అబు లహబ్‌
అబ్ద్‌ అల్‌-ఉజ్జా

అబు లహబ్‌ అనగా “కీలకలకు తండ్రి” అని అర్థము. ఇది ముహమ్మద్‌ తండ్రియైన అబ్దుల్లాహ్‌ యొక్క సహోదరులలో ఒకడగు అబ్దుల్‌ ముత్తాలిబ్ కుమారుడైన అబ్దుల్‌ ఉజ్జాకు పెట్టబడిన ముద్దు పేరు. ముహమ్మద్‌ పినతండ్రియైన అబు తాలిబ్‌ తదనంతరం హషీమ్‌ తెగకు అబు లహబ్‌ నాయకునిగా ఉన్నాడు. అబు తాలిబ్‌ బ్రతికియున్నపుడు అతను ముహమ్మద్‌ను కాపాడుచూ వస్తే, అబు లహబ్‌ ఆ కాపుదలను తొలగించివేశాడు. అల్‌-లహబ్‌ 111:1-3; సహీహ్ అల్-బుఖారీ 2.477

  • అతని భార్య అల్‌-లహబ్‌ 111:4-7

సూరా 111 లో  అబు-లాహబ్ ను శపించిన మాటలను ముస్లింలు ప్రవచనాత్మకమైనవిగా తీసుకొని ఖురాన్ దైవ ప్రేరితమైనదని వాదించుటకు పూనుకుంటారు. దీనిని గురించి విఫులంగా తెలుసుకొనుటకు ఖుర్‌’ఆన్‌లో ప్రవచనాలున్నాయా? అనే భాగములోని వ్యాసములు చదవండి.

“అబు లహబ్‌” అనే మారుపేరు వచ్చిన వివరాలు ఆలోచనీయమైనవిగా ఉంటాయి.

… అతని బుగ్గలు ఎప్పుడు ఎఱ్ఱగా అగ్ని కీలకలువలె ఉండేవి కావున అతనిని అబు లహబ్‌ అని పిలిచేవారు.

అబు లహబ్‌ (అగ్ని కీలకలకు తండ్రి) అనగా అగ్ని కీలకలను కలిగియున్నవాడు లేక మండుచున్న స్వభావము గలవాడు  అనగా కోపము మరియు అసూయ అతనిలో ఎల్లప్పుడు అగ్ని కీలకలువలె ఎగసి పడుతుంటాయి అని అర్థం. కావున, ఎవరైతే సత్యమునకు శత్రువుగాను, విరోధముగాను ఉంటారో మరియు ఎవరైతే కోపముతోను అసూయతోను మండిపడిపోతుంటారో వారిని అబు లహబ్‌ అని పిలవవచ్చు (ఆధారం, 29 మార్చి 2011)

ఇక్కడొక ముఖ్యమగమనిక ఏమిటంటే ప్రాథమిక గ్రంథాలు ఈ విషయాలను బలపరచవు.

Leave a Reply