యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడుట, మరణించుట మరియు పునరుత్థానము చెందుట అనేవి క్రైస్తవ విశ్వాసానికే గుండెకాయ వంటివి. క్రైస్తవుడు నమ్మి నిరీక్షించు ప్రతి విషయము అపాత్రులైన పాపులకొరకు సిలువపైన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన మరణము చుట్టూ  పరిభ్రమిస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువు తాను చేసిన నేరములకొరకు చనిపోలేదు, కాని అపారమైన పరిశుద్ధత నీతియుగల దేవుని యెదుట నిలువబడుటకు విమోచన మరియు నీతి పొందవలసియుండిన పాపుల స్థానములో ఆయన చనిపోయాడు అని చెప్పే దైవతీర్పే పునరుత్థానము. యేసు క్రీస్తు ప్రభువు మరణించలేదు మృతులలోనుండి లేవలేదు అని రుజువుచేయబడితే, క్రైస్తవ్యము తరతరాలుగా కోట్లాదిమందిని మోసము చేయుచున్న ఒక అబద్దమే తప్ప మరేమీ కాదు. క్రైస్తవుడు నిరీక్షణ లేకుండా, నీతిని గురించిన నిశ్చయత లేకుండా, తన పాపములలోనే నిలిచియుండిపోతాడు (1కొరింథీయులకు 15:12-19; రోమీయులకు 4:25, 5:8-11).

మరొక ప్రక్క ఇస్లాం యేసు క్రీస్తు ప్రభువు సిలువ మరణ పునరుత్థానములను తృణీకరిస్తుంది. అవిశ్వాసుల కుయుక్తులనుంచి అల్లాహ్‌ యేసు క్రీస్తు ప్రభువును తప్పించి పరలోకమునకు ఎత్తికొనెను అని ముస్లింలు నమ్ముతారు. యేసు క్రీస్తు ప్రభువు స్థానములో వేరొక వ్యక్తి సిలువవేయబడ్డాడు అనేది సాధారణ ఇస్లామీయ దృక్పథం, మరియు అవిశ్వాసులు చంపింది యూదా ఇస్కరియోతును అని కూడా చాలా మంది ముస్లింలు నమ్ముతారు.

యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడవలసిన రాత్రి అల్లాహ్‌ యూదాను యేసు క్రీస్తు ప్రభువు వలె కనబడునట్లు చేశాడు. అవిశ్వాసులైన యూదులు వాస్తవానికి యూదాను చంపి యేసు క్రీస్తు ప్రభువును సిలువవేశాము అనుకున్నారు, అనేది నేటి ఆధునిక ముస్లింలలోని అత్యధికుల కథనము.

యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణించలేదు అనే ఆలోచన ఖుర్‌’ఆన్‌ లోని సూరా అన్‌ నిసా 4:157-158 నుండి పుట్టుకొచ్చింది:

అల్లాహ్‌ సందేశహరుడును, మరియ కుమారుడునైన యేసు అను మెస్సీయను మేము చంపాము అని వారు (యూదులు) చెప్పుచున్నారు; వారు ఆయనను చంపనూ లేదు సిలువ వేయనూ లేదు, కాని అది వారికి అలా కనిపించింది; ఇదిగో! దీని విషయములో విభేదించుచున్నవారు అనుమానములోనే ఉన్నారు; వారు అనుమానములోనే ఉన్నారు తప్ప వారికి దీని విషయములో జ్ఞానములేదు; ఖచ్చితము ఆయనను వారు చంపలేదు. అయితే అల్లాహ్‌ ఆయనను తనయొద్దకు తీసుకున్నాడు. అల్లాహ్‌ నిత్య శక్తియు జ్ఞానము గలవాడు.” (ఎమ్‌. ఎమ్‌. పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ, ద హోలీ ఖుర్‌ఆన్‌)

యేసు క్రీస్తు ప్రభువును వారు చంపనూ లేదు సిలువ వేయనూ లేదు అని ఖుర్‌’ఆన్‌ చెప్పుచున్నదానిని బలపరచడానికి యేసు క్రీస్తు ప్రభువు స్థానములో యూదా చనిపోయాడు అని ఖుర్‌’ఆన్‌లో ఇంకెక్కడా చెప్పబడలేదు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడినట్లుగా వారికి కనిపించింది అని మాత్రమే పాఠ్యభాగము చెప్పుచున్నది. అయితే అది ఎలా జరిగిందని అడిగితే దానికి జవాబులేదు.

ఈ నమ్మకాలకు పొంతనలేని, మరొక అసంబద్ధతను పొడచూపుతూ, యేసు క్రీస్తు ప్రభువు చనిపోయాడు అని తెలుపుచున్న వచనములు అదే ఖుర్‌’ఆన్‌లో మనకు కనబడతాయి. కావున యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదని ముస్లింలు చెప్పుచున్న మాటలకు ఖుర్‌’ఆన్‌ ఎటువంటి సాక్ష్యమిస్తుందో ఆ ఖుర్‌’ఆన్‌ వచనాల ప్రకారముగా మనము తెలుసుకుందాము. వివిధ రకాల ఖుర్‌’ఆన్‌ తర్జుమాలలో ఆయా వచనాలను ఏవిధముగా తర్జుమా చేశారో తెలుసుకొనుటకు దిగువన కొన్ని ఇంగ్లీషు ఖుర్‌’ఆన్‌ వచనాలను కూడా తెనుగీకరించి ఇస్తున్నాము:

సూరా ఆలి ఇమ్రాన్‌ 3:144 

ముహమ్మద్‌ కేవలం అపొస్తలుడు మాత్రమే, అతనికి ముందున్న అనేకమంది అపొస్తలులు చనిపోయారు” A.yusuf Ali

“అనేకమంది అపొస్తలులు” అనే పదము అరబీ లో  “అల్‌-ర్రుసులు” అని వ్రాయబడింది. దీనిని ఖచ్చితముగా తర్జుమా చేయాలంటే “ఆ ప్రవక్తలు” అని చేయాలి. మరియు ఈ వాక్య ముహమ్మద్‌కు ముందున్న ప్రవక్తలందరూ చనిపోయారు అని రూఢిగా చెప్తుంది.

దిగువనీయబడిన ముస్లిం తర్జుమాలు ఈ విషయానికి అద్దముపడుతున్నాయి:

అతనికి పూర్వమున్న ఆ అపొస్తలులు ఇదివరకే చనిపోయారు Shakir

నిశ్చయముగా అతనికి పూర్వమున్న సందేశహరులందరు చనిపోయారుSher Ali

అతనికి ముందున్న సందేశహరులు ఇదివరకే చనిపోయారుM.Muhammad Ali

అతనికి ముందున్న సందేశహరులు చనిపోయారుT.Irving

…ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు…” ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌ తెలుగు అనువాదం, అంతిమ దైవ గ్రంథం ఖుర్‌’ఆన్‌

వాస్తవానికి అనేకమంది, చాలామంది అనే పదాలు అరబీ ఖుర్‌ఆన్‌లో ఉండవు.

ఈ వచనభాగమునకు సంబంధించి అహ్మదియ్య శాఖకు చెందిన దివంగత మౌలానా ముహమ్మద్‌ అలీ ఈ విధంగా చెప్పాడు:

“ఈ వచనము ఇస్లాం యొక్క మూల సత్యముపైన ఒత్తిడి చేయుచుండగా,  ప్రవక్త మరణ సమయమందు ఇది మరొక ఉద్దేశ్యమును కూడా జరిగించింది. ప్రవక్తతో కూడానుండే చెలికాండ్లలో కొందరు ప్రవక్త చనిపోలేదని అనుకుంటున్నారు. అబు బకర్‌ లోపలికి వెళ్లి, జీవము వెళ్లిపోయి ఉండుట చూచి, గురుపీఠమునెక్కి  ఈ వచనమును చదివాడు. దానిని వినువారందరిపైన అది ఒక మంత్రములా పనిచేసి, అతని ముందున్న ప్రవక్తలందరు చనిపోయిన రీతినే ఈ ప్రవక్త కూడా చనిపోయాడు అని ఒప్పుకున్నారు. ప్రవక్తలు కూడా మర్త్యులే. సందేహములేదు ఇతర మర్త్యుల వలెనే వారి మర్త్యజీవితకాలము కూడా ముగియవలెను. వచనము యేసుక్రీస్తు కూడా చనిపోయాడు అని పరిష్కారమైన రుజువునిస్తుంది; లేదంటే అక్కడుండి ప్రవక్త మరణముగురించి సందేహిస్తున్న వారిని అబు బక్‌ర్‌ వాదన నోరుమూయించలేకపోయేది.” (అలీ, హోలి ఖుర్‌ఆన్[USA; Ahamadiyya Anjuman Isha’at Islam Lahore Inc.,], పేజీలు 168-169,f.496)

సూరా మర్యమ్‌ 19:33,  యేసు క్రీస్తు ప్రభువు శిశువుగా ఉన్నప్పుడే మాట్లాడుట:

నేను పుట్టిననాడు , నేను చనిపోయిననాడు, మరియు నేను (మరలా) తిరిగి లేచేనాడు నా పైన శాంతి ఉంటుంది.” (అబ్దుల్లాహ్‌ యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

“మరలా” అనే పదము అలీ చేర్చినదేగాని అరబీ గ్రంథములో లేదు. ఈ సూక్తిని ముహమ్మద్‌ అలీ తర్జుమాతో సరిచూడండి:

నేను పుట్టిననాడు, నేను చనిపోయిననాడు, నేను తిరిగి లేచిననాడు నా పైన శాంతి ఉంటుంది.” (మౌలానా ముహమ్మద్ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

ఇవ్వబడిన ఈ సూక్తికి కొన్ని సూక్తులకు ముందు ఇదే సూరాలో ఇవ్వబడిన ఒక సూక్తిని  చదివితే, అదే వాక్సరణిని బాప్తీస్మమిచ్చు యోహాను (యాహ్య) విషయములో వాడబడుట మనము చూస్తాము:

ఆయన పుట్టిననాడు, ఆయన చనిపోయిన నాడు, మరియు ఆయన తిరిగి లేచేనాడు ఆయనపైన శాంతి ఉంటుంది.” సూరా మర్యమ్‌ 19:15 (అబ్దుల్లాహ్‌ యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

ఇస్లాం నమ్మకము ప్రకారము బాప్తీస్మమిచ్చు యోహాను జీవించాడు, మరణించాడు, మరియు అంత్యకాలమందు పరదైసులో నివసించుటకు తిరిగి లేపబడతాడు. అయినా గాని కాలక్రమానుసారముగా జరగవలసిన అనుక్రమ సత్యమును కొట్టివేస్తూ,  యేసు క్రీస్తు ప్రభువు చనిపోక ముందే దేవుని యొద్దకు ఆరోహణమై వెళ్లాడని  కొంతమంది ముస్లింలు చెప్పుచుంటారు.

సూరా మర్యమ్‌ 19:33 లోని గలిబిలిని యూసుఫ్‌ అలీ ఇచ్చిన పాద సూచికలోచూడవచ్చు:

“…క్రీస్తు సిలువ వేయబడలేదు (iv.157). కాని ఆయన ఎన్నడూ చనిపోలేదు అని నమ్మే వారు వచనముపై పర్యాలోచన చేయాలి.(అలీ, హోలి ఖుర్‌’ఆన్‌[The Holy Quran Publishing Company]. 774 వ పేజి, f. 2485)

ఒక ముస్లిం రచయిత ఇలా వ్రాశాడు:

“యోహాను (యాహ్యాహ్‌) మరణమును భవిష్యత్తుకు సంబంధించినదిగా ఏ ముసల్మాను చెప్పలేడు. యోహాను చనిపోయాడని అందరికి తెలుసు… యోహాను మరణమును భవిష్యత్తుకు సంభందించినదిగా  ఎవరూ చెప్పలేరు, కాబట్టి యేసుక్రీస్తు మరణమును కూడా భవిష్యత్తుకు సంబంధించినదిగా ఎవరూ చెప్పటానికి సరిపోదు. నిజానికి యేసుక్రీస్తు చనిపోవటానికి మరలా తిరిగి వస్తాడు అని చెప్పుచున్నటువంటి కనీసం ఒక్క వచన భాగమైన ఖుర్‌’ఆన్‌ అంతటిలో ఎక్కడా కనిపించదు. సరిసమానమైన అదేమాట యోహాను చనిపోయాడు అని చెప్తున్నపుడు, యేసుక్రీస్తు కూడా చనిపోయాడు అని అదే మాట స్పష్టముగా చూపుతుంది. (A.H.Obaray, Miraculous Conception, Death, Resurrection, and Ascension of Jesus (Nabi-Isa) as Taught in th Kuran [Kimberly, South Africa; Pub. By Autho, 1962] p.45)

సూరా 19:31 లో చెప్పబడిన ఈ భాగము ఇంకా అధికమైన సమస్యనే కలిగిస్తుంది:

నేను ఎక్కడుంటే అక్కడ నన్ను ఆశీర్వాదకరంగా ఆయన చేసియున్నాడు, నేను బ్రతికియున్నంతకాలము ప్రార్థనచేయుట మరియు ధర్మముచేయుట నాకు నియమించియున్నాడు.” (యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

ఈ సూక్తి ప్రకారము, మరణము వరకు ప్రార్థన చేయాలని ధర్మము (జకాత్‌) చేయాలని యేసు క్రీస్తు ప్రభువునకు నియమింపబడింది. కాని యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదని ముస్లింలు చెప్పేది సుబద్ధమైనదైతే, ఆయన ఇప్పుడు పరలోకములోనున్నప్పటికిని ధర్మము చేయుట తప్పక కొనసాగించాలి!

