అరామిక్‌: హారూన్‌

హీబ్రూ: ‘అహరోన్‌ (אַהֲרֹן ), అనగా “వెలుగు తెచ్చువాడు”, “ప్రకాశింపచేయువాడు” లేక “పర్వతప్రాంతవాసి”, “కొండంత బలము”

గ్రీకు: ఆరోన్‌ (Ἀαρών)

బైబిలు గ్రంథములోనుంచి నేపథ్య సమాచారము

అహరోను మోషేకు అన్న, లేవీయుడు మరియు మొదటి ప్రధాన యాజకుడు. అహరోను గురించి ఇస్లామీయ గ్రంథాలలో చాలా తక్కువే చెప్పబడింది. అయితే, అతను అమ్రాము మరియు లేవీ కుమార్తెయైన యాకెబెదుల (నిర్గమ 6:20) పెద్దకుమారుడు అని బైబిలుగ్రంథము ద్వారా మనకు తెలుస్తుంది. అహరోను మోషేకంటే మూడు సంవత్సరముల పెద్దవాడు కాని మిర్యాము కంటే చిన్నవాడు (నిర్గమ 2:1,4; 7:7)

అహరోను యూదా కుటుంబికురాలును అమ్మీనాదాబు కుమార్తెయుయైన ఎలీషెబను పెండ్లిచేసికొనెను (నిర్గమ 6:23; 1దినవృత్తాంతములు 2:10). వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు మరియు ఈతామారు అను నలుగురు కుమారులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల విమోచనకు సమయము ఆసన్నమైనపుడు అతను తన సహోదరుడైన మోషేను కలుసుకొనుటకు దేవుని చేత పంపబడ్డాడు (నిర్గమకాండము 4:14, 27-30). అతను మోషేకు “నోరు”గా లేక “ప్రవక్త”గా నియమింబపడ్డాడు ఎందుకనగా అతను బాగుగా మాటలాడగల వ్యక్తి (నిర్గమకాండము 7:1,2,9,10,19). వారిరువురు కలిసి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశమునకు తోడుకొనిపోవుటకు ఐగుప్తునుండి బయటకు నడిపించిరి.

ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్దము చేయుచున్న సమయములో, మోషే దేవుని కఱ్ఱను చేతపట్టుకొని పోయి కొండ శిఖరము మీద నిలిచినపుడు, అహరోను మరియు అతని సహోదరి భర్తయైన హూరు అనువారు ఆ కొండ మీదకు వెళ్లిరి. యెహోషువా ఇశ్రయేలీయులకు విజయము తీసుకొని వచ్చు పర్యంతము వారిరువురు బరువెక్కిన మోషే చేతులను ఎత్తిపట్టుకొనిరి (నిర్గమకాండము 17:8-13).

సీనాయి పర్వతము నొద్ద, దేవుని ఆజ్ఞలను తీసుకొనివచ్చుటకు మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు, అహరోను అతని ఇద్దరు కుమారులైన నాదాబు అబీహులు మరియు డెబ్బది మంది పెద్దలు మోషేతో కూడా ఎక్కిపోయిరి (నిర్గమకాండము 19:24;24:9-11). మోషే తిరిగి వచ్చినప్పుడు, అతడు అహరోనును తీవ్రముగా గద్దించాడు, కానీ అతని గురించి దేవుని యెదుట బ్రతిమాలుకున్నాడు. దేవుడు అతని పాపమును క్షమించాడు (ద్వితీయోపదేశకాండము 9:20).

ఇశ్రాయేలీయుల మధ్య స్థాపించవలసిన ఆరాధన పద్ధతిని గురించిన సూచనలను మోషే దేవుని యొద్దనుంచి పొందుకున్నాడు. అహరోను అతని కుమారులు యాజకత్వము చేయుటకు ప్రతిష్టించబడ్దారు (లేవీయకాండము 8,9). అహరోను ప్రధాన యాజకునిగా ప్రతిష్టించబడ్డాడు.

