హీబ్రూ: ఎబియోన్‌: పేద. హీబ్రూ: ఎబియోనీమ్‌: పేదవారు

ఆది క్రైస్తవ్యములో కనబడిన ఒక పాషండులు (సత్యమునుండి వైదొలగిన మతశాఖ). కొంతమంది ముస్లింలు ఈ శాఖ వారిని నిజమైన క్రైస్తవులు అని నమ్మబలుకుతుంటారు. యేసు క్రీస్తు ప్రభువును వెంబడించుటయే కాకుండా, అందుకు అనుబంధముగా వీరు యూదుల ధర్మశాస్త్రమును (కొన్ని మార్పులతో కలిపి) కూడా పాటించాలని బోధిస్తారు. వీరిని గూర్చినమొదటిసారిగా “ఎబియోనీయుడు” అనే ప్రస్తావన ఇగ్నేషియస్‌ అనునతడు ఫిలదెల్ఫీయులకు వ్రాసిన పత్రికకు సంబంధించిన వ్రాతప్రతులలో కనబడుతుంది, అయితే అది కూడా తరువాత కాలములో చేర్చబడిన పదము అనే అభిప్రాయము ఉంది. (ఎందుకనగా ఆ పత్రికకు సంబందించి పూర్ణముగా నమ్మదగిన ఇతర తర్జుమాలలో వారిని గూర్చిన ప్రస్తావన కనబడదు):

ఎవరైనను దేవుడు ఒక్కడేనని చెప్పి, క్రీస్తు యేసును ఒప్పుకొనినూ, ప్రభువును అద్వితీయకుమారనిగాను, జ్ఞానముగాను, మరియు దేవుని వాక్యముగాను ఒప్పుకొనకుండా, కేవలము మానవునిగా మాత్రమే గుర్తిస్తూ, ఆయన కేవలము దేహము  ప్రాణము మాత్రమే కలిగియున్నవాడని భావిస్తుంటే, అట్టివాడు మానవాళి నాశనముకొరకై మోసమును తప్పును బోధించుచున్న సర్పము. అట్టివాడు గ్రహించుట విషయములో బీదవాడు, అతనిని ఎబియోనీయుడు అనవచ్చును.

ఆ విధముగా ఎబియోనీయులు మూలమును గూర్చి అస్పష్టముగా వ్రాయబడియున్నది. అనేక మంది పండితులు వారిని రెండవ శతాబ్దపు చివరి దశకాలకుకు చెందినవారిగా పరిగణిస్తారు. వారి శాఖను ఎబియోను అను నతడు స్థాపించాడని తొలుతకాలపు క్రైస్తవ రచయితలు పొరపాటుగా తెలియజేశారు. వారిని గూర్చిన ప్రారంభ రచనలు అనేక వివాదాస్పదములుగా ఉన్నవి.

ఎబియోనీయుల సిద్దాంతపు అనేక లక్షణాలు ఖుమ్రాన్‌ శాఖవారి ప్రారంభ బోధనలలో ముందుగానే ఉండినట్లుగా మృత సముద్రపు చుట్టలులో చూస్తాము. దేవుడు ఒక్కడేననియు, యేసును మెస్సీయా అనియు మరియు ఆయనే ద్వితీయోపదేశకాండము 18:15లో ప్రస్తావించబడిన ఆ నిజమైన “ప్రవక్త” అనియు వారు నమ్మేవారు మరియు బోధించేవారు. వారు యేసు కన్యకు జన్మించాడు అనే వాస్తవాన్ని తృణీకరించి, ఆయన యోసేపు మరియలకు సాధరణరీతిలో జన్మించాడని విశ్వసించేవారు. యేసు యూదుల ధర్మశాస్త్రమునకు విధేయుడైనందున ఆయన మెస్సీయా అయ్యాడని ఎబియోనీయులు నమ్మేవారు. శాఖాహారము, పరిశుద్ధమైన బీదరికము, శుద్దీకరణాచారములు, మరియు జంతు బలులను వ్యతిరేకించుట వంటి వారి బోధనలు సమర్థించుకోవటానికి  ధర్మశాస్త్రములోని కొన్ని వాక్యములను మానవ ప్రక్షిప్తాలని చెప్పి, వాటిని తొలగించివేసినప్పటికినీ, (మిగిలిన) ధర్మశాస్త్రమును వారు సద్భక్తితో పాటించేవారు. ఎబియోనీయులు యెరుషలేము పట్ల గొప్ప పూజ్యభావమును కలిగియుండేవారు. (ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఆన్‌లైన్‌)

