ప్రశ్న:

యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ”నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని ఎవరికి ప్రార్థన చేయుచున్నారు? (మార్కు 15:34; మత్తయి 27:46) తాను తనకే ప్రార్థన చేసుకుంటున్నారా? అదే వాస్తవం అయితే, తనను తానే చెయ్యి విడిచిచానని తాను తనకే ఫిర్యాదు చేసుకుంటున్నారా?

జవాబు:

పరిశుద్ధ గ్రంథములో దేవుని గూర్చి, “దైవం” అనగా అవిభక్తమై ఎవరూ వేరుచేయ సాధ్యముకాని ముగ్గురు విడి విడి వ్యక్తులు, అనగా తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అని వ్రాయబడియున్నది. మరియు వీరు అవిభక్తముగా ఏకమై ఉంటూ అద్వితీయ త్రియేకదేవునిగా ఉన్నారని తెలియజేస్తుంది. దైవంలోని ముగ్గురు వ్యక్తులూ నిత్యమూ అవిభక్తమైన వారు కాబట్టి, వారి మధ్య ఒకరిపట్ల మరొకరికి ప్రేమగల అన్యోన్య సహవాసము మరియు సంభాషణ కలిగి ఉంటారు. కాబట్టి,  ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద తాను తనకే ప్రార్థన చేసికొనుటలేదు, గానీ సాక్షాత్తు తండ్రియైన వ్యక్తికి ప్రార్థన చేయుచున్నారు.

మరియు, యేసు క్రీస్తు ప్రభువు మానవునిగా వచ్చారు, నిరంతరము మానవ స్వరూపములోనే ఉంటారని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. కాబట్టి, దేవునియందు భయభక్తులు కలిగిన ఏ వ్యక్తియైనా ప్రార్థించి ఆరాధించవలసిన విధముగా క్రీస్తు కూడా చేయడము ఆశ్చర్యము కాదు. దేవుడు మనుష్యులందరిని ఏ విధంగా ఉండాలని ఉద్దేశించాడో అలాగే యేసు క్రీస్తు ప్రభువు కూడా మానవ స్వరూపములో ఉండినప్పుడు, సంపూర్ణమైన దైవ సేవకునిగా నిజదేవునికి సంపూర్ణముగా లోబడి ఉండి, తాను తండ్రిని ఆరాధించుట ద్వారా మానవులకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు.

లేఖనముల ప్రకారము, దేవుని యొక్క తీర్పు మరియు ఉగ్రతను ప్రభువైన యేసు తనపైన వేసుకొని మనకు బదులుగా చనిపోవడానికి వచ్చారు. క్రీస్తు మన పాపములను మోసినవారు కాబట్టి ఆ సందర్భములో ఆయన తండ్రికి “నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ్యి విడిచితివి” అని కేక వేశారు.

మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” అన్నాడు. (యోహాను 1:29)

పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.” (రోమా 3:25-26)

అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో  సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.” (2 కొరింథీయులకు 5:19-21)

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” (గలతీయులకు 3:10-14)

మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.‘ (1పేతురు 2:24)

ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.” (1 పేతురు 3:18)

మొదటి ప్రశ్నకు ఇచ్చిన జవాబులో మనము చూసిన విధముగా, పాప ఫలితముగా దేవునితో నున్న అన్యోన్య సహవాసము పోయి శరీరమరణము వచ్చినది. శరీరమరణము అనగా ప్రాణము లేక ఆత్మ దేహము నుండి వెడలిపోయి, దేహము ఏ నేల నుండి తీయబడినదో ఆ నేలలోనే తిరిగి కలిసిపోవుట. దేవుని యొక్క ధర్మశాస్త్రము కోరిన దానిని చేయలేకపోయారు గనుక, పాపులపైన వారి యొక్క తిరుగుబాటు మరియు దుష్టత్వము ఫలితముగా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. (ఆదికాండము 2:17, 3:19; యెషయా 59:1-2; కీర్తన 66:18; హబక్కూకు 1:13; రోమా 1:18-32 చూడండి)

యేసు ప్రభువు వేసిన కేక మరియు మధ్యాహ్నపు వేళ భూమిపైన కమ్మిన చీకటి, మన స్థానములో క్రీస్తును దేవుడు శిక్షించాడని, దేవుని యొక్క ప్రేమ గల అన్యోన్య సహవాసమును యేసు పోగొట్టుకొన్నారని మనకు తెలియచేయుచున్నవి:

మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు –  ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.” (మత్తయి 27:45-46)

From the sixth hour (noon) until the ninth hour (three o’clock) darkness came over all the land. About the ninth hour (three o’clock) Jesus cried out in a loud voice, ‘Eloi, Eloi, lama sabachthani?’ – which means, ‘My God, my God, why have you forsaken me?’” Matthew 27:45-46

ఈ వాక్య భాగమును క్రింద ఇవ్వబడిన పాత నిబంధన వాక్యములతో పోల్చి చూడండి:

అందుకు యెహోవా మోషేతో –  ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెనుమూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేకపోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.” (నిర్గమకాండము 10:21-23)

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్రశోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము (అంతము) ఘోరమైన శ్రమదినముగా ఉండును.” (ఆమోసు 8:9-10)

క్రీస్తు పాపులకు ప్రత్యామ్నాయముగా దేవుని ప్రజలకొరకు చనిపోవడానికి వచ్చారు కాబట్టి, పాపులందరు పొందవలసిన న్యాయమైన శిక్షను తాను అనుభవించారు.

నాలుగవదిగా, యేసు మన పక్షముగా తండ్రి ఎదుట తనను తాను బలిగా సమర్పించి, మనకొరకు యాచనలను చేయుచున్న విశ్వాసుల ప్రధానయాజకుడని లేఖనములు తెలియజేయుచున్నాయి.