సూరా 3:55

ఇదిగో! దేవుడు ఇలా అన్నాడు: “ఓ యేసు! నేను నిన్ను తీసికొంటాను (అరబి – ఇన్ని ముతవఫ్ఫీక) మరియు నిన్ను నాయొద్దకు ఎత్తుకొంటాను మరియు దూషించువారి (అసత్యముల) నుండి నిన్ను తప్పిస్తాను…(యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనవాదం తెనుగీకరణ)

సూరా 5:117

నా ప్రభువును మీ ప్రభువును అయిన దేవుని అరాధించుడి అని చెప్పమని నీవు నాకు అజ్ఞాపించినది తప్ప మరేదియు నేను వారికెన్నడునూ చెప్పలేదు, నేను వారి మధ్యనున్నప్పుడు వారిపైన నేను సాక్ష్యిగా ఉన్నాను; నీవు నన్ను నీ యొద్దకు తీసికొన్నప్పుడు (అరబి – తవఫ్ఫైతని) వారిని చూచుచున్న వాడవు నీవే, అన్నిటికి సాక్ష్యము నీవే.” (యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనవాదం తెనుగీకరణ)

” నేను నిన్ను తీసుకొంటాను” లేక “నీవు నన్ను తీసుకొన్నప్పుడు” అనే మాటలు అరబీ పదమైన తవఫ్ఫ యొక్క రూపములు. ఈ పదము వాడిన ప్రతీసారి ఒకడు మరణమునందు తీసివేయబడిన విషయమును సూచిస్తూ  ఖుర్‌’ఆన్‌లో వాడబడింది. ఈ సూక్తులను ఇతర ఖుర్‌’ఆన్‌ అనువాదకులు తర్జుమా చేసిన విధానమును గమనించండి:

రషద్ఖలీఫా

నీ జీవితమును నేను సమాప్తి చేయుచున్నాను, నాయొద్దకు నిన్ను లేవనెత్తుకుంటూ

భూమిమీద నా జీవితమును నీవు సమాప్తి చేసినప్పుడు

షాకిర్

…(భూమి మీద) నీవు నిలిచియుండు కాలమును నేను సమాప్తి చేయబోవుచున్నాను మరియు నీవు నా యొద్దకు ఎక్కివచ్చునట్లు చేయుదును

కాని నీవు నన్ను మరణింపజేసినప్పుడు

షేర్అలీ

నేనే నీవు సహజమరణము పొందునట్లు చేసి నాయొద్దకు నిన్ను ఎత్తుకొంటాను

కాని నీవు నన్ను మరణింపచేసినప్పటినుంచి

మహమ్మద్అసద్

నిశ్చయముగా నేను నిన్ను మరణింపచేస్తాను, మరియు నా యొద్దకు నిన్ను లేవనెత్తుకుంటాను… 

కాని నీవు నన్ను మరణింపచేసినప్పటినుంచి

యమ్‌. ముహమ్మద్అలీ

నేను నిన్ను మరణింపచేస్తాను మరియు నా సన్నిధిలో నిన్ను పైకెత్తుదును

కాని నీవు నన్ను మరణింపచేసినప్పుడు

యమ్‌. ముహమ్మద్‌ అలీ ఈ వ్యాఖ్యాము ఇచ్చాడు:

“ఐ’అబ్‌ చెప్పినదేమనగా ముతవఫ్ఫి-క, యొక్క భావము ముమితు-క అనగా నేను నిన్ను మరణింప జేస్తాను (B.65:12). LA ప్రకారముగా, తవఫ్ఫ-హు-ల్లాహు అని చెప్పినప్పుడు అతని ప్రాణమును అల్లాహ్‌ తీసుకున్నాడు లేక అల్లాహ్‌ చంపినాడు అని దాని భావము. మరియు LL చెప్పిన ప్రకారముగా, “(మరణమందు గాని లేక నిద్రలోగాని) దేవుడు అతని ప్రాణమును తీసుకున్నాడు (S,Q) , (ఖుర్‌’ఆన్‌ 6:60 చూడండి); లేక అతనిని మరణింప చేశాడు (Msb).” ఇలా వాడినప్పుడు ఇతర భావాలను పదాలకు జతపరచకూడదు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు యేసు క్రీస్తు మూడు గంటలపాటు చనిపోయాడు అంటారు; మరికొందరు ఏడు గంటలు అని అలా చెప్పుకుంటూ పోతారు (Rz). కాని వాస్తవానికి యేసు క్రీస్తును సిలువలో చంపాలి అని యూదులకు కలిగిన యోచనలన్నీ భంగమై, తరువాత ఆయన  సామాన్యముగా మరణము చెందాడని చూపటానికి ఇక్కడ ఈ పదము వాడబడింది… ఓ యేసూ! నేను నిన్ను చేర్చుకుంటున్నాను, అనేది పిక్తాల్‌ తర్జుమా, మరియు చనిపోయారు అనటానికి ఇది బైబిలులో వాడబడిన జాతీయము. యూసుఫ్‌ అలీ తన మొదటి ముద్రణములో నేను నిన్ను మరణింప చేస్తాను అని తర్జుమా చేశాడు, కాని తన రెండవ ముద్రణములో నేను నిన్ను తీసుకుంటాను అని మార్చివేశాడు.” (అలీ, హోలి ఖుర్‌’ఆన్‌, 147పేజీ, పాదసూచిక 436; లావుపాటి అక్షర ఒక్కాణింపు మాది)

“నేను నిన్ను చేర్చుకుంటున్నాను” అనే జాతీయము బైబిలులో మరణముకు వాడబడింది అని అలీ వ్రాసిన విషయము నిజమే:

అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. అబ్రాహాము నిండు వృద్ధాప్య మునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.” ఆదికాండము 25:7-8

ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.” ఆదికాండము 35:28-29

యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.” ఆదికాండము 49:33

మనుష్యులు మరణించినప్పుడు లేక నిద్రించుచున్నప్పుడు వారి ఆత్మలను దేవుడు తీసుకుంటాడు అని అలీ చెప్పిన రెండవ విషయము ఖుర్‌’ఆన్‌ 6:60 చేత నిరూపించబడినది:

రాత్రియందు మీ ఆత్మలను తీసికొనువాడు ఆయనే, పగటియందు మీరు సంపాదించునది ఆయనకు తెలియును, తరువాత నిర్ణీతకాలము ముగియుటకొరకై మిమ్ములను పైకి లేపుతాడు. అప్పుడు మీరు ఆయన యొద్దకు తిరిగివెళతారు, అప్పుడు ఆయన మీరు చేసినదానిని మీతో చెప్పును.” (మౌలానా ముహమ్మద్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

కొంతమంది ఇస్లామీయ రచయితలు తవఫ్ఫ అనగా మరణాన్ని సూచించ వలసిన అవసరత లేదు, ఒక పనిని లేక నిర్ణీతకాలమును సంపూర్తి చేయట మాత్రమేనంటూ వారి వాదనను రుజువు చేయుటకు పైన చెప్పబడిన సూక్తిని ఉపయోగిస్తారు. వాస్తవంగా మాట్లాడాలంటే ఆ సూక్తి ఇస్లామీయ రచయితలు చెప్పుచున్న దానికి భిన్నమైన విషయమును తెలియజేస్తుంది. ఏలయనగా  ఆ సూక్తిలోని తవఫ్ఫ అనే క్రియాపదము యొక్క అర్థము ఒకని నిర్ణీతకాలము ముగించు మాత్రమే అయితే, అప్పుడు ఒక వ్యక్తి నిర్ణీతకాలమును అల్లాహ్‌ పూర్తిచేస్తాడు అని దానికి అదనంగా కలపవలసిన అవసరతలేదు. అది ఆ క్రియాపదములోనే ఇమిడియుండేది. నిర్ణీతకాలమును సంపూర్తి చేయటానికి ఒక వ్యక్తి వెనక్కుతీసుకొనబడ్డాడు అనే వాక్యాంగమును జతచేయటం ద్వారా, దేవుడు కర్తగా ఉండి మరణముద్వారా ఒక వ్యక్తి తీసుకొనబడ్డాడు అని సూచించుటకు తవఫ్ప అనే పదం వాడబడినట్లు తెలుస్తుంది.

పేరుగాంచిన ముస్లిం పండితుడు మహ్మూద్‌ యమ్‌ అయూబ్‌ తాను వ్రాసిన ఖుర్‌’ఆన్‌ మరియు దాని అనువాదకులు, రెండవ సంపుటి – ఇమ్రాను కుటుంబము అనే పుస్తకములో ఇలా వ్రాశాడు:

“ముందుగానే చెప్పబడిన రీతిగా, సిలువవేయబడటము మరియు దాని సంబంధిత వేదాంతపరమైన అర్థముల విషయములో ఖుర్‌’ఆన్‌ మరియు ఇస్లాం సాంప్రదాయాలు రెండూ విబేధించుకుంటూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికి, ముతవఫ్ఫీక్‌ (నేను నిన్ను తీసుకొంటాను లేక నేను నిన్ను చంపుతాను) అనే పదం యొక్క అర్థము విషయములో వ్యాఖ్యానకర్తలు విబేధిస్తున్నారు. యేసును వెంబడించిన వారెవరో విశ్వాసమును తృణీకరించినవారెవరో అనే విషయములో కూడా వారు విబేధిస్తున్నారు.” (Ayoub [New York : State University of New York, Albany, 1992],  169వ పేజి)

అయూబ్‌ కొనసాగిస్తూ ఇస్లాంయొక్క గొప్ప వ్యాఖ్యానకారులలో కొందరిని విస్తృతంగా ఉదహరించాడు. అట్టివారిలో అల్‌-తబరి ఒకడు. అల్‌-తబరి వ్రాస్తూ  “‘నేను నిన్ను మరణింప చేస్తాను’ అనేది ఆ పదమునకు సామాన్యముగా ఉపయోగించే అర్థము” అంటాడు. మరియు దీనికి ‘నేను నిన్ను తీసుకొంటాను, వాపసు తీసుకొంటాను, నిన్ను పూర్తిగా వాడుకుంటాను  అనే అర్థాలు కూడ ఉన్నాయి” అని చెప్పాడు. మరియు ముతవఫ్ఫీక్‌ అనే పదానికి హదీతు సంప్రదాయల ఆదరువుతో కూడిన అనేకమైన వివరణలను అల్‌-తబరి తెలియజేసాడు. అతడు తెలియజేస్తూ, కొందరు ప్రారంభ తఫ్సీర్‌ బోధకుల ప్రకారముగా ఇక్కడి వాక్యభాగము యొక్క అర్థము ‘నీవు నిద్రపోవునట్లు నేను చేస్తాను, నీ నిద్రలోనుండి నిన్ను నేను తీసుకొంటాను’ అని నివేదించాడు. ఈ దృక్పథం అల్‌-రబి బిన్‌ అనస్‌ అధికారముతో చెప్పబడింది.” (Ayoub [New York : State University of New York, Albany, 1992],  169వ పేజి, అక్షర వొక్కాణింపు మాది)

తబరి ప్రకారముగా హసన్‌ అల్‌-బస్రి మరియు మతర్‌ అల్‌-వరాఖ్‌ వంటి ముస్లింలు యేసు చనిపోలేదని వాదించారు. వాస్తవానికి, బస్రి ప్రకారముగా “యేసు చనిపోలేదు, పునరుత్థాన దినమునకు ముందు ఆయన తిరిగి వస్తాడు” అని ముహమ్మద్‌ యూదులతో చెప్పాడు. (Ayoub [New York : State University of New York, Albany, 1992],  169వ పేజి). ము’అవియహ్‌ బిన్‌ సలిహ్‌ నివేదించినట్లుగా  క’అబ్‌ అల్‌-అహ్బార్‌ కు ఆపాదించబడిన సాంప్రదాయము ప్రకారము “మరియ కుమారుడైన యేసును దేవుడు చనిపోనీయలేదు” దానికి బదులు “ఒంటికన్ను మోసగానికి (అల్‌-దజ్జల్‌) విరోధముగా పంపుతాను, నీవు అతనిని చంపుతావు. అప్పుడు నీవు ఇరువది నాలుగు సంవత్సరములు జీవిస్తావు, తరువాత బ్రతికియున్నవారు మరణించినట్లుగా నేను నిన్ను మరణింపచేస్తా”నని దేవుడు యేసుతో అన్నాడు. (అయూబ్‌, 170వ పేజి) అయినప్పటికి, అదే అల్‌-తబరి ప్రకారముగా, “దేవుడు యేసును మరణింపజేసి తీసుకొన్నాడు” అని ఇతర ముస్లింలు తెలియజేశారు. (అయూబ్‌, 170వ పేజి).