ఇశ్రాయేలీయులు పారాను అరణ్యములోని హజేరోతు చేరినప్పుడు, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసికొనిన కారణముగా అహరోను మిర్యాములు మోషేకు విరోధముగా మాటలాడిరి. దేవుని కోపము వారి మీద రగులుకొనగా మిర్యామును తెల్లని కుష్ఠుగలదాయెను (సంఖ్యాకాండము 12), మరియు అహరోను తమ దోషమును గ్రహించెను. మోషే విజ్ఞాపన చేయగా దేవుడు వారిని క్షమించెను.

ఇరువది సంవత్సరముల తరువాత, పారాను అరణ్యములో ఇశ్రాయేలీయులు మకాము వేసియున్నపుడు, కోరహు దాతాము మరియు అబీరాములు అహరోనుకును మరియు అతని కుమారులకును విరోధముగా దురాలోచన చేసిరి. దేవుడు వారిని వారితో కూడా అనేక వేలమంది ప్రజలను నాశనము చేశాడు (సంఖ్యాకాండము 16). మరియు, గోత్రికుల పెద్దలను వారి వారి గోత్రముల పేరు మీద కఱ్ఱలను తీసుకొని రమ్మని మోషే వారికి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు దైవ సంబంధమైన యాజకత్వానికి అహరోనును ఏర్పాటు చేసుకున్నట్లుగా బయలుపరచాడు. వారు తెచ్చిన కఱ్ఱలు అహరోను కఱ్ఱతో కూడ మందసములో ఒక రాత్రియంత ఉంచగా, ఉదయమున అహరోను కఱ్ఱ చిగిర్చి, పుష్పించి కాయలు కాసియుండెను (సంఖ్యాకాండము 17:1-10). అతనికి నియమించబడిన యాజకత్వమునకు జ్ఞాపకార్థముగా, తరువాత ఆ కఱ్ఱ మందసములో ఉంచబడెను (హెబ్రీయులకు 9:4).

మెరీబా నొద్ద మోషే దేవునికి అవిదేయత చూపించాడు, మరియు అహరోను కూడా అతని అవిధేయతలో చిక్కుకున్నాడు (సంఖ్యాకాండము 20:8-13) మరియు వారిరువురు వాగ్దాన దేశములో ప్రవేశించుటకు అనుమతిని కోల్పోయారు. ఎదోము దగ్గరనున్న హోరు పర్వతము నొద్దకు ఇశ్రాయేలీయులు చేరుకున్నప్పుడు, ఆ పర్వత శిఖరము మీదికి అహరోనును అతని కుమారుడైన ఎలీయజరును తీసుకొని రమ్మని దేవుడు మోషేకు ఆజ్ఞాపించగా ప్రజలందరి యెదుట వారు ఆ కొండ శిఖరమునకు ఎక్కిపోయిరి. అక్కడ మోషే అహరోనుతో తన యాజక వస్త్రములను తీసి ఎలియాజరుకు తొడిగించాడు. 123 సంవత్సరముల వృద్ధాప్యమందు అహరోను ఆ కొండ శిఖరమున చనిపోయెను (సంఖ్యాకాండము 20:23-29; ద్వితీయోపదేశకాండము 10:6; 32:50). ఇశ్రాయేలీయులు అతని కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి. అహరోను ఇద్దరు కుమారులు “అన్యమైన అగ్నిని” అర్పించినందుకు దేవుని చేత చంపబడిరి (లేవీయకాండము 10:1-2). ఎలియాజరు ఈతామారులు మాత్రము బ్రతికిరి. ఎలియాజరు కుటుంబము ఏలీ కాలము వరకు ప్రధానయాజక ధర్మమును కొనసాగించింది, మరియు ఏలీనుంచి సొలొమోను కాలము వరకు ఈతామారు కుటుంబము ప్రధాన యాజక ధర్మము కొనసాగించింది.

