఆ విధమైన శక్తి లేకుంటే, మన విశ్వాసానికి మన ఆరాధనకు ఆయన యోగ్యుడు కాదు. జీవమును సృజించినవాడు మాత్రమే మరణము తరువాత దానిని తిరిగి బ్రతికించగలడు, ఆయన మాత్రమే అఘోరమైన ఆ మరణమును సైతము ఓడించగలడు, ఆయన మాత్రమే మరణపు ముల్లును తీసివేసి, సమాధిపైన విజయమును పొందగలడు (1కొరింథీ 15:54-55).  యేసు క్రిస్తు ప్రభువును సమాధినుండి తిరిగి లేపుటవలన, జీవ మరణములపైన తనకు సార్వభౌమాధికారము కలదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…