ఇస్లామీయ గ్రంథాల (సీరా, హదీత్‌ మరియు ఖుర్‌ఆన్‌) నుండి దిగువనీయబడిన మాటలు దయచేసి గమనించండి.

ఇబ్న్‌ఇస్‍హాక్ వ్రాసిన “సీరత్‌ రసూలల్లాహ్‌,” ది లైఫ్‌ఆఫ్‌ముహమ్మద్‌, ఆల్ఫ్రెడ్‌ గియోం అనువాదం, 106వ పేజి

(ముహమ్మద్‌ ఇలా అన్నాడు) “ఇదిగో, (పరవశుడైన) ఒక కవికంటే లేక దయ్యపు స్వాధీనములో ఉన్నవానికంటే హేయమైనది దేవుడు సృజించిన జీవులలో నాకు మరొకటి లేదు: నేను కనీసము అలాంటి వారివైపు చూడనైనా చూడలేను. నేనిలా అనుకొన్నాను – అయ్యో, దయ్యము పట్టినవానిగానో లేక కవిగానో ఉన్న నాకు శ్రమ – ఖురైష్ ప్రజలు ఎన్నడూ నా గురించి ఇలా అనకుందురుగాక! అందుకే, నేను పర్వత శిఖరము మీదకు వెళ్లి అక్కడినుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకొని విశ్రాంతినొందుతాను.”

తబరి చరిత్ర అనువాదము [1150], అనువాదకులు – డబ్ల్యూ. మోంట్‌గోమెరి వాట్ట్‌, సంపుటి 6, 71వ పేజి.
(ముహమ్మద్‌ ఇలా అన్నాడు) “ఒక కవికంటే లేక పిచ్చివానికంటే ఎక్కువ హేయమైనవారు దేవుని సృష్టిలో ఎవ్వరూ నాకు లేరు; వారిద్దరిలో ఎవరి వైపుకూడా నేను చూడనైనా చూడలేను. నాకు నేను ఇలా చెప్పుకున్నాను, “నీ దీనసేవకుడు (అనగా తానే) కవైనా అయ్యుంటాడు, లేక పిచ్చివాడైనా అయ్యుంటాడు, కానీ ఖురైష్ ప్రజలు నా గురించి ఇలా ఎన్నడూ అనకుందురుగాక! అందుకై, ఎత్తైన పర్వతశిఖరము పైకి ఎక్కిపోయి, అక్కడ నుంచి క్రిందికి దూకి చచ్చిపోయి విశ్రాంతినొందుతాను.” “

తబరి చరిత్ర [1147], అనువాదకులు – డబ్ల్యూ. మోంట్‌గోమెరి వాట్ట్‌, సంపుటి 6, 68వ పేజి.
“అతడు (ముహమ్మద్‌) ఇలా అన్నాడు: పర్వతశిఖరము మీదనుండి దూకెయ్యాలని అనుకునాను, కాని అతడు నాకు కనిపించి, “ముహమ్మద్‌, నేను జిబ్రీలును, నీవు దేవుని సందేశహరుడివి” అని చెప్పాడు.”

తబరి చరిత్ర [1148], అనువాదకులు – డబ్ల్యూ. మోంట్‌గోమెరి వాట్ట్‌, సంపుటి 6, 69-70 పేజిలు.
“అతడు (ముహమ్మద్‌) ఇలా అన్నాడు: పర్వతశిఖరము మీదనుండి దూకెయ్యాలని అనుకునాను, కాని అతడు నాకు కనిపించి, “ముహమ్మద్‌, నేను జిబ్రీలును, నీవు దేవుని సందేశహరుడివి” అని చెప్పాడు. “ఓ ముహమ్మద్‌, వల్లెవేయి!” అని అన్నాడు, “నేనేమి వల్లెవేయాలి? (అన్నాను).” అప్పుడతడు ఇలా అన్నాడు: సృష్టించే నీ దేవుని నామములో వల్లెవేయి! అతడు నిన్ను రక్తపు గడ్డనుండి సృజించాడు. ఇంకా ఇలా వల్లెవేయి : మరియు నీ ప్రభువు దాతృత్వముగలవాడు, ఆయన మానవునికి తెలియనిదానిని పెన్నుతో/కలముతో బోధించువాడు. అప్పడు అతడు (ముహమ్మద్) ఖదీజా యొద్దకు వెళ్లి, “ఖదీజా, నాకు పిచ్చెక్కిందనకుంటున్నాను” అన్నాడు. ఆమె – “దేవుని తోడు, అది నిజంకాదు, నీ ప్రభువు నీకు అలా ఎన్నడూ చేయడు” అన్నది.”