ఇందువలన, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.” (హెబ్రీయులకు 3:1)

మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా –  నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.” (హెబ్రీయులకు 7:14-17)

ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నావాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజలపాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరముగలవాడు కాడు; తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను.” (హెబ్రీయులకు 7:24-28)

ఈ విషయమునకు సంబంధించి, యేసు ప్రభువు పగలు మూడవ గంటకు (ఉదయం తొమ్మిది గంటలకు) సిలువ వేయబడి, తనను సిలువ వేసి తన వస్త్రములు పంచుకుంటున్నవారి పక్షమున ప్రార్థన చేసిరని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది.

ఈ సమయమును (గూర్చిన తెలుగు పదజాలమును) అర్థము చేసుకొనుటకొరకు నేను ఇంగ్లీషు బైబిలునుంచి కూడా మీకు వ్రాస్తున్నాను.

యనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.” (మార్కు 15:25)

And it was the third hour, and they crucified him.” (Mark 15:25, KJV)

(ఇంగ్లీషులో third hour అని తెలుగులో పగలు తొమ్మిది గంటలు అని వ్రాయబడియున్నా అర్థము ఒకటే. ఇంగ్లీషును తెలుగులోనికి అనువదించి చెప్పాలంటే మూడవ గంటలో అని చెప్పవలసియున్నది. మూడవ గంటలో అనగా పగలు లేక ఉదయం తొమ్మిది గంటలకు అని అర్థము.)

వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడా సిలువవేసిరి. యేసు – తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.‘ (లూకా 23:33-34)

పగలు తొమ్మిదియవ గంటకు (అనగా మధ్యాహ్నం మూడు గంటలకు) క్రీస్తు తండ్రికి కేక వేశారు, ఇంతకు మించి ఇంకేం కావాలి?:

మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.” (మార్కు 15:34)

And at the ninth hour Jesus cried with a loud voice, saying, Eloi, Eloi, lama sabachthani? which is, being interpreted, My God, my God, why hast thou forsaken me?” (Mark 15:34, KJV)

(ఇంగ్లీషులో at the ninth hour అని తెలుగులో మూడు గంటలు అని వ్రాయబడియున్నా అర్థము మాత్రము ఒక్కటే. ఇంగ్లీషును తెలుగులోనికి అనువదించి చెప్పాలంటే తొమ్మిదియవ గంటలో అని చెప్పవచ్చును. తోమ్మిదియవ గంటలో అనగా మధ్యాహ్నం మూడు గంటలకు అని అర్థము.)

దేవాలయములో ఆరాధన చేయువారు గానం చేయుటకు ప్రత్యేకపరచిన కీర్తనలలో భాగమైన 22వ కీర్తనలోని ఆరంభ మాటలనే ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చట ఉపయోగించడం జరిగింది.

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?”  కీర్తనలు 22:1

యేసు క్రీస్తు ప్రభువు ఈ ప్రత్యేక కీర్తనలోని మాటలనే ఒక ప్రార్థనగా చేశారని ఇక్కడ తెలుస్తున్నది. ఆశ్చర్యమేమిటంటే, ఉదయం తొమ్మిది గంటలకు (ఆయనను శిలువ వేసిన సమయం) మరియు మధ్యాహ్నం మూడు గంటలకు (ఆయన కేక వేసిన సమయం)  దేవాలయములో సరిగ్గా ప్రార్థనలు మరియు అనుదిన బలులు అర్పించే సమయం!

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని  ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కుర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతిజనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి….. అయితే పేతురు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను – యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నామాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు (It’s only nine in the morning!)” (అపొస్తలుల కార్యములు 2:1-5,14-15; పాఠకులకు అర్థము కావాలని ఇంగ్లీషు బైబిలు మాటలను కూడా జోడించితిని)

(ఇక్కడ ప్రొద్దుపొడిచి జామయిన కాలేదు, అనగా ప్రొద్దుపొడిచి మూడు గంటలైనా కాలేదు లేక ఉదయం తొమ్మిది గంటలు కూడా కాలేదు అని అర్థం. ఒక జామునకు మూడు గంటలు.)

ప్రొద్దుపొడిచి జామయిన (ఉదయం తొమ్మిది గంటలు కూడా) కాలేదు అని పేతురు చెప్పిన మాట ఎంతటి  భావగర్భితమైనదో మనము ఇప్పుడు చూద్దాం.

పగలు (అనగా మధ్యాహ్నం) మూడు గంటలకు (three in the afternoon) ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా,” (అపొస్తలుల కార్యములు 3:1; పాఠకులకు అర్థము కావాలని ఇంగ్లీషు బైబిలు మాటలను కూడా జోడించితిని)

పగలు (అనగా మధ్యాహ్నం) ఇంచుమించు మూడు గంటలవేళ (three in the afternoon) దేవుని దూత అతనియొద్దకు వచ్చి – కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను … అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు (అనగా మధ్యాహ్నం) మూడుగంటలు (three in the afternoon) మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి…..” (అపొస్తలుల కార్యములు 10:3,30; పాఠకులకు అర్థము కావాలని ఇంగ్లీషు బైబిలు మాటలను కూడా జోడించితిని)

బైబిలు వ్యాఖ్యానకర్త, జాన్ గిల్, మత్తయి 27:46, మార్కు15:25 మరియు అపొస్తలుల కార్యములు 2:14-15 ల పైన చేసిన వ్యాఖ్యానము ఇక్కడ ఇస్తున్నాం:-

తొమ్మిదియవ గంటను గురించి (అనగా మధ్యాహ్నము మూడు గంటల గురించి)
సరిగ్గా ఇది క్రీస్తుకు దృష్టాంతముగా ఉన్న అనుదిన బలులను వధించి అర్పణలను అర్పించే సమయం; దీని గురించి యూదులు చెప్పునదేమనగా (F9),

“ప్రతిరోజు ఎనిమిదిన్నర గంటలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు)  అనుదిన బలి వధించబడి, తొమ్మిదిన్నర గంటలకు (అనగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు) అర్పింపబడుతుంది.”