యూసేబియస్‌ మరియు ఓరిగెన్ అనువారు తమ‌ రచనలలో, ఎబియోనీయులను గురించి తెలియజేస్తూ వారు ద్విగుణ (రెండు రకాల) శాఖ వారని తెలియజేశారు. ఇతరులు ఏ వ్యత్సాసమును చూపించలేదు. యూసేబియస్‌ మరియు ఓరిగెన్‌ అనువారు నజరేనీయులను పట్టుకొని ఎబియోనీయులని పొరబడుచున్నారని కొంతమంది పండితులు అంటారు. కావున ఎవరు ఏ గ్రూపును గూర్చి (నిజముగా అక్కడ ఒకటికంటే ఎక్కువ గ్రూపులుంటే) మాట్లాడుతున్నారో జాగ్రత్తగా పరిశీలన చేయవలసియున్నది. ఎబియోనీయుడైన సుమ్మకాస్‌ వ్యాఖ్యానములను, తాను సుమ్మకాస్‌ వద్దనుండే వారసత్వముగా పొందుకున్న జులియానా వద్దనుండి, సంపాదించుకున్నట్లు ఓరిగెన్‌ చెప్పియున్నాడు. సుమ్మకాస్‌ తన వ్యాఖ్యానములలో మత్తయి వ్రాసిన సువార్తపైన ఆక్షేపణలు చేశాడు.

ఉమ్మడిగా, వారు యూదుల ధర్మశాస్త్రముయొక్క ప్రాముఖ్యతను నమ్ముతారు మరియు యేసు క్రీస్తు ప్రభువుయొక్క దైవత్వమును నమ్మరు. ఆవిధముగా రెండు శాఖల మధ్యనున్న వ్యత్సామును మనము గమనించగలము. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క మాధిరికరమైన ప్రవర్తన, ఆయన దేవుని కుమారునిగా ఎంచబడిన విధానము, దత్తస్వీకారవాదమునకు చాలా దగ్గరగా ఉంటుంది. హెబియోను గురించి తెర్తుల్లియాన్‌ ప్రస్తావించాడు.

(సాధారణమైన?, సంయుక్తమైన?) ఎబియోనీయుల శాఖకు మరియు ఇస్లాంకు మధ్యనున్న తారతమ్యము చూచుట:

 

విశ్వాసము  ఎబియోనీయులు ముస్లింలు
యేసు క్రీస్తు ప్రభువు యొక్క  మనుష్యత్వము “వారు ఆయనను సాధారణమైన మామూలు మనిషిగా పరిగణించారు” (యూసేబియస్‌ HE III 27.2)

“అయితే, ఆయన శరీరధారిగా జన్మించుటకు పూర్వమునుంచి ఉన్నవాడని, ఆయనను దేవుడు, వాక్యము, మరియు జ్ఞానము అని వారు అంగీకరించరు (యూసేబియస్‌ HE III 27.3)

యేసు క్రీస్తు ప్రభువు ఒక మానవుడు, దైవము కాదు అని నమ్ముతారు (యేసు అను వ్యాసము చదవండి). ఆయన కలిగియున్న అనేకమైన ప్రత్యేకమైన లక్షణాలను బట్టి ఆయనను “మామూలు” మరియు “సాధారణమైన” మానవుడుగా అంగీకరిస్తారో లేదో స్పష్టముగా తెలియదు. మరియు ముస్లింలు యేసు క్రీస్తు ప్రభువును దేవుని వాక్యము అని నమ్ముతారు.
కన్యకకు జన్మించుట “కేరింథు… యేసు క్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించలేదు, కాని  యోసేపు మరియలకు సాధారణమైన మానవ సంతానమువలెనే జన్మించాడు అని తెలియజేశాడు… ప్రభువును గూర్చి వారి (ఎబియోనీయుల) అభిప్రాయములు కూడా కేరింథు మరియు కర్పోక్రతేసు అనువారి అభిప్రాయముల వంటివే (ఈరేనైయాస్‌, Against Heresis 1.26.1-2)

