ఆద్‌ అనే ఒక జాతి ప్రజలు నోవాహు తరువాత కాలంలోజీవించినట్లు  ఖుర్‌’ఆన్‌లో మనము చూస్తాము. ఆద్‌ జాతి ప్రజలు అధికమైన భాగ్యవంతులు, అయినను, వారు దేవుని యెడల అవిధేయత కలిగిన ప్రజలు. ఆద్‌ జాతి ప్రజలను దేవుడు పడమటి గాలిని విసరింప చేసి నాశనము చేసినట్లుగా ఖుర్‌’ఆన్‌ తెలియజేస్తుంది. దేవుని దిక్కరించినవారికి కలుగు దుర్గతిని ఎట్టిదో తెలియజేయుటకు ముహమ్మద్‌ తరచుగా ఆద్‌ జాతి ప్రజలను దృష్టాంతములుగా చూపుతుండేవాడు.

 • ఆద్‌ మరియు హూద్‌, అల్‌-అరాఫ్‌ 7:65-72; హూద్‌ 11:50-60; అష్‌-షుఅరా 26:123-140; అల్‌-అహ్‌ఖాఫ్‌ 46:21
 • ఆద్‌ యొక్క పాపములు
  • బడాయి, అహంకారం, – హమీమ్‌ అస్సజ్‌దహ్‌ 41:15-16
  • జాతి నాయకులు ~ అవిశ్వాసులు – అల్‌-అరాఫ్‌ 7:66
  • దేవుని ప్రత్యక్షతలను నిరాకరించారు, ఆయన సందేశహరులను తిరస్కరించారు మరియు తమ మూర్ఖుమైన అహంకారులైన అధికారుల ఆజ్ఞలను అనుసరించారు (యూసుఫ్‌ అలీ: సూచనలను తిరస్కరించారు, అపొస్తలులకు అవిధేయులయ్యారు, అతిక్రమకారులను అనుసరించారు) – హూద్‌ 10:59
  • దేవుని సందేశహరులను తిరస్కరించారు (యూసుఫ్‌ అలీ: ప్రవక్తల కార్యములను అబద్దమైనవిగా పరిగణించారు, అపొస్తలులను తృణీకరించారు) – అల్‌-హజ్‌ 22:42; అష్‌-షుఅరా 26:123
  • రాబోవు తీర్పును నమ్మలేదు – అల్‌-హాఖ్కా 69:4
  • హెచ్చరికలను (యూసుఫ్‌ అలీ: సత్యమును) తిరస్కరించారు – అల్‌-ఖమర్‌ 54:18
  • హూద్‌  ఏ నిదర్శనాన్ని (యూసుఫ్‌ అలీ: సూచనను) తీసుకురాలేదని చెప్పారు – హూద్‌ 11:53
 • వారిమీదకు వచ్చిన తీర్పులు,
  • ప్రళయ దినము వరకు వారి పైన శాపము ఉంటుంది – హూద్‌ 11:60
  • భయంకరమైన పెనుగాలి చేత నాశనము చేయబడతారు – అల్‌-హాఖ్కా 69:6; అల్‌-ఖమర్‌ 54:18-21
  • వారిమీదకు వినాశనకరమైన గాలిని పంపాము – 51:41
  • హఠాత్తుగా (దైవ)శిక్ష వచ్చి పడింది – హమీమ్‌ అస్సజ్‌దహ్‌ 41:13
 • సందేశహరులు వారియొద్దకు నిదర్శనాలతో (యూసుఫ్‌ అలీ: సూచనలు) వచ్చారు – అత్‌-తౌబా 9:70
 • సైతాను వారిని సన్మార్గమునుండి తప్పించాడు – అల్‌-అన్కబూత్‌ 29:38
 • మా కారుణ్యము ద్వారా (ముహమ్మద్‌ అజీజుర్రహ్మన్‌: కృపతో) కాపాడాము – హూద్‌ 11:58
 • ఆద్‌ జాతి, – అత్‌-తౌబా 9:70; ఇబ్రాహీం 14:9; అల్‌-ఫుర్‌ఖాన్‌ 25:38; అల్‌-ఫజ్ర్‌ 89:6; సాద్‌ 38:12; ఖాఫ్‌ 50:13; అన్‌-నజ్న్‌ 53:50

Leave a Reply