క్రీస్తుకు మరో దృష్టాంతమైన పస్కా బలిపశువు కూడా అదే సమయంలో వధించబడుతుంది; “మొదట దానిని అర్పించిన తరువాతనే అనుదిన బలి అర్పించబడుతుంది” అని యూదులు చెబుతారు (F11). ఐతే మరియొక చోట (F12)  దీనిని గురించి ఇలా వ్రాయబడియున్నది:-

“(సంవత్సరములోని అన్ని సామాన్య దినములలో) అనుదినబలి పగలు ఎనిమిదిన్నర గంటలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు) వధించబడి, తొమ్మిదిన్నర గంటలకు (అనగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు) అర్పింపబడుతుంది; పస్కా పండుగ దినముల సాయంత్రపు వేళలలో మాత్రం (అది సామాన్య దినమైనా లేక సబ్బాతు దినమైనా) ఏడున్నర గంటలకు (అనగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటకు) వధించబడి, ఎనిమిదిన్నర గంటలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు) అర్పింపబడుతుంది: కానీ ఒకవేళ పస్కా(ప్రారంభమయ్యే) సాయంత్రం కూడా సబ్బాతు (ప్రారంభమయ్యే) సాయంత్రముననే ప్రారంభమైతే, ఆ దినమందు మాత్రం అది ఆరున్నర గంటలకు (అనగా మధ్యాహ్నం పండ్రెండున్నర గంటలకు) వధించబడి, ఏడున్నర గంటలకు (అనగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) అర్పింపబడుతుంది, ఆ తరువాతనే పస్కా బలి జరుగుతుంది.”…

FOOTNOTES:
F9 T. Hieros. Pesachim, fol. 31. 3, 4.
F11 lb.
F12 Misn. Pesachim, c. 5. sect. 1. (ఆధారం)

ఆయనను సిలువవేసినప్పుడు పగలు (మూడవ గంట ఆయెను) తొమ్మిది గంటలాయెను…
అనుదిన ఉదయకాలపు బలిసమయమున, యాజకులందరు కూడుకొనవలెను; మరియు అది ఆ గొప్ప సన్హెద్రు మహాసభ వారందరు సభలో కూడుకొను సమయము; (F24),

“అనుదినము ఉదయకాలపు బలిసమయము మొదలుకొని సాయంకాలపు బలిసమయము వరకు ఆ గొప్ప సన్హెద్రు మహాసభ వారు కూడుకొని యుంటారు;”

FOOTNOTES:
F24 Maimon. Hilch. Sanhedrin, c. 3, sect. 1. (ఆధారం)

…ప్రొద్దుపొడిచి జామయినా కాలేదు.

లేక ఉదయము తొమ్మిది గంటలు కూడా కాలేదు: యూదులకు ఈ సమయము వరకు దేనినైనా తినే వాడుకగాని లేక రుచించే వాడుకగాని లేదు: దాని గురించిన నిబంధనలు వారికి  ఇలా ఉన్నవి, (F8)

“ప్రొద్దుపొడిచిన తరువాత ఏ మనుష్యుడు కూడా  ఉదయ కాలపు ప్రార్థన చేసి ముగించేంత వరకు ఏమియు రుచి చూచుటయైనా లేక ఏదైనా పని చేయుటయైనా నిషేధము.”

ఇంకా,

ఉదయ కాలపు ప్రార్థనకు ఉన్న కట్టడేమనగా, సూర్యుడు ఉదయించగానే మనిషి ప్రార్థించుట ప్రారంభించాలి; దీని వ్యవధి నాలుగవ గంట చివరివరకు (అనగా ఉదయం పది గంటల వరకు), అది ఒక దినపు పగటి కాలములో మూడవ భాగమగును (F9).”

ఆ విధముగా ఆహారమునైనా లేక పానీయమునైనా నాలుగవ గంటవరకు, అనగా ఉదయం పది గంటలవరకు రుచించకూడదు: కావున దానిగూర్చి (F11) ఇలా చెప్పబడింది :-

“అనుదిన బలిని వారు అర్పించిన తరువాత, నాలుగు గంటలు సమయము అయిన తర్వాత (బజ్మన్ అర్బఅ షఅయిన్ – בזמן ארבע שעין)  (అంటే ఉదయం పది గంటలకు) రొట్టెను తింటారు.”

నాలుగవ గంటలో (అంటే ఉదయం పది గంటలకు) గానీ అంతకు ముందు గానీ, కనీసము కొంచెము కూడా తినకూడదు; ఎవరైతే తింటారో అతనితో ఎవరైనా మాట్లాడుటకు అతడు ఎంతమాత్రమూ అర్హుడు కాడు.

“రబ్బి ఐజాక్ చెప్పినదేమనగా (F12), నాలుగవ గంట కంటే ముందు ఎవరైనా పచ్చని ఆకు లేక కూర మొక్క తింటే అతనితో మాట్లాడటం నిషిద్ధము; అతను ఇంకా చెప్పినదేమనగా, నాలుగవ గంటకు ముందు పచ్చికూరమొక్కను కూడా తినకూడదు. అమేమర్, మార్ జుత్ర, మరియు రబ్ అషే కూర్చునియుండగా, నాలుగవ గంటకు (అంటే ఉదయం పది గంటలకు) ముందు వారియొద్దకు పచ్చికూర మొక్కను ఒకదాన్ని తినుటకై తీసుకువచ్చారు. అమేమర్ మరియు రబ్ అషే తిన్నారు, కానీ మార్ జుత్ర తినలేదు: నీ భావమేమి? అని వారు అతడిని అడుగగా, అతడు రబ్బి ఐజాక్ గారు ఇలా చెప్పారని బదులిచ్చాడు – ‘నాలుగవ గంట కంటే ముందు ఎవరైతే కూరమొక్కను తింటారో, వారితో మాట్లాడుట నిషిద్ధము.’”