అయూబ్‌ వ్రాసినది:

“(దేవుడు యేసుని మరణింపజేసాడు అనే) ఈ దృక్పథం ఇబ్న్‌ అబ్బాస్‌ మరియు వాహ్బ్‌ బిన్‌ మునబ్బిహ్‌ అధికారముతో నివేదించడమైనది. వారు చెప్పినదేమనగా ‘దేవుడు యేసును పగలు మూడు గంటల పాటు మరణింపచేశాడు, ఆ సమయంలోనే ఆయన అతనిని తనయొద్దకు తీసుకున్నాడు.’ ఇబ్న్‌ఇస్‌హాక్‌ పొరబాటుగా ‘దేవుడు యేసును ఏడు గంటలు పాటు మరణింపజేసి, పిదప ఆయనను తిరిగిలేపాడని క్రైస్తవులు చెప్తారు’ అని నివేదించాడు.” (Ayoub [New York : State University of New York, Albany, 1992],  170వ పేజి)

అయినప్పటికి, యేసు మరణించకుండా ఎత్తబడ్డాడని మరియు రెండవసారి పంపబడతాడని అప్పుడు అతను చనిపోయి తిరిగిలేపబడతాడని ఇతరులు చెబుతున్నారు. ముహమ్మద్‌ నుండి పుట్టుకొచ్చి ఖతదహ్‌ ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన ఒక సంప్రదాయము కూడా ఇదే విషయం చెప్తుంది. (Ayoub [New York : State University of New York, Albany, 1992], 170-171వ పేజీలు)

అర్‌-రజి అను మరొక ముస్లిం వ్యాఖ్యానకారుడు ముతవఫ్ఫీక యొక్క వేరు వేరు అర్థములను మరియు యేసు క్రీస్తు భూమి మీదనున్నపుడు ఆయన యొక్క చివరి గడియలను గురించి ముస్లింలకుండిన విరుద్ధ అభిప్రాయముల జాబితాను ఇచ్చాడు:

నీ కాలము ముగించు: అనగా “నేను భూమిమీద నీ నిర్ణయకాలమును ముగించుతాను, కావున నీ శత్రువులైన యూదులు నిన్ను చంపుటకు నేను నిన్ను విడువను.”

నిన్ను మరణింపజేస్తాను: ఇది ఖుర్‌’ఆన్‌ వ్యాఖ్యానకారుడైన ఇబ్న్‌ అబ్బాస్‌ మరియు ముహమ్మద్‌ బిన్‌ ఇస్‌హాక్‌ అనువారి అధికారముతో చేయబడిన ఒక ప్రతిపాదన. వారు ఏమన్నారంటే యూదులు ఆయనను చంపటము అసలు ఉద్దేశ్యము కాదు. దాని తరువాత (దేవుడు) ఆయనను (యేసును) పరలోకమునకు తీసికొనుటద్వారా గొప్పచేశాడు. ఈ విషయమందు, ముస్లిం పండితులు మూడు రకాలుగా విభేదిస్తున్నారు: 1) వాహ్బ్‌ అన్నాడు: మూడుగంటలు పాటు ఆయన చనిపోయాడు, తరువాత పైకెత్తబడ్డాడు; 2) ముహమ్మద్‌ బిన్‌ ఇస్‌హాక్‌ చెప్పాడు: ఆయన ఏడు గంటలు చనిపోయాడు తరువాత దేవుడు ఆయనకు ప్రాణమిచ్చి పైకిలేవనెత్తాడు; 3) అల్‌ రబి బిన్‌ అనస్‌ చెప్పాడు: దేవుడు ఆయనను మరణింపజేసి పరలోకమునకు తీసుకొన్నాడు; (ఖుర్‌’ఆన్‌లో) దేవుడు ఇలా అన్నాడు: “వారు మరణించినప్పుడు వారి ఆత్మలను దేవుడు తీసుకొంటాడు, మరణించని వారు నిద్రించుచుండగా తీసుకొంటాడు.” (అల్‌ జుమర్‌ 39:42)

వావ్‌ (و –మరియు) పదక్రమమును క్రమబద్ధీకరిస్తుంది: యేసు క్రీస్తు సజీవముగా ఉన్నాడు కాబట్టి, అనగా దేవుడు మొదట ఆయనను పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు, తరువాత క్రీస్తు-విరోధిని చంపటానికి ఆయనను క్రిందికి పంపుతాడు. దాని తరువాత దేవుడు ఆయనను మరణింపజేస్తాడు.

ఆత్మీయార్థ వ్యాఖ్యానము: ఇది అబు బకర్‌ అల్‌-వసితి యొక్క అభిప్రాయము: “నీ కామవాంఛలనుండి మరియు నీ మనస్సుయొక్క కోర్కెలనుండి (నేను నిన్ను మరణింప చేస్తాను). మరియు ఆయన ఇలా అన్నాడు: అతడు మరణించి దేవుని యొద్దకు వెళ్లితేనే గాని దేవుని గూర్చిన జ్ఞానమును పొందుకోలేడు కాబట్టి ‘నా యొద్దకు నిన్ను తీసుకొంటాను’. మరియు యేసు పరలోకమునకు ఎత్తబడినప్పుడు, ఆయన దేవదూతలవలె కామవాంఛలనుండి, కోపమునుండి మరియు నింద్యమైన గుణములనుండి విముక్తుడయ్యాడు.

పూర్తి ఆరోహణము: అనగా కొంతమంది అనుకొంటున్నట్లుగా కేవలము మరియ కుమారుడైన యేసు ఆత్మ మాత్రమే ఎత్తబడలేదు. ఆయన ఆత్మ మరియు దేహముతో కూడ పైకెత్తబడినాడు. “వారు నీకు ఏ హాని తలపెట్టరు” అని దేవుడు చెప్పిన మాట ఈ వ్యాఖ్యానమును దృఢపరుస్తుంది.

నీవు చనిపోయినట్లుగా నేను నిన్ను చేస్తాను: ఆయన భౌతికమైన ఆనవాలు ఏమైనా ఉంటే దానిని భూమిమీదనుంచి సమూలముగా నాశనము చేసి, అతని గురించిన సమాచారము మరుగైపోవునట్లు చేసి యేసును పరలోకమునకు ఎత్తుకొంటే అది అతను నిజముగా చనిపోయినట్లుగా చేస్తుంది. “ఏవేని రెండు ఒకే విధమైన స్వభావలక్షణములు కలిగియుంటే ఒకదాని పేరును మరొకదానికి  అన్వయించుట అంగీకృతము.”

అందుకోవటము: ఇవ్వవలసిన (అచ్చియున్న) డబ్బును తీసుకొనేటప్పుడు మొత్తము తిరిగి చెల్లించడము లేక తిరిగి చెల్లించబడటము అని దీని అర్థము. ఎలాగైనా, భూమినుండి అతనిని అకస్మాత్తుగా లాగివేసి, పరలోకమునకు ఎక్కించడమే అతనికి పారితోషికము.

వేతనము (Compensation for the work): అనగా, దేవుడు “అతని విధేయతను అతని కార్యమును అంగీకరిస్తున్నట్లు సంతోష వర్తమానమును అతనికి ప్రకటించాడు. ఆయన (దేవుని) మతమును మరియు ధర్మశాస్త్రమును ప్రకటించుచున్నందుకు అతని శత్రువులనుండి అతను పొందుకొనే కష్టాలను శ్రమలను అతనికి (యేసుకు) ఆయన బయలుపరచినాడు. ఆయన (దేవుడు) అతని వేతనమును పోనివ్వడు లేక తన బహుమానమును వ్యర్థపరచడు.

మరియు అర్‌-రజీ అదనముగా “ఇవి ఆ వచనమును అక్షరార్థముగా వ్యాఖ్యానించిన వారందరి దృక్పథముల మొత్తము” అని తెలియజేసాడు.” (ఫారిస్‌ అల్-కయ్‌రవానీ వ్రాసిన క్రీస్తు నిజముగా సిలువ వేయబడెనా? ([Light of Life, P.O.Box 13 A-9503, Villach, Austria], పేజీలు 59-62;)అనే పుస్తకములో అల్‌-రజియొక్క అల్తఫ్సిర్అల్కబిర్ , సంపుటి 8, 74వ పేజి, లోనుండి ఉదహరించిన సంవాదము)

యేసు క్రీస్తు ప్రభువు స్థానములో మరొకరు చంపబడ్డారు అని నమ్మే ముస్లింలందరూ, ఆ చంపబడినవాడు యూదా అని ఏకగ్రీవంగా నమ్మరు:

1) యూదా అను పేరు గల ఒక యూదుడు (ఇస్కరియోతు యూదా కాదు) క్రీస్తు ఉంటున్న ఇంటిలోనికి ఆయనను పట్టుకోవాలనే ఉద్దేశ్యముతో ప్రవేశించాడు, కాని ఆయనను కనుగొనలేకపోయాడు. దేవుడు క్రీస్తు రూపము అతనికి వచ్చునట్లుగా చేశాడు, ఎప్పుడైతే అతను ఇంటిలో నుండి బయటకు వచ్చాడో ప్రజలు చూచి అతడే యేసు అనుకొని, తీసికొని పోయి అతనిని సిలువవేసారు.

2) యూదులు యేసును పట్టుకొని అయనపైన కావలివానినుంచారు, అయితే ఒక అద్భుతము ద్వారా యేసు దేవునియొద్దకు తీసికొనిపోబడ్డాడు మరియు దేవుడు యేసు యొక్క రూపమును ఆ కావలివానికి వచ్చునట్లు చేశాడు. వారు అతనిని తీసుకొనివెళ్లి నేను యేసును కాను అని అతను కేకలు వేస్తున్ననూ సిలువ వేశారు.

3) యేసు స్నేహితులలో ఒకడు పరదైసును వాగ్దానముగా పొంది, ఆయన స్థానములో చనిపోవటానికి స్వచ్ఛందముగా వెళ్లాడు. అతడు యేసును పోలియుండునట్లుగా దేవుడు చేశాడు, మరియు అతడు తీసికొనిపోబడి సిలువవేయబడ్డాడు, అయితే యేసు పరలోకమునకు కొనిపోబడెను.