అహరోనీయులు

మందిరమునొద్ద పని చేయుటకు సాధారణ యాజక పనులు లేవీయులకు అప్పగింపబడినవి, కాని అహరోను వంశస్తులకు అనగా “అహరోను ఇంటివారికి” లేక అహరోనీయులకు ప్రధాన యాజక పరిచర్య ఇవ్వబడింది. దావీదు కాలములో వారు అనేకమంది ఉన్నారు. (1దినవృత్తాంతములు 12:27). అతని యాజకధర్మము “పరలోక సంబంధమైనవాటి చాయా రూపము” మరియు “మెల్కీసెదకు క్రమము చొప్పున” వచ్చు “వేరొక యాజకుని” కాలము కొరకు ఎదురుచూడవలసినదిగా ప్రజలను నడిపించుటుకు ఉద్దేశించబడినది (హెబ్రీయులకు 6:20)

హోరు పర్వతము పైన అహరోను సమాధి అని చెప్పబడుతున్న ఒక మసీదు కట్టబడింది.  రబ్బీల చేత అన్యమైన మరియు కల్పితమైన కథలు అనేకముగా  వ్రాయబడినవి.

ఇస్లాంలో అహరోను యాజకత్వము

ఆజ్ఞలను తీసుకున్నవానిగా అహరోను గురించి బైబిలు చెప్పదు, కాని ఖుర్‌’ఆన్‌లో మాత్రము మోషేతో పాటు అహరోను కూడా తీర్పులు చేసే గీటురాయిని పొందుకున్నట్లుగా చెప్పబడుతుంది (అల్‌ అంబియా 21:48).

అహరోను పాపము

బైబిలు గ్రంథములో, మోషే సీనాయి పర్వతము మీదికి ఎక్కిపోయి నలుబది రాత్రంబగళ్లు గడిపినప్పుడు, ప్రజలచేత బలవంతము చేయబడిన అహరోను వారిని ఎదిరించలేక వారితో సమ్మతించి బంగారు దూడను చేశాడు. అయినప్పటికిని, దేవుని సందేశహరులకు/ప్రవక్తలకు ఆ విధమైన విగ్రహారాధన సంబంధితమైన తప్పులు చేయటము సాధ్యమేనను విషయమును ముస్లింలు తృణీకరిస్తారు. అయితే, అహరో ఫరోకు భయపడ్డాడనియు (తాహా 20:45), మరియు ప్రజలు దూడను చేసుకున్నపుడు భయపడ్డాడు, వారిని నివారించనందుకు మోషే అతనిని గట్టిగా పట్టుకొని ప్రశ్నించాడు (తాహా 20:92) అని ఖుర్‌’ఆన్‌ గ్రంథములో వ్రాయబడియున్నది.

మెరీబా నొద్ద మోషే దేవునికి అవిదేయత చూపించాడు, మరియు అహరోను కూడా అతని అవిధేయతలో చిక్కుకున్నాడు (సంఖ్యాకాండము 20:8-13) మరియు వారిరువురు వాగ్దాన దేశములో ప్రవేశించుటకు అనుమతిని కోల్పోయారు.

అహరోను  సహోదరి?

ఇస్లాంలో వివరణలేని విషయాలలో ఒకటి యేసు తల్లియైన మరియ, ఖుర్‌’ఆన్‌లో హరూను సహోదరి అని పిలువబడింది. యేసు తల్లియైన మరియ అను అంశము క్రింద అహరోను సహోదరిని గూర్చిన వివరణ చూడండి.