 వేరువేరు గుణములు గలిగిన వ్యక్తులు భోజనము చేసే సమయములను గురించి వారు ఈలాగున తెలియజేశారు:

“భోజనము చేయు సమయములేవనగా :- లూదీయులకు మొదటి గంటలో, దొంగలకు రెండవ గంటలో, వారసులకు మూడవ గంటలో, కూలివారికి నాలుగవ గంటలో, ఐదవ గంటలో ప్రతి మనిషికి; అది వాస్తవం కాదా? రబ్బి పాప దానిని గూర్చి ఇలా చెప్పారు, నాలుగవది ప్రతి ఒక్కరు భోజనము చేయు సమయం; కానీ, (వాస్తవమేమనగా) నాలుగవది ప్రతి ఒక్కరూ తినే సమయం, కూలివారికి ఐదవది, మరియు జ్ఞానుల శిష్యులకు ఆరవ గంట తినే సమయం. (F13)”

కావున ఈ ఉపదేశమివ్వబడినది (F14),

” ‘నాలుగవ గంటలో’ భోజనశాలకు (సత్రముకు) పోయి మద్యము త్రాగుతున్నవాడినేగానీ, గిన్నెను తన చేతితో పట్టుకొని తూలుచున్నవానినే గానీ చూచిన యెడల అతడు తెలివైన వైద్యులలో ఒకడేమో అని అతని గురించి విచారించుము…”

దీని మీదనున్న ‘వ్యాఖ్యానము’ ఏమంటే-

“నాలుగవ గంట అందరికి తినే సమయము, అప్పుడు అందరూ భోజనశాలకు (లేక సత్రమునకు) తినడానికి వెళతారు.”

కాబట్టి ఎవరైనా త్రాగి మత్తులై యుంటే వారు రాత్రియందే త్రాగి మత్తులైయుంటారుగాని పగలు కాదు, అందులోనూ మరీ అంత ప్రొద్దుననే త్రాగరు, భక్తి గలిగిన ఒక వ్యక్తి ఆ సమయంలో కనీసం దేనినైనా రుచించుట వాడుక కాదు; అపొస్తలులు వారితోనున్న వారు స్థిరబుద్ధి గలవారును భక్తి గలవారును కాబట్టి వారి గుణమును చెరుపుదానిని వారు ఎన్నడూ చేయరు, ఇటువంటిది మరి ఏదైనా వారిలో ఉందని ఎంచటం అవివేకము.

FOOTNOTES:
F8 Maimon. Hilch, Tophilla, c. 6. sect. 4. T. Bab. Beracot, fol. 28. 2.
F9 lb. c. 3. sect. 1. Vid. T. Beracot, fol. 26. 2.
F11 Targum in Eccl. x. 17.
F12 T. Bab. Betacot, fol. 44. 2.
F13 T. Bab. Sabbat, fol. 10. 1.
F14 T. Bab. Bava Metzia, fol. 83. 2. (ఆధారం)

ఉదయసాయంత్రములయందు బలులనర్పిస్తూ ప్రార్థనలు చేసే అలవాటును ఇలా  పాటించాలని, దేవాలయమును నిలువబెట్టినప్పటి నుండి రాజైన దావీదు చేత నియమించబడినది.

వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.” 1దినవృత్తాంతములు 23:24-30

నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.” 2 దినవృత్తాంతములు 2:4

వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పర చిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.” 2 దినవృత్తాంతములు 13:11

కాబట్టి,  దేవాలయములో యూదులు ప్రార్థనలు చేసే అదే గంటలలో, అనగా సరిగ్గా బలులను అర్పించే ఆ సమయములోనే మన ప్రధానయాజకుడును, ప్రభువును అయిన యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేయటము మరియు తన ప్రాణమర్పించటము కాకతాళీయముగా జరిగిన సంభవమేమీ కాదు.


ముస్లింలకు ప్రశ్న:

అల్లాహ్ ప్రార్థన చేశాడని ఖుర్‌ఆన్ చెప్పుచున్నది, మరి అల్లాహ్ ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు?

వారిపైన అల్లాహ్ యొక్క ప్రార్థనలు (సలవతున్) మరియు కరుణ ఉంటాయి, మరియు వారే సరియైన దారిచూపబడినవారు.” సురా అల్‌ బఖర 2:157 (అరబీ నుండి తెలుగు)

మీ మీద ప్రార్థనలు అవతరింప చేయువాడు ఆయనే (యుసల్లీ అలయ్ కుం), ఆ ప్రకారమే ఆయన దూతలు కూడ...” సూరా అల్‌ అహ్‌జాబ్‌ 33:43 (అరబీ నుండి తెలుగు)

అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త కొరకు ప్రార్థించారు (యుసల్లూన ఆ’ల అన్నబియ్యి): ఓ విశ్వాసులారా అతనికొరకు ప్రార్థించండి (సల్లూ అలయ్ హి), మరియు గౌరవముతో అతనికి వందనము చేయండి.” సూరా అల్‌ అహ్‌జాబ్‌ 33:56 (అరబీ నుండి తెలుగు)

దిగువనీయబడుచున్న వచనంలో  విశ్వాసుల కొరకు ముహమ్మద్ ప్రార్థన చేసినట్లుగా, పైన చెప్పబడిన వచనాలలో అల్లాహ్ విశ్వాసుల కొరకు మరియు ముహమ్మద్ కొరకు ప్రార్థన చేశాడు:

వారి సంపదలోనుండి తిరిపెము (దానం) తీసుకో, దానితో నీవు వారిని శుద్ధిచేయవచ్చును మరియు వృద్ధిపరచవచ్చును, మరియు వారికొరకు ప్రార్థన చేయి (వ సల్లి అలయ్ హిం). ఇదిగో! నీ ప్రార్థనవల్ల (సలాత క)  వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లాహ్ వినేవాడు, అన్నీ తెలిసినవాడు.” సూరా 9:103 (అరబీ నుండి తెలుగు)