తబరి చరిత్ర [1151], అనువాదకులు – డబ్ల్యూ. మోంట్‌గోమెరి వాట్ట్‌, సంపుటి 6, 72వ పేజి.
“చివరకు జిబ్రీలు నన్ను విడిచిపెట్టగా నేను నా యింటికి తిరిగి వెళ్లాను. నేను ఖదీజా దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె తొడపక్కన నా తొడపెట్టి కూర్చున్నాను. అప్పుడు ఆమె, ‘అబు అల్‌ఖాసిమ్‌, నీవెక్కడకు వెళ్లావు? మక్కా వరకు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిరమ్మని మనుష్యులను నీ కోసం పంపాను’ అని అన్నది. అందుకు నేను ఆమెతో, ‘నేను కవినైనా లేక పచ్చివాడినైనా అయ్యుంటాను’ అని అన్నాను. కానీ ఆమె ‘దానినుంచి దేవుడు నిన్ను కాపాడును గాక, అబు అల్‌ఖాసిమ్‌! దేవుడు నీకు అలా చేయడు’ అని అన్నది.”

తబరి చరిత్ర [1155], అనువాదకులు – డబ్ల్యూ. మోంట్‌గోమెరి వాట్ట్‌, సంపుటి 6, 76వ పేజి.
ముహమ్మద్‌ బిన్‌ అబ్ద్‌ అల్‌అ’లా ఇబ్న్‌తౌర్-మ’అమర్‌- అల్‌జుహ్రి ప్రకారం : కొంతకాలము దేవుని సందేశహరునికి దైవావేశం రావటం ఆగిపోయినప్పుడు అతడు బహుగా దుఃఖించాడు. అప్పుడు పర్వతశిఖరాల మీదనుండి దూకెయ్యాలని వెళ్తూ ఉండేవాడు; కాని పర్వతం కొనమీదకు వెళ్లిన ప్రతిసారి, జిబ్రీలు ఆయనకు కనబడి, “నీవు దేవుని ప్రవక్తవు” అని చెప్పేవాడు. అప్పుడు తనకున్న వ్యాకులత సద్దుమణిగి మామూలు స్థితికి వచ్చేవాడు.”

అల్‌బుఖారీ, సంపుటి 7, 660వ పేజి
ఆయిష ఇలా వివరించింది: అల్లాహ్‌యొక్క అపొస్తలుడిపై చేతబడి జరిగినందుచేత, తన భార్యలతో శృంగారంలో (రతిలో) పాల్గొనకుండానే వాళ్లతో శృంగారంలో (రతిలో) పాల్గొన్నానని అనుకునేవాడు…”

అల్‌బుఖారీ, సంపుటి 7, 658వ పేజి
ఆయిష ఇలా విన్నవించింది: (యూదులకు చెందిన) బనీ జరైక్ తెగవాడైన లబీద్‌ బిన్‌ అల్‌అ’సామ్‌ అనేవాడు అల్లాహ్‌యొక్క అపొస్తలుడు తాను చేయనిది (శృంగారం) చేశాననుకొని భ్రమపడేవరకు ఆయనపై చేతబడి చేశాడు. ఒక పగలో లేక రాత్ర్రో ఆయన మాతో ఉండినప్పుడు, ఆయన అల్లాహ్‌ను వేడుకొంటూ ఉండి, చాలాసేపు అలా వేడుకొన్న తరువాత చివరకు ఇలా అన్నాడు: ‘ఓ ఆయిషా! నేను అల్లాహ్‌ను అడిగిన విషయం గురించి ఆయన నాకు ఉత్తరమిచ్చాడని నీకు తెలుసా? ఇద్దరు మనుష్యులు నా దగ్గరకు వచ్చారు. వారిలో ఒకడు నా తలదగ్గర కూర్చునియుండగా మరొకడు ఇలా అన్నాడు- ‘ఇతడు చేతబడి ప్రభావము క్రింద ఉన్నాడు.’ అందుకు మొదటివాడు – ‘ఇతని మీద చేతబడి చేసినది ఎవరు?’ అని అడుగగా, అవతలివాడు,’లబీద్‌ బిన్‌ అల్‌అ’సామ్‌’ అని అన్నాడు…”