[గమనిక: దిగువనీయబడిన పట్టికలో భిన్నమైన వివరణ కలదు]
యేసు క్రీస్తు ప్రభువు కన్యకు జన్మించాడని నమ్ముతారు
యేసు ప్రభువు క్రీస్తు కాదు కేరింథు…  ఆయన (యేసు) బాప్తీస్మము తీసుకున్న తరువాత, ఆయన మీదకు సర్వోన్వతుడైన ప్రభువునొద్దనుండి పావురమువలె క్రీస్తు దిగివచ్చాడు, తరువాతనే ఆయన ఎవరికీ తెలియని తండ్రిని ప్రకటించాడు, మరియు అద్భుతములను చేశాడు. చివరకు క్రీస్తు ఆయననుంచి వెడలిపోగా, విడువబడిన యేసు శ్రమనొంది తిరిగి లేచాడు, అదే సమయములో క్రీస్తు ఆత్మయైయున్న రీతిగానే అభేద్యుడిగా (తరింపరానివానిగా) మిగిలిపోయాడు… ప్రభువు విషయమైన వారి (ఎబియోనీయుల) అభిప్రాయములు కేరింథు మరియు కర్పోక్రతేసు అనువారి అభిప్రాయముల వంటివే (ఈరేనైయాస్‌, Against Heresis 1.26.1-2[ఇక్కడ, యేసు  మరియు క్రీస్తు అనువారు ఒక్కరు కాదని, వేర్వేరు వ్యక్తులని అయితే క్రీస్తు యేసు మీదకు దిగివచ్చాడని ఎబియోనియులు నమ్ముచున్నట్లుగా స్పష్టముగా తెలుస్తుంది.] వాస్తవానికి యేసు ప్రభువు క్రీస్తు (మెస్సీయా) అని నమ్ముతారు. ఖుర్‌’ఆన్‌ లో అల్‌-మసీహ్‌ అనే బిరుదు ప్రత్యేకముగా యేసుకు వాడబడింది.
యేసు ప్రభువులో దేవదూత “ఎబియోను విషయములో ఈ అభిప్రాయము యోగ్యమైనది, అతడు యేసు కేవలము మానవుడని, దావీదు సంతానము తప్ప మరేమియు కాదని, దేవుని కుమారుడు కూడా కాదు అని నమ్ముతాడు; అయినను ఆయన ఒక విషయములో మాత్రము ప్రవక్తలకంటే ఎక్కువ ఘనత కలిగినవాడని, ఎందుచేతననగా జెకర్యాలో దేవుని దూత ఉన్నట్లుగా ఆయనలో కూడా దేవుని దూత ఉందని అతడు చెప్పేవాడు.” (?++తెర్తుల్లియన్‌?++) దేవ దూత యేసుకు సహాయము చేసింది, కాని ఆయనలో నివసించలేదు అని ముస్లింలు నమ్ముతారు.
మరొక క్రీస్తు కావున, (ఎబియోనీయుల ప్రకారము) మిగిలిన (మానవాళి) వారిలో ఎవరూ ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించలేకపోయిన కారణమున ఆయన (రక్షకుడు) దేవుని క్రీస్తు మరియు యేసు అని పిలువబడ్డాడు. ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న ఆజ్ఞలన్నిటిని ఎవరు నెరవేర్చినా అతడు క్రీస్తు అని పిలువబడతాడు. మరియు తమ వరకు తాముకూడా క్రీస్తులు (అని ఎబియోనీయులు ఆపాదించుకుంటారు); ఎందుకనగా అందరివలెనే (సమస్త మానవాళి వలెనే) ప్రభువు కూడా మానవమాత్రుడు అని వారు వక్కాణించి చెప్తారు. (హిప్పోలుతాస్‌, రెఫ్యుటేషన్‌ ఆఫ్‌ ఆల్‌ హెరెసీస్‌ 7.22) ఖుర్‌’ఆన్‌లో క్రీస్తు అని పిలువబడిన యేసు తరువాత మరొక క్రీస్తు వస్తాడని ఏవిధమైన సూచన కనపడదు. ఎవరైనా క్రీస్తు అని పిలువబడవచ్చు అని ఎబియోనీయులు నమ్ముతారు, కాని మెస్సీయ పట్ల ప్రత్యేకమైన ఆలోచన విధానము కలిగియున్నట్లు ముస్లింలు కనిపిస్తారు.