4) యేసును వెంబడించువారిలో ఒకడు (అతనే యూదా) ఆయనను అప్పగింపవలెనని, యూదులయొద్దకు వచ్చి వారిని ఆయనయొద్దకు నడిపించి, ఆయనను  తీసుకురావటానికి వారితోకూడా వెళ్లాడు. దేవుడు అతనిని యేసువలె కనిపించునట్లు చేయగా వారు అతనిని తీసుకుపోయి సిలువవేసిరి. (ఇస్కందర్‌ జదీద్‌ యొక్క  ద క్రాస్‌ ఇన్‌ ద గాస్పల్‌ అండ్‌ ద కొరాన్‌‌ [The Good way, P.O. Box 66 CH-8486-Rikon, Switzerland], 12-13 పేజీలు నుండి పొందుపరచబడింది; online edition)

5) యేసును పట్టుకొనే ప్రయత్నములో ఆయన ఉంటున్న ఇంటిలోనికి తీతవు అనే యూదుడు ఒకతను ప్రవేశించాడు. అతడు ఆయనను కనుగొనలేకపోయాడు. ప్రత్యామ్నాయముగా, అతని రూపమును దేవుడు మార్చివేసి యేసును పోలియుండునట్లు చేశాడు. అంతట అతడు బయటకు రాగానే, ఆ యూదులు అతనే యేసు అనుకొని అతనిని పట్టుకొని సిలువవేసిరి. (జదీద్‌, విక్టరీ ఆఫ్ ట్రూత్ [Good Way], 113వ పేజి)

ఇంకా అనేక విరుద్ధ దృక్పథముల జాబితాను అల్‌-తబరి తన వ్యాఖ్యానములో ఇచ్చాడు:

1) “యేసును, ఆయన స్నేహితులను యూదులు చుట్టుముట్టినప్పుడు, అందరు యేసు రూపములోనికి మారిపోయారు. యూదులు తత్తరపడి మిగిలినవారిలో ఒకరిని చంపినారు.”అని కొందరు ముస్లింలు అన్నారు. (సల్మ యొక్క అధికారముతో చెప్పబడిన మాటలు ఇవి)

2) “యేసు పదిహేడు మంది శిష్యులతో కూడ వచ్చాడు. యూదులు వారిని చుట్టుముట్టారు. శిష్యులు కూడా యేసు రూపములోనుండునట్లు దేవుడు చేశాడు. యూదులు శిష్యులతో ‘మీరు మమ్ములను మాయచేసారు, మీలో యేసు ఎవరో మాతో చెప్పితే మంచిది, లేకపోతే మిమ్ములనందరిని మేము చంపేస్తాము’ అని అన్నారు. అప్పుడు యేసు ‘పరదైసుకోసం మీలో ఎవరు మీ ప్రాణమునిస్తారు?’ అని శిష్యులను అడిగెను. శిష్యులలో ఒకడు ముందుకొచ్చి, బయటకు వెళ్లి ‘నేనే యేసును’ అని యూదులతో చెప్పగా, వారు ఆయనను తీసుకొనివెళ్లి సిలువవేసిరి.”

3) “ఒక ఇంటిలో యేసు తన పందొమ్మిది మంది శిష్యులతో కూడా ఉండగా, ఇశ్రాయేలీయులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యేసు తన శిష్యులతో, “నా రూపమును తీసుకొని, చనిపోయి, పరదైసుకు వెళ్లడానికి ఎవరు సుముఖముగానున్నారు? అని చెప్పగా, ఒక శిష్యుడు తన్ను తాను  సమర్పించుకొని, బయటకు తీసుకొనిపోబడి సిలువవేయబడగా, యేసు పరలోకమునకు ఆరోహణమై వెళ్లాడు.”

4) నాలుగవదిగా, “యేసును చంపుటకు ఇశ్రాయేలు రాజైన దావీదు ఒక మనుష్యుని పంపాడు. ఆ మనుష్యుడు కొందరు మనుష్యులను తీసుకొని వెళ్లాడు. యేసు తన పదమూడు మంది శిష్యులతో కూడ ఉండెను. వారు వచ్చినట్లు ఆయన యెరిగినవాడై తన శిష్యులలో ఒకరిని అచ్చు ఆయనలానే కనబడునట్లు చేశాడు. ఆ శిష్యుడిని యూదులు చూసినప్పడు, వారు ఆయనను తీసుకొనిపోయి సిలువవేసిరి.” (జదీద్‌ వ్రాసిన విక్టరీ ఆఫ్ ట్రూత్, 114-115 పేజీల నుండి పొందుపరచబడింది)

మరొక ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యానకర్త అల్‌-బైదావి కూడా అలాంటి అభిప్రాయాలే కొన్నిటిని ఇచ్చాడు:

…ఇలా చెప్పబడింది – ఒక యూదుల గుంపు యేసును ఆయన తల్లిని అవమానించగా, ఆయన వారిని గురించి దేవునికి మొఱ్ఱబెట్టుకొన్నాడు. దేవుడు (యేసును ఆయన తల్లిని అవమానించిన వారిని) పందులు కోతులుగా మార్చివేయగా, యూదులు యేసును చంపాలని ఒక తీర్మానమునకు వచ్చారు. అప్పుడు దేవుడు యేసును పరలోకమునకు ఎత్తికుంటాను అని ఆయనకు తెలియజేసాడు; కావున యేసు తన శిష్యులతో: ‘మీలో నాలాంటి రూపమును తీసుకొని (నా స్థానములో) చనిపోవుటకు మరియు సిలువ వేయబడి (తిన్నగా) పరదైసునకు వెళ్లుటకు మీలో ఎవరు ఒప్పుకుంటారు? అన్నాడు’ వారిలోని ఒక మనుష్యుడు తన్నుతాను సమర్పించుకొనగా, దేవుడు అతనిని యేసు వలె కనబడే రూపమునకు మార్చగా అతడు చంపబడి సిలువవేయబడ్డాడు.”

మరికొందరు ఇలా కూడా చెబుతారు, ఒక మనుష్యుడు యేసు ముందు (విశ్వాసివలె) నటించి ఆయనను నిందించుకుంటూ బయటకు వెళ్లగా, ఆ మనిషిని దేవుడు యేసుకు సరిసమానమైన రూపమునకు మార్చినాడు, అప్పుడు అతడు బందింపబడి సిలువవేయబడ్డాడు. (ఇంక) ఇతరులు ఏమంటారంటే, (ద్రోహము చేయాలనే ఉద్ధేశ్యముతో) తీతనస్‌ అనే యూదుడు యేసు  ఉన్న ఇంటిలోనికి ప్రవేశించాడు కాని ఆయనను కనుగొనలేక పోయాడు. అప్పుడు  యేసు వంటి రూపమునకు దేవుడు అతనిని మార్చివేసాడు, ఎప్పుడైతే అతను బయటకు వచ్చాడో ప్రజలు చూచి అతనే యేసు అనుకొని బంధించి తీసుకెళ్లి సిలువ వేసిరి.

ప్రవక్తల కాలమందు జరుగ వీలులేనివని ఎవరూ కనుగొనలేనంతటి తుల్యమైన అసాధారణ సంగతులు (ఈ విషయముపైన నివేదించబడ్డాయి). తన మహత్తైన అద్భుతముల (ము’జిజత్‌) ద్వారా (యేసు ప్రవక్తధర్మము యొక్క) నిశ్చయత ఉన్నప్పటికిని ఆయన ప్రవక్తను చంపాలనుకుని, దేవుని పట్ల వారు కొంటెతనముగా ప్రవర్తించారని వారి మాటలు చూపెడుతుండగా, (ఇంకను వారు) ఆవిధంగా చేయుటయందు సంతోషించారు, ఇందుకే దేవుడు (ఇక్కడ) యూదులను నిందించాడు. (యేసుని చంపాము) అని వారు చెప్పుకొంటున్నది కేవలము ఒక అభిప్రాయమైనందుకు మాత్రమే దేవుడు వారిపైన నెపము మోపుటలేదు.

…(అది) యేసు ఉన్న స్థితికి సంబంధించినది. ఈ సంఘటన (యేసు స్థానములో మరొక వ్యక్తి సిలువవేయబడుట) జరిగిన వెనువెంటనే, (దాని గురించి) ఆ ప్రజలు విభేదించారు. (దేవుడు అతనిని పరలోకమునకు తీసికొంటాడని ఆయన చెప్పినప్పుడు) కొందరు యూదులు, ‘యేసు అబద్దికుడు, నిశ్చయముగా మేము అతనిని చంపితిమి!’ అని అన్నారు. ఇతరులు సంకోచించగా, ఆ సంకోచించిన వారిలో కొందరు: ‘ఈయన (సిలువ వేయబడిన వ్యక్తి) గనుక యేసు అయితే, (ఆయనను అప్పగించాలనుకున్న) మన సహచరుడు ఎక్కడున్నాడు? అని అన్నందుకు వేరేవారు ‘అది యేసు ముఖమే, కాని మొండెము మాత్రము మన సహచరునిది’ అని అన్నారు. అయినను, ‘దేవుడు నన్ను పరలోకమునకు తీసుకొంటాడు’ అని యేసు చెప్పిన మాటలు వినినవారు మాత్రం ‘ఆయన పరలోకమునకు ఎత్తబడ్డాడు’ అని అన్నారు. ఆయన మానవ స్వభావము సిలువవేయబడింది, ఆయన దైవ స్వభావము పరలోకమునకు ఎత్తబడింది, అని కొంతమంది ప్రజలు (కూడ) నమ్ముతారు. … (హెల్ముట్‌ గాట్జె. ద ఖుర్‌’ఆన్‌ అండ్ఇట్స్ ఎక్సెజీసిస్ [ఒన్‌వాల్డ్‌ పబ్లికేషన్స్‌, 1996], 128-129 పేజీలు.)

చివరిగా, సూరా 4:157వ సూక్తి పైన ఇబ్న్‌ ఖాథిర్‌ చేసిన వ్యాఖ్యానము కూడ ఇక్కడ ఇస్తున్నాము:

మర్యమ్కు వ్యతిరేకముగా యూదులు పలికిన చెడ్డ నెపము మరియు ఈసాను చంపాము అని వారు చెప్పే మాటలు

అల్లాహ్‌ ఇలా అన్నాడు, …

(మరియు వారి (యూదులు) యొక్క అవిశ్వాసమును బట్టి, వారు మర్యమ్‌కు వ్యతిరేకముగా చెప్పుచున్న మిక్కిలి చెడ్డ నిందను బట్టి.) యూదులు మర్యమ్‌పైన “జారిణి” అనే నిందవేసారు అని ఇబ్న్‌ అబ్బాస్‌ చెప్పినట్లు అలీ బిన్‌ అబీ తల్హాహ్‌ అన్నాడు. అస్‌-సుద్ది, జువయ్‌బిర్‌, ముహమ్మద్‌ బిన్‌ ఇస్‌హాక్‌ వంటి వారు అనేకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మర్యమ్‌ను, ఆమె కుమారుని చెడ్డనిందలతో నిందించినట్లుగా ఆయత్‌ (వచనము) లో చాల స్పష్టమైన అర్థముతో వ్రాయబడియుంది: ఆమె జారిణి అని ఈసా వ్యభిచారము వలన పుట్టినవాడు అని వారు నిందించారు. అంతేగాక, రుతుస్రావములో ఉన్నప్పుడు కూడా ఆమె జారత్వములో ఉన్నది అని వారిలో కొందరు అన్నారు. అల్లాహ్‌ యొక్క యెడతెగని శాపము పునరుత్థాన దినము వరకు వారిపైన ఉండును గాక. యూదులు ఇంకా ఏమన్నారంటే,…

(“అల్లాహ్‌ యొక్క సందేశహరుడు, మసీహ్‌, మర్యమ్‌ కుమారుడైన ఈసాను మేము చంపాము,”) అల్లాహ్‌ యొక్క సందేశహరుడనని చెప్పుకొనుచున్న వ్యక్తిని మేము చంపాము అని దీని అర్థం. కేవలము ఎగతాళి చేస్తూ పరిహాసముతో, బహు దైవారాధకులు చెప్పినట్లుగా, యూదులు ఈ మాటలను ఉచ్ఛరించారు,…

