A.S. అనేది అలైహి స్సలామ్ యొక్క సంక్షిప్త పదము, తెలుగులో సంక్షిప్తముగా “అలైహి” అని కూడా పిలుస్తారు. “అలైహి” లేక “అలైహి స్సలామ్” అనగా (దేవుని) సమాధానము ఆయనతో/ఆయనపై ఉండును గాక!
“అలైహ స్సలామ్” అనగా సమాధానము ఆమెతో ఉండును గాక!
ముస్లింలు తమ రచనలలో ముహమ్మద్ కాకుండా వేరే ప్రవక్తల పేర్లను వాడినప్పుడు వాటి ప్రక్కన ఈ మాటలు వాడటం సాధారణంగా మనము చూస్తాము.
మరింత సమాచారము కొరకు, PBUH పైన ఇచ్చిన వివరణలో చూడండి.