ప్రశ్న:
యేసుక్రీస్తు దేవుడని ఆయన చేసిన అద్భుతములు రుజువుచేస్తున్నాయి అని కొందరు క్రైస్తవులు నమ్ముతారు. దీనితో ఉన్న సమస్య ఏమంటే, దరీదాపుగా యేసుక్రీస్తు చేసిన ప్రతీ అద్భుతమునకు సమానమైన అద్భుతము పాతనిబంధనలో కనబడుతుంది. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల వంటివే పాతనిబంధనలోని చాలా మంది ప్రవక్తలు కూడా చేసారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆయనను దేవునిగా చేస్తే, ఇతర ప్రవక్తలు చేసిన అద్భుతాలు వారిని దేవుడు/దేవుళ్ళు గా ఎందుకు రుజువుపర్చవు?

జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు చెప్పటకు ముందు, ముస్లింలు తరచుగా పాత నిబంధనలోనుండి ఎత్తి చూపిస్తున్న కొన్ని ఉదాహరణలు మొదటగా ఇవ్వాలని ఇష్టపడుచున్నాం. వాస్తవానికి, ఒక ముస్లిం తన వెబ్సైటులో వ్రాసిన (*) ఉదాహరణలనే ఇక్కడ ఉటంకించుచున్నాము:

చనిపోయిన వారిని తిరిగి లేపుట:

యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొని – యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి – ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా” (1రాజులు 17:20-23)

“తల్లి ఆ మాట విని – యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను. గేహజీ వారికంటె ముందుగా పోయు ఆదండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి – బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడియుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి, యెహోవాకు ప్రార్థన చేసి మంచముమీద ఎక్కిబిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆబిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి యింటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడతడు గేహజీని పిలిచి – ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు – నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను.” (2రాజులు 4:30-36)

యేసు భౌతికకాయం చనిపోయిన వారిని ఎవ్వరిని తిరిగి లేపలేదు, కాని ఎలీషా భౌతికకాయం లేపింది:

“తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చి నప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సంమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.” (2రాజులు 13:20-22)

ప్రాణిని సృష్టించుట:

యేసుక్రీస్తు మృతులను మాత్రమే లేపాడు, కానీ ఎన్నడూ కూడా ఒక క్రొత్త ప్రాణిని సృష్టించలేదు. అయినప్పటికిని, మోషే ఒక కఱ్ఱ నుండి జీవము గలిగిన పామును చేసాడు:

“యెహోవా – నీచేతిలోనిది ఏమిటని అతని నడిగెను. అందుకతడు – కఱ్ఱ అనెను. అప్పుడాయన – నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా – నీ చెయ్యి చాపి దాని తోకపట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.” (నిర్గమకాండము 4:2-4)

గ్రుడ్డివారిని బాగుచేయుట:

“దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు – అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు – భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి – యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా – ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా – ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు – యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి. అంతట ఇశ్రాయేలురాజు వారిని పారజూచి – నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా, అతడు – నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను.(2రాజులు 6:15-24) 

కుష్ఠువానిని శుద్ధిచేయుట:

“ఎలీషా – నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను – అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్ఠమైనవికావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి – నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను(2రాజులు 5:10-14)

కొన్ని రొట్టెలను వందలమందికి ఆహారముగా పెట్టుట:

“మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితొ చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోదుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు – నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు – వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. (2రాజులు 4:42-44)

యేసుక్రీస్తు ప్రభువు యొక్క విశిష్టతను తక్కువగా ఎంచుటకు, క్రీస్తు దేవుని అద్వితీయ దైవ కుమారుడని  క్రైస్తవులు చెప్పుచున్నది తప్పు అని రుజువు చేసేసాము అని చెప్పుకుంటూ పైనున్న ఉదాహరణలు ఆ ముస్లిం వెబ్సైటులో ఇవ్వబడినవి.