(జిక్ర్‌ (ఖురాన్) అవతరింపబడిన వాడా, నిన్నే! నిశ్చయముగా, నీవు పిచ్చివాడవు!) అల్లాహ్‌ ఈసాను రుజువులతోను ఉపదేశముతోను పంపినప్పుడు, తన ప్రవక్తధర్మమును బట్టియు తాను చేసిన స్పష్టమైన అద్భుతకార్యములను బట్టియు యూదులు ఆయనయందు మత్సరపడిరి. యూదులపైన అల్లాహ్‌ యొక్క శాపములు, కోపము, ఉపద్రవము మరియు శిక్ష ఉండును గాక; అల్లాహ్‌ అనుమతితోడనే, ఆయన చనిపోయినవారిని తిరిగి బ్రతికించాడు, గ్రుడ్డివారిని కుష్ఠరోగులను బాగుచేశాడు. మట్టితో ఒక పిట్ట ఆకారమునుకూడ చేసి దానియందు ఊదగా, అల్లాహ్‌ అనుమతితోడ అది పక్షిగా మారి ఎగిరిపోయింది. ఈసాను అల్లాహ్‌ గొప్పచేయుటను బట్టి అనేకమైన ఇతర అద్భుతాలను కూడా ఆయన చేశాడు, అయినను యూదులు తిరస్కరించి అపనిందలువేసి ఆయనకు హానిచేయుటకు వారు చేయగలిగినంత వరకు చేశారు. అల్లాహ్‌ ప్రవక్తయైన ఈసా ఎవ్వరి పట్టణములోనూ ఎక్కువదినాలు నిలిచియుండలేదు, తరచుగా తన తల్లితో కలసి ప్రయాణించవలసి వచ్చేది, వారిద్దరిపైన  శాంతియుండునుగాక. అలా ఉన్నప్పటికి కూడా, యూదులు సంతృప్తి చెందలేదు, వారు ఆ దినములలో దమస్కునకు రాజుగా ఉన్న వాని యొద్దకు వెళ్లారు. అతడు గ్రీకు బహుదైవారాధకుడు, నక్షత్రములను ఆరాధించే వాడు. వారు ఆయనతో బేత్‌ అల్‌-మక్దిస్‌లోని ఒక మనుష్యుడు యెరూషలేములోని ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ, విభజనలుచేస్తూ, రాజునకు చెందినవారి మధ్యన గందరగోళము రేపుతున్నాడని చెప్పిరి. రాజు కోపోద్రేకుడై ఆ తిరుగుబాటు నాయకుని బంధించి, గందరగోళములు సృష్టించకుండా ఆయనను ఆపుచేసి, సిలువ వేసి ముళ్లకిరీటము ధరింపచేయుమని యెరూషలేము లోనున్న తన ప్రతినిధికి వ్రాశాడు. యెరూషలేములో ఉంటున్న ఆ రాజ ప్రతినిధి ఈ ఆజ్ఞలను అందుకొనినప్పుడు, కొంతమంది యూదులతోకూడ ఈసా నివాసముంటున్న ఆ ఇంటికి వెళ్లినాడు. ఆయన తన పండ్రెండుమందో, పదమూడుమందో లేక పదిహేడుమందో సహచరులతో కూడా ఆ ఇంటిలో ఉన్నాడు. ఆ దినము శుక్రవారము, సాయంత్రపు వేళ. ఈసా ఉన్న ఇంటిని వారు చుట్టుముట్టారు. ఇంటిలోకి వారు ప్రవేశించబోతున్న సమయంలో, లేక కూసేపటిలోనో కాసేపటిలోనో ఇక్కడనుండి వెళ్లిపోవాలి అని ఆయన అనుకున్నప్పుడు, ఆయన తన సహచరులతో , “మీలో ఎవరు నావలె చేయబడడానికి ముందుకువస్తారో, దానికి అతడు పరదైసులో నా సహచరునిగా ఉంటాడు” అని అన్నాడు. ఒక యవనస్తుడు స్వచ్ఛందముగా ముందుకు వచ్చాడు, కాని ఈసా అతడు చాలా చిన్నవాడు కదా అనుకున్నాడు. ఆయన రెండవసారి, మూడవసారి అలా ఆ ప్రశ్నఅడిగిన ప్రతిసారి, “భళా, నువ్వే ఆ మనిషివి” అని ఈసా చెప్పేవరకూ ఆ యవనస్తుడు ముందుకు వస్తూనే ఉన్నాడు. యింటి పైకప్పునకు ఒక రంధ్రము తెరువబడగా, ఈసా నిద్రబుచ్చబడి నిద్రపోతుండగానే పరలోకమునకు ఆరోహణుడై వెళ్లిపోయాడు. అదే సమయములో  అల్లాహ్‌ ఆ యవనస్తుడిని ఈసా వలె ఖరారుగా కనబడునట్లుగాచేశాడు. అల్లాహ్‌ అన్నాడు, …

(“ఓ ఈసా! నేను నిన్ను తీసుకొని నాయొద్దకు ఎత్తుకొంటాను” అని అల్లాహ్‌ చెప్పినది (గుర్తుచేసుకో).) ఈసా ఆరోహణమైనప్పుడు, యింటిలోని వారందరు బయటకు వచ్చిరి.  అప్పుడు ఆ ఇంటిని చుట్టుముట్టినవారు ఈసా వలె కనిపిస్తున్న ఆ మనిషిని చూసి, ఆయనే ఈసా అనుకొన్నారు. కావున రాత్రియందు అతడిని పట్టుకొని, సిలువ వేసి తన తలపైన ముళ్లకిరీటము పెట్టిరి. యూదులు ఈసాను చంపామని గప్పాలు చెప్పుకుంటుంటే వారి తప్పుడు మాటలను కొందరు క్రైస్తవులు అమాయకంగా నిష్కారణముగా నమ్మేశారు. ఈసాతో పాటు ఇంటిలోనున్నవారు మాత్రం, ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడని సాక్ష్యము పలుకుతుండగా, ఇతరులు ఈసాను యూదులు సిలువవేయడము ద్వారా చంపేసారని అనుకుంటున్నారు. వారు ఇంకా మర్యమ్‌ సిలువవేయబడిన వాని పీనుగ నొద్ద కూర్చొని యేడ్చింది, ఆ చచ్చిన మనిషి ఆమెతో మాట్లాడాడు అని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా అల్లాహ్‌ తన జ్ఞానమునుపయోగించి తన సేవకులకు పెట్టిన పరీక్ష. అల్లాహ్‌ ఈ విషయమును తన అద్భుతకార్యములతోను స్పష్టమైన మరియు నిస్సంశయమైన నిదర్శనాలతో ఆదుకొనిన తన గౌరవనీయుడైన సందేశహరునికి పంపిన దివ్య ఖుర్‌’ఆన్‌లో వివరించాడు. అల్లాహ్‌ అత్యంత సత్యవంతుడు, ప్రపంచములకు ప్రభువు. హృదయాలలో దాగియున్న రహస్యములను, ఆకాశమందును భూమియందును దాగియున్న విషయాలను ఎరిగినవాడు, జరగబోవుదానిని, ఒక వేళ అది శాసించి ఉంటే ఏమి జరుగుతుందో కూడ తెలిసినవాడు. ఆయన అన్నాడు, …

(కాని వారు ఆయనను చంపలేదు, సిలువ వేయను లేదు, కాని అది వారికి ఆ విధముగా కనిపించింది,) యూదులు ఈసా అని తలంచిన వ్యక్తిని నిర్దేశిస్తూ చెప్పినది. ఇందుకే తరువాత అల్లాహ్‌ చెప్పాడు, …

(ఆ విషయములో భిన్నాభిప్రాయాలు గలవారు సందేహాలతో నిండియున్నారు. వారికి (సరియైన) తెలివి లేదు, వారు అనుసరించేది ఊహనే తప్ప మరేమియుకాదు.) ఈసాను చంపామని చెప్పుకొంటున్న యూదులను మరియు వారిని నమ్మిన అమాయకపు క్రైస్తవులను నిర్దేశిస్తూ చెప్పినది. వాస్తవానికి వారందరు గందరగోళములోను, తప్పు త్రోవలోను మరియు దిగ్భ్రమలోను ఉన్నారు. ఇందుగురించే అల్లాహ్‌ చెప్పాడు, …

(నిశ్చయముగా, వారు ఆయనను చంపలేదు.) అనగా వారు చంపింది ఈసానే అనే కచ్చితత్వము వారికిలేదు. పైగా, వారు ఈ విషయమై సందేహములోను గందరగోళములోను ఉన్నారు. …

(కాని అల్లాహ్‌ ఆయనను తనయొద్దకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్‌ నిత్య సర్వశక్తుడు.) దీని అర్థము, ఆయన సర్వశక్తిగలవాడు, మరియు ఆయన ఎప్పుడూ బలహీనుడు కాదు,  ఆయనను ఆశ్రయించువారెవ్వరు అవమానపరచబడరు, …

(సర్వజ్ఞుడు) తన ప్రాణులకు తాను నిశ్చయించువాటిలో మరియు నియమించు వాటన్నిటిలోను సర్వజ్ఞానము గలవాడు. వాస్తవానికి, అల్లాహ్‌దే తేటయైన జ్ఞానము, ఆయనదే నిస్సంశయమైన నిదర్శనము మరియు దివ్యమైన అధికారము. ఇబ్న్‌ అబ్బాస్‌ చెప్పినదానిని ఇబ్న్‌ అబీ హాతిమ్‌ ఇక్కడ నమోదు చేసినదేమనగా, “అల్లాహ్‌ ఈసాను ఆకాశములకు ఎత్తుకొనే ముందు, ఒక ఇంటిలో ఉన్న తన చెలికాండ్ర యొద్దకు ఈసా వెళ్లాడు, వారు పండ్రెండుమంది. అతను వచ్చేసరికి ఆయన తల వెండ్రుకల నుండి నీరు కారుతుంది. ఆయన, ’మీలో నాయందు విశ్వాసముంచిన తరువాత కూడా  పండ్రెండు సార్లు అపనమ్మికను వ్యక్తం చేసేవారున్నారు’ అని చెప్పి వెంటనే, ‘నావలే మీ రూపము కనపడులాగున స్వచ్ఛందముగా ఎవరు ముందుకు వచ్చి, నా స్థానములో చనిపోతారు? అతడు (పరదైసులో) నాతో కూడ ఉంటాడు’ అని అన్నాడు. అప్పుడు వారి మధ్యలోనున్న పడుచువారిలో ఒకడు స్వచ్ఛందముగా ముందుకు రాగా, ఈసా అతనిని కూర్చోమన్నాడు. ఈసా ఉమేదువాని (స్వయంసేవకుని) కోసం మరలా అడుగగా, ఆ పడుచువాడే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నాడు, ఈసా మాత్రం అతనిని కూర్చోమని అడుగుతున్నాడు. చివరకు ఆ పడుచువాడే ముందుకు వస్తే, ఈసా ‘ఆ మనిషివి నువ్వే’ అని అన్నాడు, మరియు ఈసా యొక్క ప్రతిరూపము ఆ మనిషికి వేయబడింది. ఆ సమయములోనే యింటికి ఉన్నటువంటి రంధ్రము ద్వారా ఈసా పరలోకానికి ఆరోహణుడై వెళ్లిపోయాడు. యూదులు ఈసాను వెదకుతూ వచ్చినప్పుడు, వారు ఆ పడుచువానిని చూచి వానిని సిలువ వేసిరి. ఈసా అనుచరులు ఆయనయందు విశ్వాసముంచిన పిదపకూడా పండ్రెండుసార్లు ఆయనయందు అపనమ్మిక వ్యక్తం చేశారు. తరువాత వారు మూడు గుంపులుగా విడిపోయారు. ఒక గుంపువారు, అల్‌-యాఖుబియ్యహ్‌ (యాకోబీయులు), ‘అల్లాహ్‌ ఆయనకు ఇష్టమొచ్చినంత కాలం మనతోకూడ ఉండి అటుతరువాత పరలోకానికి ఆరోహణమై వెళ్లాడు’ అని అన్నారు. మరొక గుంపువారు, అన్‌-నస్టురియ్యహ్‌ (నెస్టోరీయులు), ‘అల్లాహ్‌ కుమారుడు తనకు ఇష్టమొచ్చినంతకాలం మాతో ఉండగా, అల్లాహ్‌ అతనిని పరలోకమునకు తీసుకొన్నాడు’ అని అన్నారు. వేరొక గుంపువారు, ముస్లింలు, ‘అల్లాహ్‌ యొక్క సేవకుడు మరియు సందేశహరుడు అల్లాహ్‌కు ఇష్టమొచ్చినంతకాలం మాతోకూడ ఉన్నాడు, తరువాత అల్లాహ్‌ అతనిని తీసుకొన్నాడు’ అని అన్నారు. ఆ రెండు అవిశ్వాస గుంపులువారు కలిసి ముస్లిం గుంపునకు వ్యతిరేకముగా పనిచేసి వారిని చంపివేసారు. అది జరిగినప్పటినుండి, అల్లాహ్‌ ముహమ్మద్‌ను పంపించేవరకు ఇస్లాం మరుగైపోయింది.” ఈ ప్రతిపాదనకు ఇబ్న్‌అబ్బాస్‌ వరకు సాగే అధికారికమైన (నమ్మతగిన) గొలుసుకట్టు వృత్తాంతము ఉంది, మరియు అబు ము’ఆవియహ్‌ యొద్దనుండి అబు కురైబ్‌ ఇచ్చిన నివేదిక ద్వారా అన్‌-నసాఇ దీనిని వివరించాడు. ఎవరైనా ఈసాకు బదులుగా చనిపోతే అతడు పరదైసులో తనకు చెలికాడవుతాడని చెప్పి, తన ఆకారములో కనబడుటకు ఎవరైన స్వచ్ఛందముగా ముందుకురావాలని ఈసా అడిగినట్లు సలాఫీయులలో చాలామంది చెప్తుంటారు. (ఆధారము)

ఈ పరస్పర విరుద్ధ నివేదికలన్నిటిని పరిశోధించిన తరువాత కూడ యేసు క్రీస్తు ప్రభువు వలె కనబడునట్లు చేసింది తీతవుస్‌నా, యూదా ఇస్కరియోతునా, లేక కావలివానినా అనేది తెలియక ఇంకను ఆశ్చర్యములోనే మిగిలిపోతాము. మరియు యేసు క్రీస్తు ప్రభువు స్థానములో చనిపోయినవాడు పండ్రెండుమంది, లేక పదమూడుమంది, లేక పదిహేడుమంది, లేక పంతొమ్మిది మంది (?!) శిష్యులలో ఒకడా? అసలు ఎవరిలో ఎవరు అతను? అనేది కూడా విస్మయమే. అసలు, యేసు క్రీస్తు ప్రభువు స్థానములో ఒక అమాయకుడు చనిపోవటానికి అల్లాహ్‌ అనుమతించగలిగినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువునే ఎందుకు చనిపోనివ్వలేదు?  చివరిగా, తన శత్రువులందరి సమక్షములో యేసు క్రీస్తు ప్రభువును చాలా తేలికగా తీసుకొని వెళ్లగలిగినంత సమర్థత అల్లాహ్‌కు కలిగియుండి కూడా, మరొకరిని చనిపోనిచ్చుటలో ఉన్న మతలబు ఏమిటి? ఆ విధముగా శత్రువులందరి సమక్షములో యేసు క్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్లినట్లయితే, శత్రువుల అబద్ధముల నుండి యేసు క్రీస్తు ప్రభువును తప్పించటానికి అల్లాహ్‌ చేయగల ఒక అతిగొప్ప కార్యముగా ఉండేది కదా.