తబరి చరిత్ర [1192-1193], సంపుటి 6, 108-110పేజీలు
“ఇబ్న్‌ హుమైద్- సలమహ్‌- ముహమ్మద్‌ బిన్‌ ఇస్‍హాక్- యజీద్ బిన్‌ జియాద్‌ అల్‌మదని – ముహమ్మద్‌ బిన్‌ క’అబ్‌ అల్‌ఖురజీ (తెలియజేసినది): తన తెగవారు తనను తృణీకరించి, వారికోసము తాను తెచ్చిన సందేశమును వారు విడచిపెట్టుట చూచిన దేవుని సందేశహరుడు దుఃఖపడ్డాడు. ఏదైనా దేవుని వద్దనుండి తనకు కలిగి, తన తెగవారికి తనతో సంధి చేకూర్చాలని తన మనస్సులో కోరుకున్నాడు. తన తెగవారికోసమైన ప్రేమ, వారి శ్రేయస్సుపైనున్న వాంఛ వలన, వారు తనను పెడుతున్న కష్టాలలో కొన్ని తనకు దూరమైతే బాగుంటుందని అనుకున్నాడు. అలా తప్పక జరగాలని కోరుకుంటూ తనలోతాను ఆలోచించుకుంటూ ఉండేవాడు. అప్పుడు దేవుడు ఇలా బయలుపరిచాడు:

అస్తమించు నక్షత్రము తోడు, మీ సహచరుడు తప్పుచేయలేదు, మోసపోలేదు; (తన సొంత) కోరికలను అనుసరించి మాట్లాడలేదు…

తర్వాత తాను ఈ క్రింది మాటలు పలుకవలసి వచ్చినప్పుడు :

అల్‌లత్‌, అల్‌ఉజ్జా మరియు ఆ తర్వాతది, మూడవదైన మనత్ గురించి ఆలోచించావా?

తాను తన ప్రజలకు మేలు చేకూర్చాలని తన అంతరంగమందు కలిగియున్న కోరికవలన సాతాను ఈ క్రింది మాటలు అతని నాలుక మీద వేసింది:

ఇవి పైపైకి ఎగిరే కొంగలు; నిశ్చయముగా వాటి మధ్యవర్తిత్వం ఆమోదంతో అంగీకరించబడుతుంది.

ఎప్పుడైతే ఖురైష్ ప్రజలు ఈ మాటలు విన్నారో, వారి దేవతలను గురించి ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి వారు సంతోషించి, ఆనందించి, ఉత్సాహపడ్డారు; అదే సమయంలో ముస్లింలు తమ ప్రవక్త దేవుని దగ్గరనుంచి తమకై తెచ్చిన సందేశముపై పూర్తి నమ్మకముంచి, నీవు పొరపడ్డావనిగాని, మాయచేయబడ్డావనిగాని, తప్పుచేశావనిగాని చెప్పి ఎదురుతిరుగలేదు. సూరా ముగించి తాను సాష్టాంగము చేసినప్పుడు ఆయనను అనుకరిస్తూ ఆయన చెప్పిన సందేశముపైనున్న నమ్మకముతో ముస్లింలు కూడా అలాగే చేశారు… ఖురైష్‍తెగవారు కూడా ‘ముహమ్మద్‌ మన దేవతలనుగూర్చి – అవి పైపైకి ఎగిరే కొంగలు, వాటి విజ్ఙాపన ఆమోదంతో అంగీకరించబడుతుందని సాధ్యమైనంత అనుకూల విధానములో ప్రస్తావించాడు’ అని చెప్పుకుంటూ ఆనందముతో వెళ్లిపోయారు… అప్పుడు జిబ్రీలు దేవుని సందేశహరునియొద్దకు వచ్చి, ‘ముహమ్మద్‌, నీవు చేసినది ఏమిటి? దేవుని యొద్దనుంచి నేను నీకు తీసుకొనిరాని దానిని నీవు ప్రజలకు వల్లెవేశావు, మరియు నీకు చెప్పని దానిని నీవు చెప్పావు’ అని అడిగాడు. అప్పుడు దేవుని సందేశహరుడు బహుగా దుఃఖపడి, దేవునికి బహుగా భయపడ్డాడు. అప్పుడు దేవుడు అతనిపై కనికరపడి, అతనిని ఓదార్చుచూ, జరిగిన విషయాన్ని అతనికి తేలికపరుస్తూ, గతంలో కూడా ముహమ్మద్‍కంటే ముందు జీవించిన ప్రవక్తల విషయంలో కూడా, వారు ఎలా జరగాలని కోరుకొన్నా లేక ఆశించినా సాతాను మాత్రం ముహమ్మద్‌ నాలుకపైన వాని సొంత మాటలను వేసినట్టుగానే అందరి సందేశాలలోకూడా తన సొంత మాటలను తప్పకుండా వేశాడని అతనికి తెలియజేశాడు. అప్పుడు సాతాను వేసిన వాటిని దేవుడు కొట్టివేసి, ఆయన మాటలను స్థాపించి, తాను కూడా ఇతర ప్రవక్తలవంటివాడేనని ముహమ్మద్‍కి చెప్తూ ఈ ప్రత్యక్షతను పంపించాడు :

