అరబిక్: అల్-అబ్బసియహ్ అనేది రెండవ అతి పెద్ద ముస్లిం సామ్రాజ్యం (క్రీ.పూ. 750-1258) ఉమయ్యద్లు తరువాత పాలించింది. ఈ సామ్యాజ్యానికి రాజధాని బాగ్దాద్. మరియు ఈ నియమిత కాలములో అభివృద్ధి అధికముగా జరిగింది. ఈ సామ్రాజ్యపాలన ముహమ్మద్ పినతండ్రియైన అబ్బాస్‌తో ప్రారంభమైంది. ముహమ్మద్‌తో అతనికున్న దగ్గర బంధుత్వమునుబట్టి, అరబ్బీయులు వారిని చాలా ఉన్నతంగా గౌరవించారు, మరియు వారికిని ఉమ్మయ్యద్ వారికిని మధ్య చాలా గొడవలు జరిగినవి. కొంతకాలము వ్యాజ్యెములను కొంతకాలము ఖలీఫాకు తెలియజేసి, తరువాత క్రీ.శ. 746లో వారు తమ వైరమును బహిరంగముగానే చూపించారు. అబు’ల్ అబ్బాస్ అస్-సఫ్ఫా (“రక్తపాతకుడు”) క్రీ.శ. 749లో ఉమ్మయ్యద్ ఖలీఫా మార్వన్ II ని ఓడించి కుఫాలో ఖలీఫాగా అధికారం చేపట్టాడు, మరియు మార్వన్ II చంపించేశాడు.
అబ్బాసిదీ ఖలీఫాల జాబితా:
క్రీ.శ. 749 – అబు’ల్ అబ్బాస్ అస్-సఫ్ఫా
క్రీ.శ. 754 – అల్ మన్సుర్
క్రీ.శ. 775 – అల్ మహ్దీ
క్రీ.శ. 785 – అల్ హాదీ
క్రీ.శ. 786 – హారూన్ అర్-రషీద్ (దిగువ చూడండి)
క్రీ.శ. 809 – అల్ అమీన్
క్రీ.శ. 813 – అల్ మా’మున్
క్రీ.శ. 833 – అల్ ము’తసిమ్
క్రీ.శ. 842 – అల్ వాతిఖ్
క్రీ.శ. 847 – అల్ ముతవ్వకిల్
క్రీ.శ. 861 – అల్ ముంతసిర్
క్రీ.శ. 862 – అల్ ముస్త’యిన్
క్రీ.శ. 866 – అల్ ము’తజ్జ్
క్రీ.శ. 869 – అల్ ముహ్తదీ
క్రీ.శ. 870 – అల్ ము’తమిద్
క్రీ.శ. 892 – అల్ ము’తదిద్
క్రీ.శ. 902 – అల్ ముక్తఫీ
క్రీ.శ. 908 – అల్ ముఖ్త్తదిర్
క్రీ.శ. 932 – అల్ ఖాహిర్
క్రీ.శ. 934 – అర్ రాదీ
క్రీ.శ. 940 – అల్ ముత్తఖీ
క్రీ.శ. 944 – అల్ ముస్తక్ఫీ
క్రీ.శ. 945 – అల్ ముతీ
క్రీ.శ. 974 – అత్ తా’ఈ
క్రీ.శ. 994 – అల్ ఖాదిర్
క్రీ.శ. 1031 – అల్ ఖా’ఇమ్
క్రీ.శ. 1075 – అల్ ముఖ్తదీ
క్రీ.శ. 1094 – అల్ ముస్తజ్హిర్
క్రీ.శ. 1118 – అల్ ముస్తర్షిద్
క్రీ.శ. 1135 – అర్ రాషీద్
క్రీ.శ. 1136 – అల్ ముఖ్తఫీ
క్రీ.శ. 1160 – అల్ ముస్తన్జిద్
క్రీ.శ. 1170 – అల్ ముస్తదీ
క్రీ.శ. 1180 – అన్ నాసిర్
క్రీ.శ. 1225 – అజ్ జాహిర్
క్రీ.శ. 1226 – అల్ ముస్తన్సిర్
క్రీ.శ. 1242 నుంచి 1258 – అల్ ముస్త’సిమ్
అల్ ముస్త’సిమ్ పాలనలో గెంగిస్ ఖాన్ మనవడైన హులకు పర్షియాలో ప్రవేశించి క్రీ.శ. 1256లో సుల్తాన్‌గా అధికారాలు చేపట్టాడు. 1258లో అతను బాగ్దాద్‌ను జయించి అల్ ముస్త’సిమ్‌ను చంపివేశాడు.
హారూన్ అర్ రషీద్ ఈ ఖలీఫాలందరికంటే బాగా ప్రాచుర్యము కలిగిన వ్యక్తి అయ్యుండవచ్చు, అందుకు కొంత కారణం “1001 రాత్రులు” కథలు. అతని గురించి మరియు అతని రాజ్యపాలన గురించి, హారూన్ అల్ రషీద్ యొక్క “స్వర్ణ యుగం” అంటే ఏమిటి, ఏమైయున్నది అనే వ్యాసములో చూడవచ్చును.