పైన చెప్పిన దానిని మనస్సులో ఉంచుకొని, వారి వాదములకు ఇప్పుడు మనము సమాధానమిద్దాం. మొదటిగా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతములు ఆయనను దేవునిగా చేయలేదు, కాని ఆయన పలికిన దివ్యమైన మాటలు ఆయనను దేవునిగా ప్రకటించాయి. ఆ మాటలను సాధికారము చేస్తూ  అద్భుతములు కనపరచబడ్డాయి. ఆయనకు ముందు ఎన్నడూ ఏ ప్రవక్త చేయని కొన్ని ప్రత్యేకమైన మాటలను యేసుక్రీస్తు ప్రభువు పలికాడు, అటుతరువాత ఆ మాటలలోని సత్యమును సాధికారతను దృఢపరుస్తూ అమానుషమైన అద్భుతకార్యములను చేసాడు:

అందుకు యేసు – మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నాతండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా యేసు – తండ్రియొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియనిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు – నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు – మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల – నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠ చేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నా యందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరల ఆయనను పట్టుకొనచూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను.” యోహాను సువార్త 10:25-39

యేసు – ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.” యోహానుసువార్త 14:9-11

ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.” యోహానుసువార్త 15:24

యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో రూపింపబడెను.” రోమా 1:5

ఆవిధముగా, అద్భుతములు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా చేయలేదు, కాని యేసుక్రీస్తు చెప్పిన ఆయన స్వంత మాటలు ఆయన దేవుడని కనీసం ఆయన నమ్మినట్లుగా నిరూపించుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలకు దైవికమైన సాధికారతను అందించు ఉద్దేశ్యతో మాత్రమే అద్భుతములు పనిచేసాయి.

ఇప్పుడు, తనకున్న ప్రత్యేకమైన దైవిక గుణలక్షణములను సామర్థ్యములను రుజువు పరచుటకు యేసుక్రీస్తు ప్రభువు చేసిన కొన్ని ప్రత్యేకమైన అద్భుతములను ఇక్కడ ఇస్తున్నాము:

యేసు క్రీస్తు ప్రభువు పాపములను క్షమించును అని రుజువు చేస్తున్న అద్భుతకార్యములు

యేసు వారి విశ్వాసము చూచి – కుమారుడా, నీపాపములు క్షమింపబడి యున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి యుండిరి. వారు – ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలోతాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని – మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో – నీ పాపములు క్శమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి – నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరి యెదుట నడిచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది – మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.” మార్కుసువార్త 2:5-12

దృష్యమైనవి మరియు అదృష్యమైనవియునైన రెంటిపైననూ యేసు క్రిస్తు ప్రభువుకు సర్వాధికారము ఉన్నదని రుజువు చేస్తున్న అద్భుతకార్యములు

జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను పట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు, ఆయనను చూడగానే ఆయనయెదుట సాగిలపడి – నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి.” మార్కుసువార్త 3:9-11

వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దొనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనె దరికి దూరముగానుండగా గాలి యెదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారియొద్దకు వచ్చెను; ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలు వేసిరి. వెంటనే యేసు – ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు – ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెనుగాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని – అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి – నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.” మత్తయిసువార్త 14:22-33

ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి – ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన – సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంతమాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.” లూకాసువార్త 10:17-20

యేసు క్రీస్తు ప్రభువు జీవింపజేయువారును జీవమునకు కర్తయునైన వారును అని రుజువు చేయుచున్న అద్భుతకార్యములు

కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి – వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు – వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరడైన అంద్రెయ – ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్నచేపలు ఉన్నవిగాని, ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక యుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను; అలాగున చేపలు కూడా వారికిష్టమైనంతమట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి – నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరలా కొండకు ఒంటరిగా వెళ్లెను… యేసు – మీరు సూచనలను చూచుటవలన కాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడని చెప్పెను. వారు – మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు – ఆయన పంపినవాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. వారు – అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు – పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను, కావున వారు – ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను – జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నా యొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చు వానిని నేనెంతమాత్రమును బయటకు త్రోసివేసివేయను. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు – ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లి దండ్రులను మనము ఎరుగుదము గదా? – నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి... విశ్వసుంచువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము ఇదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే; ఎవడైనను ఈ ఆహారము భుజించెతే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులు – ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను – మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను; ఆయన కపెర్నహూములో బోధించుచూ సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.” యోహానుసువార్త 6:5-15, 26-42, 47-59

