నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;” అని పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3:15లో చెప్పిన రీతిగా సత్యముపైన తూటాలు వేయటానికి వస్తున్న అబద్దప్రవక్తకు, వాని మతమునకు మరియు వాని అనుచరులకు సాత్వికముతో సమాధానమిచ్చుటయే ఈ “జెంటిల్‌ ఆన్సర్స్‌” అను వెబ్సైటు యొక్క ఉద్దేశ్యము.

ఎనిమిది కోట్ల పైబడియున్న తెలుగు జనానికి, మాతృ భాషలో సవివరంగా సమాచారమును అందించుటయే ఈ “జెంటిల్‌ ఆన్సర్స్‌” యొక్క లక్ష్యము.

ఈ వెబ్సైటు వెనుకనుండి నడిపిస్తున్నది ఎవరు అని తెలుసుకొనుటకన్నా, ఈ వెబ్సైటులోని సమాచారమును చదివి సత్యమేమిటో తెలిసికొని సర్వసత్యములోనికి నడిపింపబడాలని ప్రార్థన.