అంతేగాక, ముహమ్మద్‌ కూడా దేవునికి పూర్తిగా విధేయత చూపించాడని ముస్లింలు నమ్ముతారు, కావున ఎబియోనీయుల నమ్మకము ప్రకారము ముహమ్మద్‌కూడా ఒక క్రీస్తు.

యేసు యొక్క సద్గుణములు కేరింథు… యేసును ఈ విధముగా తెలియజేశాడు… ఇతరులకంటే చాలా నీతిమంతుడు, వివేకముగలవాడు, మరియు తెలివైనవాడు. … యేసు విషయములో వారి (యెబియోనీయుల) అభిప్రాయములు కేరింథు మరియు కర్పోక్రతేసుల వారి అభిప్రాయముల వంటివే.” (ఈరేనైయాస్‌, Against Heresis 1.26.1-2). సద్గుణములను (క్రియలను) బట్టి యేసు నీతిమంతునిగా తీర్చబడ్దాడని ఖుర్‌’ఆన్‌ చెప్పుచున్నట్లుగా కనిపించదు.
యూదుల ధర్మశాస్త్రమునకు అనుబంధాలు (1) పరదేశులను ముట్టుట, (2) సమాగమం అయిన తరువాతు శుద్ధి చేసుకొనుట, (3) కట్టుకున్న వస్త్రములపైనే స్నానమాచరించుట (ఎపిఫనియస్‌, పనరియాన్‌ 30.2.3-6) (1) అవిశ్వాసలుతో సహవాసం చేయకంటి, వారిని మీ రక్షకులుగా నియమించుకోకండి అని చెప్పినను, పరదేశులను అంటుకోవద్దు అనేది మాత్రం ముస్లింల విశ్వాసం కాదు. (2) అనుగుణముగానుంది. (3) దీని గురించి వివరణ తెలియదు.
ప్రభువు రాత్రి భోజనము పులియని రొట్టెలతో ప్రభువు రాత్రి భోజనమును ఆచరిస్తారు (లూకా22:15-20, 1 కొరింథీయులకు 11:23-29) (ఎపిఫనియస్‌, పనరియాన్‌ 30.16.1) ప్రభువు రాత్రి భోజనమును ఆచరించరు
యేసు పొందిన శ్రమలు “… యేసు శ్రమపొంది తిరిగి లేచెను” (ఈరేనైయాస్‌, Against Heresis 1.26.1-2) యేసు శిలువ వేయబడలేదనియు, ఆయన వంటి వేరొకరు శిలువవేయబడ్డారనియు నమ్ముతారు. పొంతి పిలాతు ఎదుట ఆయన శ్రమ పొందాడా లేదా అనేది అస్పష్టమైన విషయము.