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలో నున్న లాజరు అను ఒకడు రోగియాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని – ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను… యేసు – నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో – అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు – పునరుత్థానమును జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను అడిగెను. ఆమె – అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను… యేసు మరల తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు – రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరియైన మార్త – ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు – నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి – తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి – లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు – మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.” యోహానుసువార్త 11:1-4, 23-27, 38-44

యేసు క్రీస్తు ప్రభువు తండ్రితో సమానమైనవారని రుజువు చేయుచున్న అద్భుతకార్యములు

యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడి యుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి – స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా ఆ రోగి – అయ్యా, నీళ్లు కదలింప బడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు – నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు – ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థతనొందినవానితో చెప్పిరి. అందుకు వాడు – నన్ను స్వస్థపరచినవాడు – నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను… ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు – నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతిదినాచారాము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను – తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమేరుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించునుమృతులు దేవునికుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతోనిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి యేలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెనుదీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవపునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పుపునరుత్థానమునకును బయటికి వచ్చెదరు… అయితే యోహాను సాక్ష్యముకంటే నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” యోహానుసువార్త 5:2-11,16-21,25-26,28-29,36

యేసు క్రీస్తు ప్రభువు పలికిన మాటలను మరి యే ఇతర ప్రవక్త గాని లేక అపొస్తలుడు గాని ఎన్నడూ పలుకలేదు, దైవత్వమును తెలియచేయు వారి మాటలను సాధికారపరిచేవిగా ఎన్నడు వారి అద్భుతములు జరుగలేదు. దేవుడు తన శక్తితో నింపి తన చిత్తమును ఉద్దేశ్యమును తీసికొని వెళ్లటానికి ఉపయోగించుకుంటున్న బలహీనమైన మానవులము తప్ప మరేమియు కాదు అని చూపించటానికే ప్రవక్తలు బయలువెళ్లిరి. ఇది ప్రభువైన యేసు క్రీస్తుకు చాలా భిన్నమైనది.

రెండవదిగా, ఇతరులు అద్భుతములు చేయడానికి శక్తినిచ్చే అధికారము ప్రభువైన యేసు క్రీస్తునకు కలదు. యేసు నామములో ప్రజలు చేసిన అద్భుతాలతో క్రొత్తనిబంధనంతయు నిండియున్నది:

ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి... వారికాజ్ఞాపించెను… కాగా వారు బయలుదేరి… అనేక దయ్యములను వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.” మార్కుసువార్త 6:7,9,12,13

అంతట యోహాను – బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను. అందుకు యేసు – వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు;“మార్కుసువార్త 9:38-39

పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి – మాతట్టు చూడుమనిరి. వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. అంతట పేతురు – వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి…అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్దుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.” అపొస్తలులకార్యములు 3:1-10, 13-16

వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి – మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను – ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్భలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.” అపొస్తలులకార్యములు 4:7-12.

అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు – ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.” అపొస్తలులకార్యములు 9:33-35

మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి – ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి – నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.” అపొస్తలులకార్యములు 16:16-18

మరియొకసారి, ప్రవక్తల, అపొస్తలుల మరియు/లేక భక్తుల నామములో ప్రజలు అద్భుతములు చేసారని ఒక చిన్న దృష్ఠాంతము కూడా పరిశుద్ధ గ్రంథము అంతటిలో ఎక్కడా కనిపించదు.