 అల్లాహ్ అక్షరాలా ప్రార్థన చేశాడని ఆ వచనాలన్నీ మనకు సుస్పష్టముగా చెప్పుచున్నవి, మరియు, చేసే ప్రార్థనను వినేవాడు ఒకడు కావాలి గనుక, మేము అడిగేది ఏమంటే అల్లాహ్ ఎవరికి ప్రార్థన చేశాడు? అల్లాహ్ ఏకైకుడు అని ముస్లింలు వాదిస్తారు, అంటే ఆయన వ్యక్తిత్వములో బహుళత్వము లేదు. కాబట్టి, అల్లాహ్ తనకు తాను ప్రార్థన చేసికొంటూ ఉండే అవకాశమే లేదు. అట్లైతే అల్లాహ్ చేసిన ఆ ప్రార్థనలన్నీ ఎవరికి చేసినట్టు? ముస్లింల వాదనల ప్రకారం పై వచనాలను విశ్లేషిస్తే ఒకవేళ అల్లాహ్ తనకు తానే ప్రార్థించుకున్నాడేమో అని ఖచ్చితముగా అనిపిస్తున్నది.

కొంతమంది ముస్లింలు ఇక్కడ ప్రార్థన అంటే అక్షరార్థముగా ప్రార్థన అని అర్థము కాదు కాని, అరబీ భాషలో  ‘సలాహ్’ అని వ్రాయబడిన పదానికి ‘ఆశీర్వాదము’ అని అర్థం చెప్తూ, అల్లాహ్ ఆశీర్వాదములు పంపుతున్నాడు అనే అర్థం తీసుకు వస్తుంటారు, అక్కడున్న పదాలను వారికి అనుకూలముగా తిరిగి నిర్వచించడానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఇస్తున్న ఈ వివరణలో ఉన్న సమస్య ఏమిటంటే, “ఆశీర్వాదము” అని చెప్పుటకు అరబీ భాషలో ‘బరక’ అనే పదము వాడబడాలి, కాని అది పైన చెప్పబడిన ఉదాహరణలలో ఎక్కడా కనిపించదు. అందుకు విరుద్ధంగా ‘సలాహ్’ అనే పదమునుండి ఉద్భవించిన సలావతున్, యుసల్లీ,  యుసల్లూన, మరియు సల్లూ అనే పదాలనే ఖురాన్లో ప్రయోగించడం జరిగింది.

“అండర్స్టాండింగ్ ఇస్లాం” అనే గ్రంథ రచయితయైన మోఇజ్ అంజాద్ అను ముస్లిం రచయిత ఈ ప్రశ్నకు జవాబుగా ‘సలాహ్’ యొక్క నిఘంటు అర్థము ఇలా ఇచ్చాడు:

ఇబ్న్ అల్-అతీర్ అనునతడు ‘అల్-నిహాయహ్ ఫీ గరీబ్ అల్-అతర్’ అను తన ప్రసిద్ధమైన అరబి భాష నిఘంటువులో “సలాహ్” అను పదమునకు అర్థమును ఈ విధముగా వివరించాడు:

అల్-సలాహ్‘ మరియు ‘అల్-సలవాత్‘: ఈ పదం ఒక విశేషమైన (ప్రత్యేకమైన) ఆరాధనకు ఉపయోగించబడుతుంది. అక్షరార్థముగా ఈ పదమునకున్న మూలార్థము విజ్ఞాపన (ప్రార్థన). కొన్నిసార్లు, దీనిలోని ఒకటి లేక అంతకంటే ఎక్కువ భాగాలను ఉపయోగిస్తూ ‘సలాహ్’ అనే ఈ పదం వాడబడుతూ ఉంటుంది. అక్షరార్థముగా ఈ పదము యొక్క మూలార్థము ‘మహిమపరచుట’ అని కూడా చెప్పబడుతుంది. మరియు విశేషమైన (ప్రత్యేకమైన) ఆరాధనను ‘సలాహ్‘ అని పిలుస్తారు, ఎందుకనగా ఇది ప్రభువుకు మహిమను కలుగజేస్తుంది. (The Meaning of the Word “Sala’h”, May 19, 2001ఆధారం)

అదే వెబ్‌సైట్‌లో, ‘సలాహ్’ అనే ఈ పదము యొక్క అక్షరార్థము ఏమిటని ప్రశ్నించబడగా రచయిత ఇలా సమాధానమిచ్చాడు:

ప్రశ్న:
“సలాహ్” అను పదమునకున్న సరైన అర్థము ఏమిటి? “ప్రార్థన” (ఇంగ్లీషులో prayer) అను పదము “సలాహ్” అను పదమునకు దగ్గరగా ఉన్న సమానార్థ పదము కాదట; నిజమేనా?
జవాబు:
సలహ్ (صلاة) యొక్క అక్షరార్థమైన అర్థము ఏమంటే ఒకని దేవునికి ఒకడు పెట్టు మొఱ్ఱ (వినయపూర్వకముగా మరియు గౌరవసహితముగా). ఇది ‘దుఆ’ (دعا) అనే పదము లాంటిదే. (దుఆ అనగా ప్రార్థన అని అర్థము)

ఆక్స్‌ఫార్డ్‌ డిక్షనరీలో మనము ‘ప్రార్థన’ (ప్రేయర్) అనే పదమునకున్న అర్థమును ఈ విధముగా చదువుతాం:

“ప్రార్థన (prayer): ఈ పదమునకున్న అర్థమేమనగా –  నిజదేవునికిగాని, మరేదైనా ఇతర దైవమునకుగాని సహాయము కొరకైన అభ్యర్థన చేయుట లేక కృతజ్ఞతలు తెలియజేయుట”.