నీకు ముందు ఏ సందేశహరుడినైనాగాని ప్రవక్తనైనాగాని మేము పంపినప్పుడు, అతను వల్లెవేసే ఆ సందేశమునులోనికి సాతాను తనసొంత మాటలను (ఉమ్నియ్యహ్‌) వేయకుండా ఉండటమనేది ఎన్నడూ జరుగలేదు. సాతాను వేసిన వాటిని దేవుడు రద్దుచేస్తాడు. పిదప దేవుడు తన ఆయతులను స్థిరపరుస్తాడు. దేవుడు అన్నీ తెలిసికొనేవాడు, జ్ఙానముగలిగినవాడు.

ఆవిధముగా దేవుడు తన సందేశహరుని ఆవేదనను తీసివేసి, అతను భయపడిన విషయములోఅతనిని ధైర్యపరచి, అతని నాలుకపై సాతాను వేసిన మాటలను కొట్టివేశాడు… దేవుని సందేశహరుని నాలుకపైన సాతాను వేసిన ఆ రెండు వాక్యాలు ప్రతి బహుదైవారాధకుని నోట ఉండేవి…”

ఖుర్‌ఆన్‌లోని ఈ దిగువ వచనాల వెలుగులో పైన ఇవ్వబడినవి అధికమైన ఆసక్తిని రేపేవిగా ఉన్నాయి

“(ఇబ్లిస్‌ ఇలా) అన్నాడు – ‘ఓ నా ప్రభువా! నీవు నన్ను తప్పుచేయించావు కాబట్టి, వారికి కూడా భూమిపైన నేను తప్పును మంచిగా కనబడునట్లు చేసి, వారినందరిని తప్పు మార్గంలో పెడతాను. అయితే వారిలో (నీ కృపవలన యథార్థముగాను, పవిత్రముగాను ఉన్న) నీ సేవకులను మినహాయించుతాను. (దేవుడు) ఇలా అన్నాడు: (చిత్తశుద్ధిగల నా సేవకులు అవలంబించే) ఈ మార్గమే నిశ్చయముగా నాయొద్దకు నడుపు ఋజుమార్గము. తప్పుమార్గములో ఉండి నిన్ను వెంబడించువారిమీద తప్ప నా సేవకులపైన నీకు ఎట్టి అధికారములేదు. మరియు నిశ్చయముగా, వారికందరికి వాగ్దానము చేయబడిన నివాసస్థలము నరకమే! దానికి ఏడు ద్వారాలు ఉన్నాయి: ఒక్కొక్క ద్వారము ఒక్కొక్క (ప్రత్యేక) రకమైన పాపులకు నిర్ణయించబడింది.’ ” సూరా 15:39-43

పైన మనం చదివిన ఇస్లామీయ సాంప్రదాయముల ప్రకారము ముహమ్మద్‌ సాతాను చేత మోసపోయాడు మరియు మాంత్రికునిచేత చేతబడి చేయబడ్డాడు. ఈ విధముగా అతనిపై సాతానుకూడా కొంతవరకు తన అధికారమును చలాయించాడు. ఐతే గమనించండి – సూరా 15:42-43 లో సాతానుకు అల్లాహ్‌ సేవకులపైన ఏ అధికారములేదని చెప్పబడింది కదా! కావున, కేవలము మార్గభ్రష్టులైనవారిపైన మరియు సాతానును వెంబడించువారిపైననే సాతానుకు అధికారము ఉంటుంది; మరియు ఆ సాతానును వెంబడించేవారందరు నరకములో వేయబడతారు. కాబట్టి ఖురాన్ ప్రకారముగానే ఇప్పుడు ముహమ్మద్‌ ఎవరిని వెంబడించినట్టు? ఈ రోజున ఎక్కడున్నట్టు? ఇప్పుడు ముహమ్మద్‌ ఏ గతిపాలైనట్టు? తార్కికముగా లేక హేతుబద్దంగా ఆలోచించిన వారెవరైనాసరే ఈ ప్రశ్నలకు ఇట్టే జవాబు చెప్పొచ్చు.

మరి ఇప్పటికి కూడా నీవు ముహమ్మద్‌‍నే వెంబడించాలనుకుంటున్నావా?

(ఆంగ్ల మూలం Muhammad, Satan, and Muhammad’s Prophetic Call, By Cornelius)

Leave a Reply