మూడవదిగా, యేసు క్రీస్తు ప్రభువు చేసిన అద్భుతములు వంటివే కొన్నింటిని కొంతమంది ప్రవక్తలు చేసారన్నది వాస్తవమైనప్పటికిని, యేసు క్రీస్తు ప్రభువు చేసిన అద్భుతములన్నిటిని ఏ ప్రవక్తయు చేయలేదు. లేదా యేసుక్రీస్తు చేసినన్ని అద్భుతములు యే ప్రవక్తయు చేయలేదు.

చివరిగా, ప్రభువైన యేసు క్రీస్తు మరియు దేవుని నిజ ప్రవక్తలైన ఇతరులు చేసిన అద్భుతములలో యే ఒక్కదానినికూడా దేవుని నిజప్రవక్తను అని చెప్పుకున్న ముహమ్మద్‌ చేయలేకపోయాడు. ప్రవక్తలు చేసిన అనేక అద్భుతాలను ఖురాన్‌ గ్రంథం గ్రంథస్తం చేసింది, కాని ముహమ్మద్‌ చేసినట్లుగా ఒక్క అద్భుతమును కూడా గ్రంథస్తం చేయలేకపోయింది. వాస్తవానికి, ముహమ్మద్‌ ఏదైనా సూచనగాని, ఆశ్చర్యకార్యము గాని చేయడాన్ని ఖురాన్‌లోని అనేక భాగాలు సుస్పష్టముగా తృణీకరిస్తున్నాయి. ఇక్కడ రెండు వచనాలను ఇస్తున్నాము:

మరల వారి వద్దకు మావద్దనుండి సత్యము రాగా “మూసాకు నొసంగబడినట్లు (సూచనలు) ఈయనకు నెందులకు నొసంగబడలేదు” అని వారు పలుక సాగిరి. వారు దీనికి పూర్వము మూసాకు నొసంగబడిన వాటిని (సూచనలను) వారు తిరస్కరించలేదా? “ఒక దానికొకటి సరిపోవునట్టి రెండు రకముల మంత్ర విధ్యలు!” అనివారు అన్నారు. మేమైతే (అట్టివాటిని) తృణీకరిస్తున్నాము అన్నారు.” సూరా అల్‌ ఖసస్‌ 28:48

అసలు ఇచి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు. మా ఆయతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. వారు ఇలా అంటారు, “ఇతని ప్రభువు తరఫునుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు?” ఇలా అను, “సూచనలు అల్లాహ్‌వద్ద ఉన్నాయి. నేను కేవలం స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.” మేము నీపై అవతరింపజేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది – ఇది (ఈ సూచన) వారి కొరకు సరిపోదా? వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది. విశ్వాసులకు హితబోధ ఉన్నది.” సూరా అల్‌ అన్‌ కబూత్‌ 29:49-51

ఖురానే చాలినంత సూచన అని ఈ చివరి వచనం చాలా స్పష్టముగా చెప్పుతుంది, దాని అర్థం ఏమంటే, ఇతరమైన సూచన గాని అద్భుతము గాని ఇక అవసరములేదు అని. ఆ విధముగా, ఒకవేళ ముహమ్మద్ గనుక అద్భుతములు చేసాడు అనంటే ఖురాన్‌ సంపూర్ణముకాదు అనే భావనలో ఇది పెద్ద సమస్యనే లేవనెత్తుతుంది, దానిమూలముగా ఖురాన్‌ యొక్క వాఙ్మూలములు (మాటలు) అబద్దముగా చేయబడతాయి.

హదీసు గ్రంథాలు ముహమ్మద్‌‌కు అద్భుతాలను ఆరోపించాయనేది వాస్తవం, కాని ఆ ఆధారాలు అన్నియు కూడా ఒక వంద సంవత్సరాల తరువాతి కాలంలో కూర్పుచేయబడినవే. ప్రత్యక్ష సాక్ష్యులు ద్వారా అవి వ్రాయబడలేదు కాని, అతియుత్సాహం కలిగిన కొంతమంది ముస్లింలు అద్భుతములు చేసిన ఇతర ప్రవక్తలు మరియు ప్రభువైన యేసు క్రీస్తు కంటే ముహమ్మద్‌ను ఎక్కువగా చేసి చూపించాలని వ్రాసినవి.