పైన చెప్పబడిన ఈ నిర్వచనము సలాహ్ అనే పదానికి యుక్తమైన మరియు అక్షరార్థమైన అనువాదార్థము అని నా అభిప్రాయము. ఐతే ఎవరైనా – సహాయము కొరకైన అభ్యర్థన చేయడానికి లేక కృతజ్ఞతలు తెలపడానికి మరియు  దేవుని స్వరూపలక్షణాలను ఉచ్ఛరించుటకు, దేవుని మహిమ పరచుటకు, మొదలగు మరియేదైన తెలియజేయడానికి  సలాహ్ యొక్క పదబంధము విడదీయబడలేదు…సలాహ్ యొక్క అర్థములోనే ఇమిడియున్నవి అని ఎవరైనా వాదించవచ్చు. ఏది యేమైనప్పటికీ, నేను నిశ్చయముగా చెప్పేది ఏమనగా “ప్రార్థన” అనే పదము విషయములో ఇది వాస్తవము. (అబ్దుల్లాహ్‌ రహీం, ద మీనింగ్‌ ఆఫ్‌ ద వార్డ్‌ “సలాహ్‌”, మే 18, 2005; ఆధారం)

ప్రసిద్ధమైన ముస్లిం వ్యాఖ్యానకర్త, ఇబ్న్ కతీర్, ఆ పదాన్ని ఈ విధముగా నిర్వచించాడు:

సలాహ్ యొక్క అర్థము:
అరబి భాషలో, ‘సలాహ్’ యొక్క ప్రాథమికమైన అర్థము ‘విజ్ఞాపన’. మతసంబంధమైన పరిభాషలో, తలవంచుట మరియు సాష్టాంగనమస్కారము చేయుట వంటి కార్యములను సూచించుటకు, తత్సంబంధ క్రియలకు, ఆయా సమయాలలో లేక అవసరతలలో కూడా వాడబడుతుంది.

స్వయాన ముహమ్మదు యొక్క పినతండ్రి  కుమారుడు మరియు పేరుగాంచిన ముస్లిం పండితుడు, ఇబ్న్ అబ్బాస్, అల్లాహ్ ప్రార్థన చేశాడని అంగీకరించాడు:

“ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఇలా అన్నారు: ‘నీ ప్రభువు ప్రార్థన చేస్తాడా?’ అతని ప్రభువు  అతని పిలిచి :- ‘ఓ మోషే, వారు నీ ప్రభువు ప్రార్థన చేస్తాడా’? అని నిన్ను అడిగారు. (వారితో) ఇలా చెప్పు – ‘అవును, నా ప్రవక్తల కొరకు మరియు నా సందేశహరుల కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా దూతలు కూడా ప్రార్థన చేస్తారు’, అన్నాడు. ఆ వెంటనే అల్లాహ్ తన సందేశహరుని  మీదకు (ప్రార్థన మరియు సమాధానము అతనిపైనుండునుగాక) దానిని పంపాడు: ‘అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రార్థించారు…'” [ఇబ్న్ కతీర్చే సూరా అల్-అహ్జాబ్ 33:56లో ఉటంకించబడినది.] (అరబిక్‌ ఆన్‌లైన్‌ ఎడిషన్‌ నుండి తర్జుమా చేయబడినది)

హదీస్‌ 216
ఇశ్రాయేలీయులు మూసాతో ఇలా అన్నారు: నీ దేవుడు ప్రార్థన చేస్తాడా? మూసా ఇలా అన్నాడు: ఇశ్రాయేలు కుమారులారా! అల్లాహ్‌కు భయపడండి.
అల్లాహ్‌ ఇలా అన్నాడు: ఓ మూసా! నీ ప్రజలు ఏమి అంటున్నారు? మూసా అన్నాడు: ఓ నా ప్రభువా నీకు తెలుసు. వారు అన్నారు: నీ ప్రభువు ప్రార్థన చేస్తాడా?
అల్లాహ్‌ అన్నాడు: వారితో చెప్పు నా సేవకుల పట్ల నా ప్రార్థన ఏమనగా నా కోపమునకు ముందు నా కరుణ వెళ్లాలి. ఆ విధముగా కానిచో, నేను వారిని నాశనం చేసియుందును. [ఇబ్న్‌ అసాకిర్‌] (అల్‌-అహదిత్‌ అల్‌-ఖుదుస్సియాహ్‌ – ఇంగ్లిషు తర్జుమా: డాక్టర్‌ అబ్దుల్‌ ‘ఖలిఖ్‌ కాజి & డాక్టర్‌ బి. డేయ్‌, విభాగం 2: అల్‌ ఇతాఫత్‌ అల్‌-సనియ్యా బి’ల్‌-అహదిత్‌ అల్‌-ఖుదుస్సియ్యాహ్‌ – షేక్‌ జైన్‌ అల్‌-దిన్‌ అబ్దుల్‌ ర’ఉఫ్‌ బిన్‌ తాజ్‌ అల్‌-‘అరిఫిన్‌ బిన్‌ ‘అలి బిన్‌ జైన్‌ అల్‌-‘అబిదిన్‌ అల్‌-మునావి [దార్‌ అల్‌ కితాబ్‌ అరబీ – యుఎస్‌ఏ, 1995], 305-306పేజీలు)

ఇబ్న్ హిషామ్ వ్రాసిన అల్ – సీరహ్ అల్ – హలబియ్య  అను గ్రంథమునుండి, అల్లాహ్ చేసిన ప్రార్థనను దానికి (మేము చేసిన) తెలుగు అనువాదమును ఉటంకించుచున్నాము:

قلت يا جبريل أيصلى ربك قال نعم قلت وما يقول قال يقول سبوح قدوس رب الملائكة والروح سبقت رحمتى غضبى

“ఓ జిబ్రీల్‌, నీ దేవుడు ప్రార్థన చేస్తాడా?” అని నేను [ముహమ్మద్] అన్నాను. అందుకు అతడు “అవును” అన్నాడు. “ఏమని ప్రార్థన చేస్తాడు?” అని అడిగాను. అప్పుడతను ఈ విధంగా అన్నాడు – ‘దూతలకును ఆత్మకును ప్రభువైనవాడు పరిశుద్ధుడు, మహిమగలవాడు. నా దయ నా ఉగ్రతను అధిగమించును’ అని ఆయన (ప్రభువు) అంటాడు.” (ఆధారం)

