After Hijra. అనగా హిజ్రా తరువాత. ఈ తేదీనుండి ముస్లింలు తమ కాలమును/తేదీలను లెక్కిస్తారు.

హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622, జూలై 16న వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. ముస్లింలు ఇక్కడినుంచి తమ శకమును లెక్కించుకుంటారు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముకు బదులుగా, హిజ్రాకు పూర్వము మరియు హిజ్రాకు తరువాత అని వారు కాలమును లెక్కించుకుంటారు.

  • ముస్లింల కాలెండరు నుంచి క్రైస్తవుల కాలెండరు తేదీలను తెలుసుకునే విధానము

622 + *354.36/365.24

ముస్లిం క్యాలెండర్‌ పూర్తిగా చాంద్రమాన కాలెండరు.  ఇది సూర్యమాన కాలెండరుతో ఏ మాత్రము ఏకమవ్వదు. ( మన తెలుగు కాలెండరు, లేక ఇస్లాం పూర్వపు అరేబీయులు వాడిన చాంద్రమాన కాలెండరు మాత్రము అధిక మాసములను జోడించుకుంటూ సూర్యమాన కాలెండరుతో మమేకమవుతాయి). క్రైస్తవులు వాడే గ్రెగోరియన్‌ కాలెండరు కన్నా 11 దినాలు తక్కువగా ముస్లిం కాలెండరులో ఉంటాయి. ఆ విధముగా రమదాన్‌ మాసము సూర్యమాన కాలెండరులోని ప్రతి సంవత్సరము ఒకే నెలలో రాక ఏటేట మారుతుంటుంది. మరియు క్రైస్తవుల కాలెండరులో (సంవత్సరానికి 365 రోజులు చొప్పున) 33 సంవత్సరాలు గడిస్తే, ముస్లింల కాలెండరులో (సంవత్సరానికి 354 రోజులు చొప్పున) 34 సంవత్సారలు గడుస్తాయి.

ఇస్లాం పూర్వపు దినాలలో కాలెండరు పంచాంగకర్తలు ఉండేవారు, వారు పవిత్రమాసాలు ఎప్పుడి చేయాలో నిర్ణయించేవారు, వారు చాంద్రమాన కాలెండరుకు అధిక మాసమును జోడిస్తూ సూర్యమాన కాలెండరుతో ఏకపరచే వారు. అయితే ఈ విధముగా ఏకముచేయటాన్ని ముహమ్మద్‌ నిషేధించాడు.

Leave a Reply