సువార్త “ఎబియోను తరువాత కేరింథు తరువాత వచ్చినను, ప్రతివిషయములోను అతడు కేరింథుతో ఏకీభవించలేదు; ఆ విధముగా లోకము దేవదూతల చేత కాదు దేవుని చేత నిర్మించబడినది అని నమ్మినవాడు; “శిష్యుడు బోధకునికంటే అధికుడు కాడు, దాసుడు యజమానునికంటే అధికుడు కాడు” అని చెప్పబడియున్నందున, ధర్మశాస్త్రము అనివార్యమైనది అంటారు, ఆ విధముగా వారు సువార్తను ప్రక్కనబెట్టి యూదుమతమును సమర్ధిస్తారు. (?++తెర్తుల్లియన్‌?++) [గమనిక: ఎబియోనీయులు హెబియోను లేక ఎబియోను నుంచి వచ్చినవారు అని ముగింపుకు తెర్తుల్లియన్‌ రావటాన్ని మనము చూడవచ్చు] యేసుకు ఇంజీలు పంపబడింది.
మత్తయి వ్రాసిన సువార్త “మత్తయి వ్రాసిన సువార్తను మాత్రమే వారు ఉపయోగిస్తారు” (ఈరేనైయాస్‌, Against Heresis 1.26.1-2) మరియు ఎపిఫనియస్‌, పనరియాన్‌ 30.3.7 బైబిలు గ్రంథములోను సువార్తలను గాని, హెబ్రీయులు వ్రాసిన అప్రమాణిక సువార్తనుగాని దేవుని లేఖనములుగా ముస్లింలు అంగీకరించరు. బర్నబా వ్రాసిన సువార్తనను  ఇంజీలు అని కొన్నిసార్లు ముస్లింలు చెప్తుంటారు.
పౌలు పౌలు అన్యుడు, యూదురాలిని పెండ్లి చేసుకొనుట కోసం మతము మార్చుకున్నాడు, కావున యూదా మతమునుకు వ్యతిరేకముగా లేచాడు. [పేతురు వలె, పౌలు కూడా వివాహము చేసికొన్నట్లు బైబిలులో ఏ విధమైన ఆధారము లేదు (1 కొరింథీ 9:5 చూడండి)] పౌలు యూదుడు అని నమ్ముతారు. పౌలు వివాహాము విషయములో ఏమీ చెప్పరు
పాత నిబంధన ప్రవక్తలు పాత నిబంధన ప్రవక్తలను తృణీకరిస్తారు (ఎపిఫనియస్‌, పనరియాన్‌ 30.18,4-5) పాత నిబంధన ప్రవక్తలలో అనేకమందిని అంగీకరిస్తారు
శాఖాహారము శాఖాహారమును నమ్ముతారు అవలంభించరు
పేదరికము “ఎబియోనీయులు, “పేదరికము” అను అర్థమునిచ్చు మాటనుంచి తమ పేరును ఏర్పాటుచేసుకున్నారు. (?++ ఓరిగెన్‌?++) అవలంభించరు. భౌతికమైన ఐశ్వర్యము అల్లాహ్‌ యొక్క ఆశీర్వామని నమ్ముతారు.