సూరా 33:56 గూర్చి మరియు అల్లాహ్ ప్రార్థన చేయుటను గురించి వేరొక ముస్లిం వ్యాఖ్యాన కర్త ఈ విధముగా వ్యాఖ్యానించాడు:

అల్లాహ్ మొదటగా తన మీదకు అశీర్వాదమును వేడుకొనుట ద్వారా, తరువాత దూతలయొక్క ప్రార్థన ద్వారా, అటుతరువాత అదేవిధముగా తన దాసులను అతని మీదకు ఆశీర్వాదము మరియు సమాధానమును వేడుకొనమని అజ్ఞాపించుటద్వారా తన ప్రవక్త యొక్క యోగ్యతను స్పష్టము చేస్తాడు. అబు బక్ర్ ఇబ్న్ ఫురాక్ తెలియచెప్పినదేమనగా, “నా కంటి చల్లదనము ప్రార్థనలో ఉంది” అని ప్రవక్త పలికిన మాటలను ‘ఉలమా’లో (అనగా మత పెద్దలలో) ఒకడు ఇలా వివరించాడు, ఇక్కడ ప్రార్థన అనగా అల్లాహ్ చేసే ప్రార్థన, దూతలు చేసే ప్రార్థన మరియు అల్లాహ్ ఆజ్ఞకు లోబడి పునరుత్థాన దినం వరకు ఆయన సమాజము వారు చేసే ప్రార్థన. దూతలు మరియు మనుష్యులు చేసేటి ప్రార్థనలో అతని కొరకు వారందరు చేసే విజ్ఞాపనము ఉంటుంది, మరియు అల్లాహ్ చేసే ప్రార్థనలో కరుణ ఉంటుంది.

“వారు ప్రార్థించారు” అన్నప్పుడు, వారు ఆశీర్వాదమును (బరక) వేడుకొంటున్నారు అని అర్థము చెప్పబడుతుంది. కానీ,  తనకొరకు ప్రార్థన చేయమని ప్రవక్త ప్రజలకు చెప్పినప్పుడు, ‘సలాతు’(ప్రార్థన)కు మరియు ‘బరాక’(ఆశీర్వాదము)కు మధ్య ఉన్న వ్యత్యాసమును ప్రవక్త స్పష్టముగా తెలియజేశాడు. అతని కొరకు చేయబడిన ప్రార్థనకు గల అర్థమును తరువాత గమనిద్దాము. (ముహమ్మద్ మెసెంజర్ ఆఫ్ అల్లాహ్ (అష్-షిఫా ఆఫ్ కాది ‘ఇయాద్), కాది ‘ఇయాద్ మూసా అల్-యహ్సుబి,  ఇంగ్లీషు అనువాదం ఆయిషా అబ్ద్అర్రహమాన్ బెవ్లీ [మదీనా ప్రెస్, ఇన్వెర్నెస్స్, స్కాట్లాండ్, యు.కె. 1991; తృతీయ ముద్రణ], 25వ పేజీ)

అంతేకాకుండా:

తన కొరకు ప్రార్థన చేసే విషయమును గురించి హదీసుల్లో ప్రవక్త ప్రస్తావిస్తూ, సలాతు (ప్రార్థన) మరియు బరక (ఆశీర్వాదము) మధ్యనున్న వ్యత్యాసమును తెలియజేశాడు. ఆ రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని అక్కడ స్పష్టముగా తెలియవస్తున్నది. (పైన ఉదహరింపబడిన పుస్తకములో., 250వ పేజీ)

మరలా:

సలమ అల్-కింది ఇలా చెప్పాడు: ప్రవక్త కొరకు చేయవలసిన ప్రార్థనను అలీ ఈ క్రింది విధముగా బోధిస్తూ ఉండేవాడు: “నింగిని బల్లపరుపుగా పరచి, ఆకాశములను సృజించిన ఓ అల్లాహ్! నీ గొప్ప ప్రార్థనలను, అత్యధికమగు నీ ఆశీర్వాదమును మరియు నీ దయా కటాక్షములను ముహమ్మదు పైన అనుగ్రహించు… “

అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై ప్రార్థిస్తారు“(33:56) అనే వచనములో ముహమ్మదుపై చేయు ప్రార్థన గురించి అలీ ఈ విధముగా అర్థము చెప్పాడు :- “నా ప్రభువా నీ సేవలో మరియు విధేయతలో ఉన్నాము. అల్లాహ్ యొక్క ప్రార్థనలు, మంచితనముతో దయ చూపేవారి ప్రార్థనలు, ఆయనకు సమీపముగా ఉండే దూతల ప్రార్థనలు, సత్యవర్తనుల ప్రార్థనలు, హతసాక్షుల ప్రార్థనలు, సాలిహున్ యొక్క ప్రార్థనలు, నిన్ను మహిమపరచునది మరియేదైనాగాని ఉంటే దాని ప్రార్థనలు, ప్రపంచములకు ప్రభువైనవాడా, ముహమ్మదు ఇబ్న్అబ్దుల్లాహ్ పైన ఉండుగాక… ” (పైన ఉదహరింపబడిన పుస్తకములో, 257వ పేజీ)

చాలా ఆసక్తిని కలిగించే మరో మాట చూడండి:

ఇబ్న్ మసూద్ ఇలా చెప్పుచూ ఉండేవాడు, “నీవు ముహమ్మదు ప్రవక్తను ఆశీర్వదించినప్పుడు, ఆయన మీద శ్రేష్ఠమైన ప్రార్థనను కూడా చేయి. ఒకవేళ అది అతనికి చూపబడుతుందేమో నీకు తెలియదు కదా! అందుచేత ఇలా అను :- ‘ఓ అల్లాహ్, నీ ప్రార్థనలు, నీ దయ మరియు నీ ఆశీర్వాదము సందేశహరుల నాయకుడిపైన, దైవభయము గలవారి ఇమాము (నాయకుడు) పైన, మంచివారి నాయకుడి పైన మరియు కరుణ గలిగిన సందేశహరుని మీద అనుగ్రహించు.'”(పైన ఉదహరింపబడిన పుస్తకములో, 258వ పేజీ)

ఈ పైన చూపిన ఇబ్న్ మసూద్ హదీసులో, అల్లాహ్ చేసిన ప్రార్థనలకు, అతని దయ మరియు ఆశీర్వాదములకు మధ్య  సుస్పష్టముగా వ్యత్యాసము కనిపిస్తున్నది. కావున ప్రార్థనకై వాడబడిన పదములో ఆశీర్వాదము అనే అర్థము లేనే లేదు అని తెలుస్తున్నది.