మరోప్రక్క, ముహమ్మద్‌ అద్భుతములు చేయలేదు అని ఖురాన్‌ చెప్పుచున్న స్పష్టమైన సాక్షానికి విరుద్ధంగా ఈ కథలు ఉంటున్నాయి. ఈ అద్భుతాల కథలు ఎందుకు కల్పితములైనవో తెలియజేస్తూ, క్రైస్తవ తత్వవేత్తయైన నార్మన్‌ గైజ్లర్‌ మరియు అతని సహ గ్రంథకర్తయైన అబ్దుల్‌ సాలీబ్‌లు కొన్ని బలమైన కారణాలు ఇచ్చారు.

“ఈ కథల యొక్క విశ్వసనీయతను ప్రశ్నించడానికి చాలా కారణాలు ఉన్నవి. న్యాయ నిర్ణేతలు దిగువనీయబడిన వాటిని గ్రహించారు.

మొదటిది, వాటిలో ఏ ఒక్కటియు ఖురాన్‌ నందు గ్రంథస్తం చేయబడలేదు. వాస్తవానికి, తనకు సవాలు విసురుతున్న అవిశ్వాసులయిన వారి కోసము ఇటువంటి వాటిని చేయడం తరచూ తృణీకరిస్తున్న, ఖురానులోని ముహమ్మద్‌ యొక్క స్వభావానికి సాధారణంగా అవి విరుద్దమైనవి. (సూరా 3:181-184; 4:153; 6:8-9)

రెండవది, ఈ చెప్పబడుచున్న అద్భుతాలు యేసు క్రీస్తు ప్రభువు చనిపోయిన ఒకటి లేక రెండు శాతాబ్దముల తరువాత వ్రాయబడిన అప్రమాణిక అద్భుతాల విధానాలను కలిగి ఉన్నాయి. వాస్తవ సంఘటనలనుండి ప్రజలు  వేరుచేసి తీసిన అందమైన పుక్కిటి పురాణాలు అవి. సమకాలీన ప్రత్యక్ష సాక్ష్యుల కథనాల నుండి అవి రాలేదు.

మూడవది, హదీతులో చెప్పబడుచున్న అద్భుతాల చిట్టాను సాధారణంగా అంగీకరించే వారు ముస్లింలలో కూడా లేరు. నిజానికి, ఎక్కువ మంది ముస్లిం పండితులు హదీతులలోని అధిక మొత్తము సంఖ్యలోని కథలను విశ్వసనీయమైనవి కావు అని తృణీకరించివేస్తారు. ఆయా రకాల కూర్పులు ఆ యా రకాల గుంపులవారు అంగీకరిస్తారు.

నాల్గవది, ఎక్కువమంది ముస్లింలు సాధారణంగా అంగీకరించుచున్న హదీతు గ్రంథాల కూర్పులు వాస్తవ సంఘటనలు జరిగి అనేక తరాలు గతించిపోయిన తరువాత కూర్పు చేయబడినవి. వాస్తవానికి, అద్భుతాల కథలను కూర్పు చేసిన వారిలో అనేకమంది సంఘటన జరిగిన ఒకటి లేక రెండు వందల సంవత్సరాల తరువాత జీవించినవారు; పుక్కిటి పురాణాలను వృద్ధి చేయుటకు అది చాలినంత సమయము. మరియు వారు కొద్దిపాటి శృంగారభరితమైన మాటలతో తరాలుగా ఒకరినుంచి ఒకరు చెప్పుకున్న కథలపైననే ఆధారపడ్డారు. ఇస్నాద్‌ (పారంపర్యంగా కథలు చెప్పేవారు) ద్వారా నిశ్చయించబడినవని విశ్వసనీయమైనవిగా ముస్లింలచే అంగీకరించబడిన కథలలో కూడా విశ్వసనీయత లేదు. కనీసం ఈ కథలు ప్రత్యక్ష సాక్షులు పైన ఆధారపడినవి కావు కాని తరతరాలుగా కథలు చెప్పుకుంటున్న వారిపై అధారపడినవి, ఎప్పుడూ కూడా వందల సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఇస్నాద్‌ యొక్క విశ్వాస్యతను జోసెఫ్‌ హోరోవిట్జ్‌ అనునతను ఈ విధంగా ప్రశ్నించాడు:

నిస్సందేహముగా చూడాలని మనకు స్పష్టముగా చెప్పబడిన ఇస్నాద్‌ను లేక సాక్ష్యుల పరంపరను మనము చూస్తే  ఈ అద్భుతాల కథలను మొట్ట మొదట కట్టినది ఎవరు అనే ప్రశ్నకు జవాబు సుళువుగా దొరుకుతుంది. విశేషముగా ఒకే సమాచారము దానితో సరిసమానమైన వివిధ తర్జుమాలలో వేరువేరుగా కనిపించినప్పుడు అది ముఖ్యముగా దుర్యోచనయే అవుతుంది…  సాధారణంగా చెప్పాలంటే బోధకుల పుస్తకాల పాఠములలో నుండి చూచి వ్రాసినవి ఏదో మరియు నోటితో చెప్పబడినవాటిని తీసుకొని చెప్పబడినవి ఏవో నిర్ణయించటానికి ఇస్నాద్‌ పరిభాషతో సాధ్యము కాదు.

ఐదవది, అత్యంత నమ్మకముగా సంగ్రహించేవానిగా ఎంచబడిన బుకారి, తాను సంగ్రహించిన 3,00,000 హదీతులలో 1,00,000 మాత్రమే సత్యమైనవిగా పరిగణించాడు. తరువాత ఆ సంఖ్యను 7,275నకు కుంచించాడు. వాటిలో చాలా వరకు మళ్ళీ మళ్ళీ తిరిగి వ్రాసినవే, ఆ పునరావృతమైన వాటిని తీసివేస్తే మిగిలి ఉన్న మొత్తం వాస్తవానికి 3,000. అనగా దాని అర్థం వాటిలో 2,95,000 లకు పైగా తప్పులున్నాయని చివరకు ఆయన కూడా అంగీకరిస్తున్నాడు!

ఆరవది, ముస్లింలందరి చేత అంగీకరింపబడుతున్న ఈ కథలకు ఏ ఒక్క విశ్వసనీయమైన ప్రామాణీకత లేదు. అధిక ముస్లింలు వారి విశ్వసనీయతను అవరోహణ క్రమములో వరుసగా ఈ విధముగా పెట్టారు: సహీయ అల్‌ బుకారి (d.256 A.H.[after Hijrah]); అల్‌ సహియ ముస్లిం (d.261 A.H.); సునన్‌ అబు దావూద్‌ (d.275 A.H.); జామి అల్‌ తిర్మిది (d.279 A.H.); సుఅ‌న్ద్‌ [sic] అల్‌ నస (d.303 A.H.); మరియు సునన్‌ ఇబ్న్‌ మాజా (d.283 A.H.). ఈ హదీతులతో పాటు అద్భుతకార్యముల కథలు వ్రాసినవారిలో ముఖ్యులైన జీవిత చరిత్ర కారులు కూడా ఉన్నారు. వారిలో అతి ప్రాముఖ్యమైనవారు ఇబ్న్‌ సాద్‌ (d. 123 A.H.), ఇబ్న్‌ ఇషాక్‍ (d. 151 A.H.), మరియు ఇబ్న్‌ హిషామ్‌ (d. 218 A.H.). పైన చెప్పిన ఆరు వర్గములను ‘షియా ఇస్లాం’ వారు తృణీకరిస్తారు. అయినను ఇతర ముస్లింలతో పాటుగా వారును ఖురాన్‌ను ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరిస్తారు. చివరిగా, ప్రవక్త మాటను (ముద్జిజ) రూఢిపరచే అద్భుతకార్యము విషయములో ముస్లింలు అంగీకరించు తొమ్మిదిలక్షణములలో ఏ లక్షణానికి ఆ అద్భుతకార్యములు సరిపడవు అనేది ఇక్కడ గమనించవలసిన విషయము. కాబట్టి, వారి స్వంత ప్రమాణమును బట్టియే, ఇస్లాము సత్యమెంతో నిరూపించుటకు ఏవిధమైన హేతుబద్ద కారణములు వాటికి లేవు.