 

ద్విగుణ శాఖకు (రెండు రకాల శాఖకు) మరియు ఇస్లాంకు మధ్యనున్న తారతమ్యము చూచుట:

విశ్వాసము ఎబియోనీయులు 1 ఎబియోనీయులు 2 ముస్లింలు
కన్యకకు జన్మించుట

“…ఇతర మానవుల వలెనే ఆయనకూడా పుట్టాడు.” (ఓరిగెన్‌, Contra celsus, v. 61). ఆ విధముగా, మరియ యోసేపు అను దంపతులకు దాంపత్య ఫలితముగా యేసు పుట్టాడు.

“మరియతో  ఒక పురుషుని సమాగమం వలన కలిగిన ఫలము” (యూసేబియస్‌, HE III 27)

“వీరు ఎబియోనీయులలో రెండవ రకం, వీరు యేసు కన్య గర్భాన జన్మించాడని మనతో ఏకీభవిస్తారు…” (ఓరిగెన్‌, Contra celsus, v. 61).

“పరిశుద్ధాత్మ వలన ప్రభువు కన్యకకు జన్మించాడని నమ్ముతారు” (యూసేబియస్‌, HE III 27)

యేసు క్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించాడని ముస్లింలు నమ్ముతారు, రెండవ రకం ఎబియోనీయులు (ఎబియోనీలు 2) విశ్వాసాలు ముస్లింల విశ్వాసాలకు అణుగుణముగా ఉన్నట్లు కనబడుతుంది. అయినప్పటికి, కన్యక గర్భాన జన్మించాడు అనే విషయమును అంగీకరిస్తున్న ఎబియోనీయులను గురించి మాట్లాడుతూ, వారు “మనతో ఏకీభవిస్తారు” అని ఓరిగెన్‌ వక్కాణించి చెప్పాడు. అనగా క్రైస్తవుల వలెనే వారుకూడా కన్య గర్భాన పుట్టటానికి కారకుడు పరిశుద్ధాత్ముడు అని నమ్ముతారు. లేదంటే, దానికి తగిన అసమ్మతి కారణమును ఓరిగెన్‌ తెలియజేసుండేవాడు. యూసేబియస్‌ వ్రాసిన మాటలు పరిశుద్ధాత్మ కారకుడు అనే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

ఇస్లాంలో పరిశుద్ధాత్మడు దేవుని దూతయైన జిబ్రీల్‌ (గబ్రియేలు)

హెబ్రీయులు వ్రాసిన సువార్త ? “వారు కేవలము హెబ్రీయులు వ్రాసిన సువార్తను మాత్రమే ఉపయోగించేవారు” (యూసేబియస్‌, HE III 27) సువార్తలనన్నిటిని, అవి  బైబిలుగ్రంథములోనివైనా లేక హెబ్రీయులు వ్రాసిన సువార్తయైనా  వారు తృణీకరిస్తారు.
అపొస్తలులు వ్రాసిన పత్రికలు ? వాటిని తృణీకరిస్తారు వాటిని తృణీకరిస్తారు
పునరుత్థానము ? “… మనవలెనే, ప్రభువు దినమును రక్షకుని పునరుత్థాన జ్ఞాపకార్ధ దినముగా ఆచరిస్తారు.” (యూసేబియస్‌, HE III 27) ప్రభువు దినమును ఆచరించటమంటే యేసు క్రీస్తు పునరుత్థానమును ఆచరించుటయే.

యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డాడని ముస్లింలు నమ్మరు, అది కేవలము యూదులకు ఆ విధముగా కనిపించింది. యేసు అల్లాహ్‌ యొద్దకు “ఎత్తికొనిపోబడ్డాడు” అని మాత్రమే నమ్ముతారు. ఆ విధముగా, ఇస్లాం పునరుత్థానమును గడచిపోయిన సంఘటనగా బోధించదు, కాని యేసు ఆల్లాహ్‌నొద్దకు ఆరోహణమై వెళ్లాడు అని బోధిస్తుంది. ఆయన మరలా వస్తాడు అప్పుడు ఆయన చనిపోయి పునరుత్థానుడౌతాడు అని ముస్లింలు నమ్ముతారు.

ఈ వ్యాసములు చదవండి: [ 1, a reply to a reply to 1, 2, 3, 4, 5, 6, 7 ]

అయినప్పటికిని, నజరేనీయులు లేక ఎబియోనీయులు “నిజమైన ముస్లింలు” అని చెప్పబడుచున్న “నిజమైన క్రైస్తవులు” అయినప్పటికినీ, దైవశాస్త్ర పరముగా మరొక సమస్య మనము ఎదుర్కొనవలసి వస్తుంది: అల్లాహ్‌ చేత బలపరచబడుచున్న “నిజ క్రైస్తవులు” “పౌలు యొక్క తప్పుడు బోధ” పైన పూర్తిగా విజయము సాధించి, వారిని జాడ లేకుండా తొలగించి వేయవలసియున్నది. అంత మాత్రమే కాదు, నిజమైన విశ్వాసులు ప్రబలము చెందియున్నారు అని విశేషముగా ఖుర్‌’ఆన్‌ చెప్తున్నది, అయితే నజరేనీయులు గాని (ఒకవేళ వారు పాషండులు అయినప్పటికిని) లేక ఎబియోనీయులు గాని మిగిలిన మౌళికమైన క్రైస్తవ్యమును మించి ప్రబలము చెందలేదు.

 

(ఆంగ్ల మూలం)

Leave a Reply