ప్రత్యామ్నాయముగా, యేసు క్రీస్తు ప్రభువు స్థానములో మరొకరు చనిపోవుటకు దేవుడు అనుమతించాడని మనల్ని నమ్మమంటారు. అదే సమయములో, యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడి వాస్తవంగా చనిపోయాడని యూదులను మరియు క్రైస్తవులను సుమారుగా ఆరు శతాబ్దాలకాలం పాటు దేవుడు నమ్మింపచేసాడని మనం నమ్మాలట. ఈ స్పష్టమైన మోసమును తేటపరచటానికి చివరిగా ఖుర్‌’ఆన్‌ అవతరించబడేవరకు అసంఖ్యాకమైన వేవేలమంది ఈ అబద్దంకోసం చనిపోవుటకు ఇంత కఠోరమైన తప్పు నడపబడింది!

యేసు క్రీస్తు ప్రభువు మరణము మరియు ఆయన మహిమలోనికి కొనిపోబడుటకు సంబంధించి వాడిన తవఫ్ఫ అను క్రియాపదము, యేసు క్రీస్తు ప్రభువు దేవుని యొద్దకు ఆరోహణమై వెళ్లుటకు ముందుగానే ఆయన చనిపోయారు అని భావమునిచ్చుచున్నట్లుగా ఖుర్‌’ఆన్‌ గ్రంథమే రుజువు చూపుతుంది. ఏలయనగా, ఖుర్‌’ఆన్‌లో అనేక సందర్భాలలో ఆ క్రియా పదము మరియు దానినుండి పుట్టుకొచ్చిన వివిధ రూపాలు ఉపయోగించబడినాయి, వాటిలో కొన్ని నీల్‌ రాబిన్సన్‌ వ్రాసిన క్రైస్ట్‌ ఇన్‌ ఇస్లామ్‌ అండ్‌ క్రిస్టియానిటి  అనే పుస్తకములో నొక్కిచెప్పటం జరిగింది:

“మూలపదమైన వఫ (- ఈ పదము నుంచే తవఫ్ఫ అనే పదము వచ్చింది), , ““, “అను మూడు హల్లుల కలిసిన పదముగా ఖుర్‌’ఆన్‌లో కనిపించదు. అయినను, దానికి సమానమైన రెండు ఉదాహరణలు విశేషణరూపములో (elative) మనకు కనబడతాయి (9:111 మరియు 53:41), ఇవి ఆ మూలపదము యొక్క అర్థము “(వాగ్దానము) నెరవేర్చుట”, లేక “పూర్తియగుట” అని తెలియజేస్తాయి.

రెండవరూపమైన “వఫ్ఫ“, సమాపక క్రియాపదముగా (finite verb) పద్దెనిమిది సార్లు, అసమాపక క్రియగా (participle) ఒకసారి వాడబడింది:

  1. అబ్రాహాము కర్త (subject) గా ఉండి, కర్మ (object) ఎవరో ఏమిటో వ్యక్తపరచబడని సందర్భములో “(వాగ్దానము) నెరవేర్చుట” అనే మూలపదమునకు దగ్గరగా ఉండే అర్థముతో 53:37లో ఒకసారి వాడబడింది.
  2. ఇక మిగిలిన అన్ని సందర్భములలోను ప్రజలు ఈ జీవితంలో చేసిన క్రియలకు అంత్యదినమున తీర్పు తీర్చు సమయములో దేవుడు ఇస్తున్న ప్రతిఫలములను గూర్చిన సందర్భములో “చెల్లించుట/ మొత్తమును తిరిగి చెల్లించుట” అనే అర్థముతో ఆ పదము వాడబడినది. (సకర్మక ప్రయోగము (active): 3:57; 4:173; 11:15,111; 24:25,39; 35:30; 46:19; కర్మార్థక ప్రయోగము (passive): 2:272,281; 3:25; 3:161,185; 8:60, 16:111; 39:10,70; సకర్మక అసమాపక క్రియగా (active participle): 11:109).

నాలుగవరూపమైన “అవ్కూడా సమాపక క్రియాపదముగా పద్ధెనిమిది సార్లు, అసమాపక క్రియగా ఒకసారి వాడబడింది:

  1. తరచుగా దీని అర్థము “(ఒక నిబంధన, మ్రొక్కు, ప్రమాణము లేక నియమము) నెరవేర్చుట” అని వస్తుంది; (మానవుడు కర్తగా (subject) ఉండినప్పుడు 2:40; 3:76; 5:1; 6:152; 13:20; 16:91; 17:34; 22:29; 48:10; 76:7; సకర్మక అసమాపక క్రియగా (active participle): 2:177; దేవుడు కర్తగా (subject) ఉండినప్పుడు: 2:40).
  2. “పూర్తి (కొలత) గా ఇచ్చుట” అనే అర్థము  కూడా ఉన్నది. (మానవుడు కర్తగా ఉండినప్పుడు: 6:152; 7:85; 11:85; 12:59,88; 17:35; 26:181).

పదవరూపమైన “ఇస్తవఫ్ఫఒక్కసారి మాత్రమే వాడబడింది, ఈ సందర్భములో “పూర్తి పారితోషికమును దబాయించి అడుగుట” ” మొత్తమును కక్కసించి అడుగుట” అనే అర్థములతో వాడబడింది. (83:2)

ఆరవరూపమైన తవఫ్ఫ25 సార్లు సమాపక క్రియాపదముగాను మరియు ఒకసారి సకర్మక అసమాపక క్రియాపదముగాను వాడబడింది.

  1. దూతగణములు లేక వార్తాహరులైన దూతలు కర్తగా వచ్చినప్పుడు దాని అర్థం “తీసికొను” లేక “(మరణమందు) కూర్చు/పోగుచేయు” అని వస్తుంది (4:97; 6:61; 7:37; 8:50; 16:28,32; 32:11; 47:27). 4:15 లో మరణమే కర్తగా నున్నది.
  2. దేవుడు కర్తగా నున్నప్పుడు దాని అర్థము:
   1. మరణమందు తీసికొనుట లేక మరణింపజేయుట“(10:104; 16:70; 39:42),
   2. మరణమందు తీసికొనుట లేక అకాలముగా మరణింపజేయుట (ముహమ్మద్‌ 10:46; 13:40; 40:77; భక్తిగలవారు 3:193; 7:126; 12:101),
   3. నిద్రలో ఆత్మలను “తీసికొనుట”, మరణమునకు పోలినది (6:60; 39:42),
   4. యేసుక్రీస్తు ప్రభువును “తీసికొనుట” (5:117; అసమాపక క్రియ 3:55).
  3. కర్మార్థక ప్రయోగములో (passive) మరణము విషయములో మృదువుగా మాట్లాడుతూ, విశేషముగా అకాలమరణమును గురించి వాడబడింది (2:234,240; 22:5; 40:67).” (నీల్‌ రాబిన్సన్‌ వ్రాసిన క్రైస్ట్ఇన్ఇస్లామ్అండ్క్రిస్టియానిటి, [స్టేట్‌ యూనివర్శిటీ ఆఫ్‌‍ న్యూయార్క్‌ ప్రెస్‌, 1991], 117-118 పేజీలు; లావుపాటి అక్షర వొక్కాణింపు మాది)

దేవుడు లేక దూతగణములు కర్తగా వచ్చినప్పుడుతవఫ్ఫ”  ఎల్లప్పుడూ దాదాపుగా మరణమునే సూచిస్తుంది అని చెప్పిన రాబిన్సన్‌ దృక్పథమును బలపరచుచున్న ఖుర్‌’ఆన్‌ సూక్తులను కొన్ని దిగువన ఉదాహరించుచున్నాము:

మీలో నుండి విగత జీవులైన వారి భార్యలు నాలుగు మాసముల పది దినముల వరకు వేచి వుండవలయును…” సూరా 2:234. (షేక్‌ ఇబ్రాహీం నాసిర్‌ తెలుగు అనువాదం, పవిత్ర ఖురాన్‌)

మేము వారికి ప్రమాణము చేసినవాటిలో కొన్నిటిని మేము నిన్ను (ఓ ముహమ్మద్‌) చూడనిచ్చినా లేక (ఒకవేళ మేము) నిన్ను మరణింపజేసినావారు మాయొద్దకే తిరిగి రావలెను, అన్నిటికంటే వారు చేసినవాటికి అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు.” సూరా 10:46 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

ఎవరైనా తప్పు చేస్తుంటే వారిని దూతలు మరణింపజేస్తాయి. అప్పుడు వారు “మేము ఏ తప్పు చేయలేదు” అంటూ పూర్ణ విధేయతను చూపుతారు. లేదు! మీరు ఏమి చేసినది నిశ్చయముగా తెలిసినవాడు అల్లాహ్‌నే.” సూరా 16:28 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

ఇలా పలుకు: మీపై నియమింపబడిన మరణ దూత మిమ్మును సమకూర్చుతుంది, తరువాత మీరు మీ ప్రభువునొద్దకే తిరిగి వచ్చెదరు.” సూరా 32:11 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

పైన ఇవ్వబడిన ఉదాహరణలు మరియు భాషకు సంబంధించిన ఆధారాల వెలుగులో, చివరకు తేలిన ఫలితార్థము ఏమంటే, ఖుర్‌’ఆన్‌ లోని సూరా 3:55 మరియు 5:117 సూక్తులు యేసు క్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణుడవక మునుపే చనిపోయారు అని నిష్కర్షగా రుజువు చేస్తున్నాయి.

సహీహ్‌ అల్‌-బుఖారీ లోని ఒక హదీతులో దీనిని గురించిన అదనపు సమాచారం మనకు లభిస్తుంది:

అబ్దుల్లాహ్‌ ఇబ్న్‌ మసూద్‌ విన్నవించినది

‘ఆ ప్రవక్తలలో ఒకనిని  వాని దేశస్థులు రక్తముకారునట్లుగా కొట్టుచుంటే, తన ముఖముపై కారుచున్న రక్తమును తుడుచుకుంటూ ఆ ప్రవక్త, “ఓ అల్లాహ్‌! నా దేశమును క్షమించుము వారికి తెలివి లేదుఅని అన్నాడు,’  అని ప్రవక్త మాట్లాడుట నేను చూచాను. సహీహ్‌ అల్‌-బుఖారీ సంపుటి 4:683 (డాII ముహమ్మద్‌ ముషిన్‌ ఖాన్‌ 9 సంపుటలుగా చేసిన తర్జుమా)

కలువరి సిలువలో వ్రేలాడుతూ అంతటి గొప్ప మాట పలికిన ఆ ఏకైక ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తే:

మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి; వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి. యేసు – తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి..” లూకాసువార్త 23:32-34

అయితే, ఖుర్‌’ఆన్‌లోని సూరా 4:157వ సూక్తి యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణమును తృణీకరిస్తున్నందున, ఈ హదీతు కూడా సమస్యను పరిష్కరించటంలేదు. అంతే గాక ముహమ్మద్‌ అయూబ్‌ తెలియజేస్తూ, యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదు కాని అబద్ధ క్రీస్తును చంపటానికి చివరిలో మరలా వస్తాడు. ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభువు చనిపోయి, సమాధిచేయబడి, మరియు తీర్పుదినమున తిరిగిలేస్తాడు అని ముహమ్మద్‌ చెప్పినట్లు, ఆ ముహమ్మద్‌ దగ్గరనుండియే వస్తున్న ఒక సంప్రదాయమును చెప్పాడు. (అయూబ్‌, ద ఖుర్‌’ఆన్‌ అండ్ఇట్స్ఇంటర్ప్రెటర్స్‌ (ఖుర్‌’ఆన్‌ మరియు దాని అనువాదకులు), 170-171 పేజీలు)

ఒక ప్రక్క ఖుర్‌’ఆన్‌ గ్రంథము వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడి చనిపోయారు అనే  భావమును ధ్వనింప చేస్తున్నందున, పరస్పర విరుద్ధములుగా కనిపిస్తున్నటువంటి సిద్ధాంతములను సమన్వయపరచటానికి సాధ్యమైన పరిష్కారములు అనేకము గలవు. అయినప్పటికి, ఖుర్‌ఆన్‌ మరో ప్రక్క యూదులు మెస్సీయను సిలువవేసి చంపారు అనే విషయమును స్పష్టముగా వ్యతిరేకిస్తున్నది:

1.