చివరిగా, ఇస్లాములోని అద్భుతకార్యముల పుట్టుక (మూలము) సంశయమైనది. ఇతర మతాలనుండి అనేకమైన ఆచారములు నమ్మకములు ఇస్లాము బదులు తెచ్చుకున్నదనేది అందరికి తెలిసిన సాధారణమైన విషయము. అనేక మంది పండితులు కూడా దీనిని వ్రాసారు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతకార్యములు చూపుతూ ముహమ్మద్‌ కంటే యేసుక్రీస్తునకు ఉన్న శ్రేష్ఠతను క్రైస్తవ సమర్థనావాదులు నిరూపించుచుంటే, అప్పుడు దాని ఫలితంగా ముస్లిం అద్భుతకార్యములు పుట్టుకొచ్చాయి. ఇద్దరు క్రైస్తవ బిషప్పులు (ఎదెస్సీయుడైన అబు కుర్ర మరియు కైసరియ వాడైన అరెథ) ఈ విషయమై వేలెత్తి చూపినప్పుడు ఈ ఇస్లాము అద్భుతకార్యముల కథలు పుట్టుకొచ్చాయి. సహస్‌ తెలిపినట్లుగా, ‘(బిషప్పు సవాలు యొక్క) అంతర్భావము చాలా సుస్పష్టము: ముహమ్మద్‌ యొక్క బోధ యోగ్యమైనదిగ ఎవరైనా ఎంచవచ్చు; అతనిని నిజమైన ప్రవక్త యొక్క అర్హతగలవాని చేయుటకు అద్భుతకార్యములు లేకుండా బోధ మాత్రమే సరిపోదు. ఒకవేళ ఎవరైనా అటువంటి అద్భుతకార్యములు సూచనలు చూపగలిగితేనే అతనిని ఎవ్వరైనా ప్రవక్తగా అంగీకరిచవచ్చు’

ఆ విధముగా,  ముస్లింలు చేసిన కార్యము సుస్పష్టముగా తెలుస్తుంది. ఒకవేళ వారు అద్భుతములను కల్పించగలిగితేనే క్రైస్తవుని సవాలుకు ప్రతిస్పందించగలరని తలంచారు. కావుననే వారు క్రైస్తవుని సవాలునకు స్పందిస్తూ  ఆ విధంగా అద్భుత కార్యములను క్రొత్తగా కల్పించారు. ఇది జరిగిన వెంటనే ముహమ్మద్‌ అద్భుత కార్యములను చేసినట్లు తెరమీదకు వచ్చాయి. సహస్‌ వ్రాసినట్లుగా, ‘ఆసక్తికరమైన విషయము ఏమంటే అబు కుర్ర వంటి క్రైస్తవులకు ప్రతిస్పందిస్తూ చెప్పినట్లుగా ఇవి (అద్భుతకార్యములు) ధ్వనిస్తున్నాయి, మరియు సువార్తలలో ఉన్న యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములకు సమమైన పోలిక అద్భుతముగా కనిపిస్తుంది.’ ఆ ప్రకారముగా, వారు ఈ విదంగా వాదించుకొనుచున్న సమయములోనే ఖురాన్‌లోని ఆ యా సంఘటనలను అద్భుతకార్యములుగా ముస్లింలు వివరించటం ప్రారంభించారు. ఇవన్నియును “ముహమ్మద్‍‌ అద్భుతకార్యముల కథలలో లోపించిన విశ్వసనీయత లోపించింది” అనే ఒక ముగింపును తెలియజేయుచున్నవి. (Geisler & Saleeb, Answering Islam – The crescent in the Light of the Cross [Baker Books; Grand Rapids, MI; updated and revision edition, 2002],pp. 169-170 see also pp. 171-174)

(ఆంగ్లమూలంIs Jesus God because he did mighty miracles? by Sam Shamoun)

Leave a Reply