 • అహరోను మరియు మోషే,
  •  తనకు ప్రాతినిధ్యం వహించమని మోషే అతనిని అడిగాడు (అల్‌ అరాఫ్‌ 7:142)
  • మోషే యొక్క సహోదరుడు (తాహా 20:30)
  • మోషేతో పాటు తీర్పులు చేసే గీటురాయి (అనగా: సత్య నిర్ణయము), జ్యోతి మరియు జ్ఞాపిక (అనగా: సందేశము) ఇవ్వబడింది, (అల్‌ అంబియా 21:48). కొంతమంది లేఖనాలు ఇవ్వబడినవని వ్రాశారు.
  • మోషే యొక్క బంట్రోతు (అనగా సేవకుడు), (అల్‌ ఫుర్ఖాన్‌ 25:35)
  • తనకు సహాయకునిగా ఉండుటకు అహరోనుని నియమించమని మోషే అడిగాడు (తాహా 20:29-36; అష్‌ షుఅరా 26:13; అల్‌-ఖసస్‌ 28:34)
  • అతనికి మరియు మోషేకు ప్రణామము చేయబడింది (అస్‌ సాప్ఫాత్‌ 37:120)
 • అహరోను మరియు ఫిరౌన్‌  (ఫరో)
  • ఫిరౌన్‌ విషయమై భయపడ్డాడు (తాహా 20:45)
  • మోషేతో పాటు ఫిరౌన్‌ వద్దకు పంపబడ్డాడు (యూనుస్‌10:75; తాహా 20:42)
 • అహరోను మరియు దూడ,
  • తన ప్రజలు దూడను చేసినప్పుడు వారికి భయపడ్డాడు (అల్‌ ఆరాఫ్‌ 7:150; తాహా 20:94)
  • ప్రజలు దూడను చేసినప్పుడు వారిని ఎందుకు నివారించలేదని ప్రశ్నించబడ్డాడు (తాహా 20:92)
  • మోషే పలకలను తీసుకొని వచ్చినప్పుడు అతనిని జుట్టు పట్టుకున్నాడు (అల్‌ ఆరాఫ్‌ 7:150)
 • అహరోను యొక్క పరిచర్య,
  • మోషేతో పాటు తీర్పులు చేసే గీటురాయి (అనగా: సత్య నిర్ణయము), జ్యోతి మరియు జ్ఞాపిక (అనగా సందేశము) ఇవ్వబడింది, (అల్‌ అంబియా 21:48). కొంతమంది లేఖనాలు ఇవ్వబడినవని వ్రాశారు.
  • కృప (అనగా: అనుగ్రహము) అతనికి మరియు మోషేకు ఇవ్వబడినవి (అస్‌ సాప్ఫాత్‌ 37:114)
  • దేవుడు సన్మార్గము చూపించాడు (అన్‌ ఆమ్‌ 6:84)
  • మోషే యొక్క బంట్రోతు (అనగా సేవకుడు), (అల్‌ ఫుర్ఖాన్‌ 25:35)
  • వహీ పంపబడింది (అన్‌  నిసా 4:163)
  • అహరోను మరియు మోషేల దేవుని మాంత్రికులు నమ్మిరి (తాహా 20:70)
  • మోషేకంటే బాగా మాటలాడగలడు (అల్‌-ఖసస్‌ 28:34)
  • ప్రవక్త, దయ చూపబడ్డాడు (అనగా: దేవుని దయవలన ప్రవక్త), (మర్యమ్‌ 19:53)
  • గురుతుల చేత (అనగా: సూచనల చేత) మరియు స్పష్టమైన అధికార పత్రముతో (అనగా: అధికారముతో) మోషేతో కూడా పంపబడ్డాడు‌ (అల్‌ మూ’మినున్‌ 23:45)
  • తన ప్రజలను హెచ్చరించాడు, (తాహా 20:90)
 • అహరోను కుటుంబీకులు, (అల్‌ బఖర 2:248)
 • అహరోను తల్లి ప్రవక్త్రి అనుభవము కలిగియున్నది (తాహా 20:38)

ప్రశ్న: ఆమె ప్రవక్త్రి అయ్యిందా? కొంతమంది అవునని చెప్తున్నారు, మరి కొంతమంది ముస్లింలు దానిని నమ్మరు.

 • అహరోను ప్రార్థన అంగీకరించబడింది (యూనుస్‌ 10:89)
 • అహరోను సహోదరి. మరియకు వాడబడిన బిరుదు. యేసు తల్లియైన మరియ అను అంశము క్రింద అహరోను సహోదరిని గూర్చిన వివరణ చూడండి.
 • అల్‌ ఆరాఫ్‌ 7:122; తాహా 20:90; అష్‌ షుఅరా 26:48; అస్‌ సాప్ఫాత్‌ 37:114-120
 • సహీ బుఖారీ 4 #429; సహీ అల్‌ బుఖారీ 4 #606; సహీ అల్‌ బుఖారీ 5 #56; సహీ అల్‌ బుఖారీ 5 #227; సహీ అల్‌ బుఖారీ 5 #700; సహీ అల్‌ బుఖారీ 9 #608 మరియు సహీ ముస్లిం 4 #918

Leave a Reply