సూరా 4:157 యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడుటను తృణీకరించుటలేదు, కాని సిలువమరణానికి బాధ్యులు యూదులు అనుటను మాత్రమే తృణీకరిస్తుంది. ఈ వ్యాఖ్యానము ఖుర్‌’ఆన్‌ చెప్పుచున్నదానికి అనుగుణ్యముగా ఉంది, మరియు ఈ విషయమును దిగువనీయబడిన వచనము నిరూపించుచున్నది:

మీరు (ముస్లింలు) వారిని చంపలేదు, కాని అల్లాహ్‌ వారిని చంపాడు. మరియు నీవు (ముహమ్మద్‌) విసిరినప్పుడు విసిరింది నీవు కాదు, కాని అల్లాహ్‌యే విసిరినాడు, ఆ విధంగా విశ్వాసులను తన న్యాయమైన పరీక్షతో పరీక్షీంచును. ఇదిగో! అల్లాహ్‌ వినువాడు, తెలిసినవాడు.” సూరా 8:17 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

కావున, యేసు క్రీస్తును సిలువ వేసినది యూదులు కాదు కాని ముందుగా నిర్ణయించబడిన దేవుని సంకల్పమే క్రీస్తును సిలువవేయబడుటకు అనుమతించినది. బైబిలుకూడా దీనినే చెప్పుచున్నది:

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను  మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.” అపొస్తలుల కార్యములు 2:23-24

అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.” అపొస్తలుల కార్యములు 3:18

ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.” అపొస్తలుల కార్యములు 4:27-28

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.” 1పేతురు 1:19-20

భూ నివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.” ప్రకటన గ్రంథము 13:8

ఈ దృక్పథము గనుక నిజమైతే, యేసు క్రీస్తు ప్రభువు మరణ పునరుత్థానములపైన ముస్లింలకు ఏ ఆటంకములు ఉండ కూడదు. వాస్తవానికి, ఒక ముస్లిం రచయిత తన పూర్ణహృదయముతో దీనిని అంగీకరిస్తున్నాడు:

“కేవలము యేసు క్రీస్తు ప్రభువును చంపబడకుండా తప్పించుట మాత్రమే అల్లాహ్‌ను ఉపాయములు చేయు వారిలో శ్రేష్టునిగా చేయదు, ఎందుకనగా, యేసు క్రీస్తు ప్రభువును చంపబడకుండా ఎవరైనా తప్పించగలరు… ఆయన ఉపాయములు చేయువారిలో శ్రేష్టుడు కావుననే, పునరుత్థానము అల్లాహ్చేసిన ఉపాయము. యూదులు వారి ఉపాయములను నెరవేర్చుకొని యేసు క్రీస్తు ప్రభువును చంపినారు, కాని అల్లాహ్‌ యేసు క్రీస్తు ప్రభువును తిరిగి జీవింపచేసి తనయొద్దకు తీసికొనుట ద్వారా తన శ్రేష్ఠమైన ఉపాయమును నెరవేర్చినాడు.” (A.H.Obaray, Miraculous Conception, Death, Resurrection, and Ascension of Jesus (Nabi-Isa) as Taught in th Kuran [Kimberly, South Africa; Pub. By Autho, 1962] 39వ పేజి)

ఈ దృక్పథముతో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదని ముహమ్మద్‌ చెప్పిన సాక్ష్యమునకు ఇది విరుద్ధముగా ఉన్నది. పారంపర్యంగా చెప్పుకొనుచున్న ఐతిహ్యము (హదీతులు, సున్నాహ్‌) తప్పు అని ఒప్పుకొని దానిని పూర్తిగా నిరాకరించటమే దీని పరిష్కారమునకున్న ఏకైక మార్గము. కేవలం ఖుర్‌’ఆన్‌ను మాత్రమే నమ్ముతూ, ఐతిహ్యములను (సంప్రదాయ హదీతులు మరియు సున్నాహ్‌ను) తృణీకరించే వారిలో రషాద్‌ ఖలీఫా అనుచరులతో పాటు కొంతమంది ముస్లింలున్నారు.

2.

యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదు, గాని ఆయన చనిపోయినట్లుగా కనబరచబడింది. ఆయన రెండవసారి వస్తున్నాడు అప్పుడు ఆయన విశ్వమంతటిని ఇస్లాంలోనికి నడిపించి అటుతరువాత మరణమును చవిచూస్తాడు.

ఈ రెండవ దృక్పథముతో ఉన్న సమస్య ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభువు ఆరోహణమవక ముందే చనిపోయాడు అని ఖుర్‌’ఆన్‌ చెప్తున్న స్పష్టమైన అధారాలను ఇది త్రోసివేస్తుంది.

3.

యేసు క్రీస్తు ప్రభువు సిలువవేయబడి చనిపోయాడు. అప్పుడు ఆయన దేవుని చేత లేపబడి పరలోకమునకు ఎత్తబడ్డాడు. అక్కడనుండి ఆయన రెండవసారి వచ్చి అబద్ద మెస్సీయాను చంపి, విశ్వమంతటిని ఇస్లాంలోనికి నడిపించి, అటుతరువాత రెండవసారి చనిపోతాడు. తుదకు ఆయన తీర్పుదినమున రెండవసారి తిరిగి పునరుత్థానుడవుతాడు.

ఈ దృక్పథము కొంతమందికి సమస్యగా ఉంటుంది, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు రెండుసార్లు చనిపోతారు అంటున్నారు, అయితే కొంతమంది ముస్లింలు దీనిని అంగీకరించరు. ప్రతి జీవి ఒక్కసారే చనిపోతుంది, తరువాత దేవుని యెదుట లెక్కచెప్పటానికి తిరిగిలేస్తుంది అని చెప్తున్న ఖుర్‌’ఆన్‌ వచనాలను వారు చూపుతారు:

ప్రతీ జీవి మరణమును చవి చూడవలసినదే; కేవలము తీర్పుదినముననే మీరు చేసిన దానికి ప్రతిఫలం పొందుతారు. అగ్నికి దూరముగా తప్పించబడి తోటలోనికి ప్రవేశము పొందినవారే (జీవితము యొక్క) తాత్పర్యమును పొందినవారు: ఇహలోక జీవితము కేవలము మోసపూరితమైన వస్తువులు గృహోపకరణాలు మాత్రమే.” సూరా 3:185 (యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

అయినను, అదే ప్రతీకన ఖుర్‌’ఆన్‌ లోని కొన్ని వచనాలు రెండు మరణాలను గురించి మాట్లాడుతున్నాయి:

ఇదిగో! (ఆ దినమున) అవిశ్వాసులకు ఈ విధముగా ప్రకటన ద్వారా తెలియచేయబడుతుంది: నిశ్చయముగా మీరు విశ్వాసమువైపునకు పిలువబడినపుడు మీరు తిరస్కరించిరి. మీరు ఒకరి పైన ఒకరు అసహ్యించుకొనిన దానికంటే అల్లాహ్‌ మీ మీద అసహ్యపడుట చాలా భయంకరముగానుండును. దానికి వారు ఇలా అంటారు: మా ప్రభువా! రెండు సార్లు నీవు మమ్మును మరణింప చేసావు, రెండుసార్లు మమ్మును బ్రదికింపచేసావు. ఇప్పుడు మా పాపములను మేము ఒప్పుకొంటున్నాము. బయటకు వచ్చుటకు మార్గమేమైననూ కలదా?” సూరా 40:10-11 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

చనిపోయిన ప్రజలు మరలా చనిపోవుటకే తిరిగిలేచినట్లు ఖుర్‌’ఆన్‌లో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నవి:

” ఓ మూసా! మేము దేవునిని స్పష్టముగా చూచేవరకు నిన్ను నమ్మము,” అని మీరు చెప్పినదానిని జ్ఞాపకము చేసికొనుడి, మీరు చూస్తుండగానే  ఉరుములు మెరుపులు మీమీద పడినవి. మీరు చచ్చిన పిదప మేము మిమ్మును లేపితిమి:  కృతజ్ఞత కలిగి ఉండుటకు మీకు అవకాశము లభించింది. సూరా 2:55-56 (యూసుఫ్‌ అలీ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

మీరు ఒక మనిషిని చంపి దాని గురించి విభేదించినప్పుడు మీరు మరుగుచేసినదానిని అల్లాహ్‌ బయటపెట్టినది (జ్ఞాపకము చేసికొనుడి). మరియు దీనిలోని కొంచెం తీసి అతనిని కొట్టమని మేము చెప్పాము. ఆ విధముగా చచ్చినవారిని అల్లహ్‌ బ్రదికించి మీరు అర్థము చేసికొనునట్లు తన ఉత్పాతములను (దుశ్శకునములను) చూపించును. సూరా 2:72-73 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

(ఓ ముహమ్మద్‌), వేలమందిలోనుండి తమకున్న నివాసములను విడిచి మరణమునకు భయపడుతూ వెళ్లిన పూర్వికులను గురించి ఆలోచించు, వారితో అల్లాహ్‌ ఇలా అన్నాడు: చావండి; మరియు ఆయన వారిని తిరిగి బ్రదికించాడు. ఇదిగో! అల్లాహ్‌ మనుష్యుల పట్ల దయచూపు ప్రభువు, అయినను చాలామంది మనుష్యులు కృతజ్ఞతలు చెప్పరు. సూరా 2:243 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

లేక,  నాశనమైపోయిన ఒక నగరము మీదుగా వెళుతూ: ఈ చచ్చిన నగరానికి అల్లాహ్‌ ఎలా జీవమునీయగలడు? అని ఆశ్చర్యాన్ని వ్యక్తము చేసిన ఒక వ్యక్తిని (గురించి ఆలోచించు). అల్లాహ్‌ అతనిని మరణింప చేసి నూరు సంవత్సరములతరువాత మరలా బ్రదికించాడు. ‘నీవు ఎంతకాలంగా ఇలా ఉన్నావు?’ అని ఆయన అడుగగా (ఆ మనుష్యుడు): ‘ఒక దినమో లేక దినములోని ఒక భాగమో ఇలా ఉన్నా’నని చెప్పాడు. అందుకు ఆయన: ‘కాదు, నీవు నూరు సంవత్సరములుగా ఇలానే ఉన్నావు. నీ భోజనమును మరియు పానీయమును చూడు అవి చెడిపోలేదు! నీ గాడిదను చూడు! మేము నిన్ను మానవజాతికి ఒక సంకేతముగా చేయుచున్నాము, ఎముకలను చూడుము, వాటిని ఎలా సరి చేసి మాంసముతో కప్పుచున్నామో చూడుము’ అన్నాడు! విషయము అతనికి తేటతెల్లమైనప్పుడు, అతడు: ‘అల్లాహ్‌ అన్నిటిని చేయగలడని నాకు ఇప్పుడు తెలియును’ అని అన్నాడు. సూరా 2:259 (పిక్తాల్‌ ఇంగ్లీషు అనువాదం తెనుగీకరణ)

మహాబిలంవాళ్ళను, శిలాశాసనంవాళ్ళను మా సూచనలలో కొన్ని వింత సూచనలని భావిస్తున్నావా నీవు? ఆ యువకులు ఆశ్రయం పొందడానికి ఒక గుహలో ప్రవేశించి “ప్రభూ! మాపై నీ విశేష కారుణ్యం వర్షింపజెయ్యి. మా వ్యవహారం చక్కబెట్టు” అని ప్రార్థించారు. అప్పుడు మేమా యువకుల్ని ఆగుహలో పరుండబెట్టి సంవత్సరాల తరబడి ప్రగాఢ నిద్రావస్థలో ఉంచాము. ఆ తరువాత వారిలో ఎవరు తమ నిద్రావస్థ కాలాన్ని కచ్చితంగా లెక్కగడ్తారో తెలుసుకోవడానికి మేము వారిని లేపాము…ప్రవక్తా! నీవు గనక ఆ గుహలో ఆ యువకుల్ని చూస్తే ఆ దృశ్యం నీకీ విధంగా కన్పిస్తుంది: సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అతను వారి గుహ (ముఖద్వారం) వదలి కుడి వైపుగా పైకి ఎక్కిపోతాడు. అస్తమిస్తున్నప్పుడు వారిని తప్పించి ఎడమ వైపుగా క్రిందికి దిగిపోతాడు. (ఈవిధంగా ఆ గుహలోకి సూర్యకిరణాలు చొచ్చుకురాకుండా ఎల్లప్పుడూ చీకటిగానే ఉండేది.) వారా గుహలో ఒక సువిశాల స్థలంలో పడి ఉన్నారు. ఇది దేవుని సూచనల్లో ఒక సూచన. దేవుడు ఎవరికి దారి చూపగోరుతాడో అతనే దారిలోకి వస్తాడు; ఎవరిని దారి తప్పించదలచుకుంటాడో అతనికి ఏ మార్గదర్శీ, కార్యసాధకుడూ లభించడు. నీవు వారిని చూసి మేల్కొనివున్నారని భావిస్తావు. కాని వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడిప్రక్కకు, ఎడమప్రక్కకు తిరుగుతూ పడుకునేలా చేశాం. వారి కుక్క గుహ ముఖద్వారంలో ముందుకాళ్ళు చాచి కూర్చున్నది. నీవు గనక కాస్త ఆ గుహలోకి తొంగి చూశావంటే చాలు, గిర్రున వెనక్కి తిరిగి పరుగు లంకించుకుంటావు. అక్కడి భయంకర దృశ్యానికి నీ గుండెలు ఠారెత్తిపోతాయి. వారు పరస్పరం (తమ పరిస్థితిని గురించి) చర్చించుకోవడానికి మేము వారిని తిరిగి అదేవిధంగా లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకడు “మనం ఈ స్థితిలో ఎంత సేపు ఉన్నాం?” అని అడిగాడు. దానికి రెండోవాడు “బహుశా (మనమీ స్థితిలో) ఒక రోజో లేక అంతకంటే కొంచెం తక్కువ సేపో ఉండివుంటాం” అన్నాడు. ఆ తరువాత వారిలో కొందరిలా అన్నారు: “మనమీ స్థితిలో ఎంతసేపు ఉన్నామో దేవునికే బాగా తెలుసు. సరే, ఇప్పుడు మనలో ఒకనికి ఒక వెండినాణెం ఇచ్చి నగరం లోకి పంపుదాం. అతను మనకు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో చూసి తెస్తాడు. అయితే అతను జాగ్రత్తగా మసలుకోవాలి. మనం ఇక్కడ ఉన్నట్లు అతని అజాగ్రత్త వల్ల ఎవరికైనా తెలిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. విధివశాత్తు మనం వారి చేతుల్లో పడితే మాత్రం వారు మనల్ని (ఎట్టి పరిస్థితిలోనూ) వదలరు. రాళ్ళతో కొట్టి చంపేస్తారు. లేదా బలవంతంగా మనల్ని తమ మతంలోకి లాక్కుంటారు. అలా జరిగితే మనమిక ఎన్నటికీ మోక్షం పొందలేము.”… (కొంతకాలానికి యువకుల సంఖ్య, వారి నిద్రావస్థకాలం గురించి ప్రజల్లో భిన్నా భిప్రాయాలు ఏర్పడ్డాయి.) కొందరు “వారు ముగ్గురు, నాలుగోది వారి కుక్క” అన్నారు. మరికొందరు “వారు అయిదుగురు, ఆరవది వారి కుక్క” అన్నారు. ఇంకా కొందరు “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అన్నారు. ఇవన్నీ వారి ఊహాగానాలు, వ్యర్థ ప్రేలాపనలు మాత్రమే. “వారెంతమందో నా ప్రభువుకే బాగా తెలుసు” అని చెప్పు వారి కచ్చితమైన సంఖ్యను గురించి చాలా తక్కువమందికే తెలుసు. కనుక నీవు ముక్తసరిగా సమాధానం ఇవ్వడం తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. దాన్ని గురించి ఇతరుల్ని అడగటానిక్కూడా ప్రయత్నించకు. సూరా 18:9-12, 17-20, 22 (అబుల్‌ ఇర్ఫాన్‌ అనువాదం, ఖుర్‌ఆన్‌ భావామృతం)

పైనున్న వచనముల వెలుగులో చూసినట్లయితే, ఇస్లామీయ దృష్టికోణములో యేసు క్రీస్తు ప్రభువు రెండవసారి చనిపోయి తిరిగిలేచుట చాలా యుక్తమైనదిగానే కనబడుతుంది.

4.

ఆఖరి దృక్పథము ఏమనగా, యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడినారే కాని చనిపోలేదు. ఆయన మూర్ఛబోయారు, మూడవదినమున తన శిష్యులు కొంతమంది, అనగా అరిమతయియ యోసేపు మరియు నికోదేము వలన తెప్పరిల్లి బ్రదికినాడు. అక్కడనుండి ఆయన భారతదేశమునకు వచ్చి మంచి వృద్ధాప్యమందు చనిపోయాడు.

ఈ దృక్పథమును అంటిపెట్టుకొని ఉండే ముస్లింలు అహ్మదీయులు మరియు నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం (N.O.I.) వారు. అయితే, సున్నీ ఛాందస భావాలున్న ముస్లింలు ఈ శాఖలను మతవిరోధమైనవిగా భావిస్తారు.

ఆశ్చర్యమేమంటే, ప్రఖ్యాతిగాంచిన మూర్ఛ సిద్ధాంత (స్వూన్‌ థీరీ) ప్రతిపాదకుడు అటు అహ్మదీయుడు కాదు, ఇటు ఎన్.ఓ.ఐ. సభ్యుడు కూడా కాదు. పైపెచ్చు ఇతడు దక్షిణ ఆఫ్రికా వాసి, ముస్లిం హేతువాదియైన అహ్మద్‌ దీదాత్‌, మరియు ఇతను ఇస్లాంను సంరక్షిస్తున్నవానిగా పరిగణించబడినవాడు.

దీదాత్‌ తన వాదనలలోను వ్రాతలలోను, యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణించలేదు కాని కేవలము మూర్ఛబోయారు అని రుజువుచేయటానికి ప్రయత్నిస్తుంటాడు. యేసు క్రీస్తు ప్రభువు మరణము నుండి తిరిగి లేవలేదు. తాను సిలువలో చనిపోలేదు అని రుజువుచేస్తూ,  యేసు క్రీస్తు ప్రభువు కేవలము తెప్పరిల్లి, సజీవముగా తన శిష్యులకు కనబరచుకొన్నాడు అని చెబుతుంటాడు. ( (Deedat, Crucifixion or Cruci-Fiction, I.P.C.I, 4th Floor, 124 Queen Street, Durban 4001, RSA, or P.O. BOX 2439 Durban 4000, RSA)

ఈ సిద్ధాంతం కూడా పనిచేయదు ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడను లేదు, చంపబడను లేదు అని ఖుర్‌’ఆన్‌ చెప్పుచున్న సాక్ష్యమును ఇది వ్యతిరేకిస్తున్నది. మరియు యేసు క్రీస్తు ప్రభువు చనిపోలేదు అని ముహమ్మద్‌ చెప్పిన మాటలను కూడా ఇది వ్యతిరేకిస్తున్నది.

కావున, మనము ఏ కోణమునుండి చూచినా ఖుర్‌’ఆన్‌ మనకు సమస్యలనే చూపిస్తుంది. ఈ విధమైన సమస్యలు ఎదురైనప్పుడు సరియైన జవాబుకొరకు మనము చూడవలసినది పరిశుద్ధ గ్రంథమునే. ఖుర్‌’ఆన్‌ కూడా ముస్లింలకు ఖండితముగా ఆజ్ఞాపించేది అదే:

(ఓ ముహమ్మద్‌!) ఒకవేళ నీ వైపునకు అవతరింపజేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహం ఉంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువుతున్న వారిని అడుగు! వాస్తవంగా, నీ ప్రభువు తరఫునుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించే వారిలో చేరకు.” సూరా 10:94 (అబ్దుర్‌-రహీమ్‌ బిన్‌ ముహమ్మద్‌ మౌలానా అనువాదం, దివ్య ఖుర్‌ఆన్‌ సందేశం)

ఓ ప్రవక్తా నీకు పూర్వం కూడా మేము పురుషులనే ప్రవక్తలుగా పంపాము వారికి మేము దైవవాణిని అందజేశాము ఇది మీకు తెలియకుంటే గ్రంథ ప్రజలను అడిగి తెలుసుకోండి.” సూరా 21:7 (ఇఖ్బాల్‌ అహ్మద్‌ అనువాదం, సులభశైలిలో దివ్యఖుర్‌ఆన్‌)

యేసు క్రీస్తు సిలువ మరణము చరిత్రలో అంగీకరింపబడిన ఉన్నతమైన సత్యాలలో ఒకటి మాత్రమే కాదు, యథార్థవిషయములో సందేహమునకు తావు లేకుండా పరిశుద్ధ లేఖనములలో స్పష్టముగా బోధింపబడినది కూడా.

యేసు క్రీస్తు ప్రభువు మరియు ఆయనను వెంబడించిన ఆయన సమకాలీకులు ఆయన సిలువ మరణమును మరియు  ఆయన పునరుత్థానమును గూర్చిన వాస్తవమును రూఢిగా ప్రకటించియున్నారు. దిగువనీయబడిన వచనములను గమనించండి:

వారు గలిలయలో సంచరించుచుండగా యేసు – మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవు చున్నాడు, వారాయనను  చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. “మత్తయి సువార్త 17:22-23

నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. “యోహాను సువార్త 10:17-18

పాపులు నిత్యశిక్షనుండి తప్పించబడుటకు వారి పక్షముగా తాను చనిపోవుచున్నట్లు కూడా యేసు క్రీస్తు ప్రభువు తెలియజేసారు:

మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి – దీనిలోనిది  మీరందరు  త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” మత్తయి సువార్త 26:27-28

మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” మార్కు సువార్త 10:45

పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” యోహాను సువార్త 6:51

తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.” యోహాను సువార్త 10:15

యేసు క్రీస్తు ప్రభువు చనిపోయి అలానే ఉండలేదు తిరిగి లేచాడు అని ఈ దిగువనీయబడిన వచనాలు తెలియజేస్తున్నాయి:

అందుకతడు (దేవదూత) – కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను.” మార్కు సువార్త 16:6-7

వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి – మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన – మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను  చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన – ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను… – క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.” లూకా సువార్త 24:36-43, 46-48

ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.” అపొస్తలుల కార్యములు 1:1-3

క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.” అపొస్తలుల కార్యములు 2:30-31

మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.” అపొస్తలుల కార్యములు 3:14-15

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;” 1కొరింథీయులకు 15:3-8

సుమారుగా 500 మంది సాక్ష్యులు ఉన్నారని పౌలు ఇచ్చిన దృఢమైన ఆధారము ఇది. యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడటము, మరణము మరియు పునరుత్థానములను ఒక శ్రేష్ఠమైన ప్రామాణిక సత్యముగా  ఈ సాక్ష్యము తీర్చినది. అంతటి గొప్ప ఆధారమే యేసు క్రీస్తు ప్రభువు మరణము నుండి తిరిగిలేచాడు నిత్యమహిమలో తాను పరిపాలిస్తున్నాడు అనిన సత్యమును హత్తుకోవటానికి మరియు దానికోసం ప్రాణాలను పెట్టడానికి సహితము వేవేల ప్రజలను తరతరాలుగా నడుపుతున్నది.

క్రైస్తవులు మరియు ముస్లింలు కూడా అంగీకరించే ఒక సత్యముతో మేము ముగించనిష్టపడుచున్నాము: అది ఏమనగా, యేసు క్రీస్తు ప్రభువు మరలా వస్తున్నాడు అనునదియే. అయినప్పటికి, యేసు క్రీస్తు ప్రభువు ఒక ముస్లింగా తిరిగి వస్తున్నాడని మాత్రం క్రైస్తవులు నమ్మరు, కాని ప్రజలందరికి న్యాయాధిపతిగాను రక్షకునిగాను వస్తున్నాడు అని నమ్ముతారు.

ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.” హెబ్రీయులకు 9:28

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.” ప్రకటన గ్రంథము 1:18

ఆమేన్‌. ప్రభువైన యేసూ రమ్ము.

 

(ఆంగ్ల మూలంThe Crucifixion of Christ – A Christian Critique of the Quran; by Sam Shamoun)

Leave a Reply