చివరిగా:

అనస్ ఇబ్న్ మాలిక్‌ చెప్పిన ప్రవక్త పలికిన మాటలు, “ఎవరైనా నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తే, అతనిని అల్లాహ్ పది ప్రార్థనలతో ఆశీర్వదిస్తాడు… “

ప్రవక్త ఇలా చెప్పాడని అనస్ చెప్పాడు, “జిబ్రిల్ నన్ను పిలిచి ఇలా అన్నాడు, ‘ఎవరైతే నీ మీద ఒక్కసారి ప్రార్థనను చేస్తారో, అతని పైన అల్లాహ్ పదిసార్లు ప్రార్థన చేస్తాడు మరియు పది మెట్లు పైకి లేపుతాడు,’”…  (పైన ఉదహరింపబడిన పుస్తకములో, 259వ పేజీ)

ఇదియుగాక, పైన తెలపబడిన ఖుర్‌ఆన్‌ వచనాలలో ఒకటి అల్లాహ్‌ యొక్క ప్రార్థనలకు మరియు కరుణకు మధ్య సుస్పష్టమైన వ్యత్యాసమును కనబరుస్తుంది. మరియొకసారి దానిని ఇక్కడ ఇస్తున్నాను:

వారిపైన అల్లాహ్ యొక్క ప్రార్థనలు (సలవతున్) మరియు కరుణ ఉంటాయి, మరియు వారే సరియైన దారిచూపబడినవారు.” సురా  అల్‌ బఖర 2:157 (అరబీ నుండి తెలుగు)

 ప్రార్థనకు ఉపయోగించిన పదమునకు కరుణ మరియు ఆశీర్వాదము అనే అర్థాలు లేవు కాని కేవలము ప్రార్థన అనే అర్థమే ఉన్నదని ఈ వచనము సుస్పష్టముగా తెలియజేస్తుంది, అనగా అల్లాహ్‌ ప్రజలకొరకు వాస్తవముగా ప్రార్థన చేశాడు.

ఇస్లాం వాస్తవముగా బోధిస్తున్న దానిని ముస్లింలు కప్పిపుచ్చకుండా ఉంటే, అల్లాహ్ ప్రార్థన చేశాడు అనటానికి వారికి ఎటువంటి భయము కలుగదు. ఉదాహరణకు- సున్నీ ముస్లిం రచయిత జి.ఎఫ్. హద్దద్ సురా 33:56ను ఏ విధముగా అనువదించాడో గమనించండి:

విశ్వాసము యొక్క పరిపూర్ణత ప్రవక్త పట్ల ఉండే ప్రేమ పైన ఆధారపడి ఉంది, ఎందుకంటే అల్లాహ్ మరియు ఆయన దూతలు తరచుగా ప్రవక్త యొక్క గౌరవమును పైకెత్తుచున్నారు. దానిని ఈ క్రింది వచనములో చూడగలము:

“అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త మీద ప్రార్థనలు చేయుచున్నారు” (33:56)…

2. అల్లాహ్ ఇలా అన్నాడు : ప్రవక్త మీద ఆశీర్వాదములు వేడుకొనండి.
ప్రవక్త మీద ప్రార్థన చేయడానికి మరియు ఆయనను స్తుతించటానికి మనము ప్రోత్సాహపరచబడియున్నాము; ఈ క్రింది వచనములోని అల్లాహ్ ఆజ్ఞ ద్వారా అది మన మీద పెట్టబడిన విధి:

“అల్లాహ్ మరియు ఆయన దూతలు (ప్రవక్తను స్తుతించుచున్నారు మరియు) ఆయన మీద ప్రార్థన చేస్తున్నారు; ఓ విశ్వాసులారా! మీరును ఆయనను స్తుతించి ఆయన మీద ప్రార్థన చేయండి మరియు అత్యంత శుభవచనములు పంపించండి.”(అల్-అహ్‌జాబ్ 56)… (లవ్ ఆఫ్ ద ప్రోఫెట్ అండ్ ఫాలోయింగ్ హిస్ ఎగ్జాంపుల్; ఆధారం).

కాని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు వెలువరించిన ‘దివ్య ఖుర్ఆన్‌’లో 33:56వ వచనాన్ని-

అల్లాహ్ ఆయన దూతలు దైవ ప్రవక్తకై దురూద్‌ను పంపుతారు. విశ్వాసులారా! మీరు కూడ ఆయనకై దురూద్, సలామ్‌లు పంపండి’ అని అనువదించారు.

(ఇక్కడ యుసల్లూన అనే అరబీ పదాన్ని జి.ఎఫ్. హద్దద్ వలె ధైర్యంగా అనువదించడానికి జడిసి, దురూద్ అనే పారసీక/పర్షియా భాష పదాన్ని వాడి దాని వెనక ఉన్న అసలు అర్థం తెలుగులో వెలుగులోకి రాకుండా ఎంత జాగ్రత్తపడ్డారో గమనించగలరు).

ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ వారు వెలువరించిన ‘ఖుర్‌ఆన్ భావామృతం’ అనే తెలుగు అనువాదంలో కూడా 33:56వ వచనాన్ని ఎలా మార్చి అనువదించారో ఈ క్రింది వచనాన్ని చదివి గమనించగలరు.

దేవుడు, ఆయన దూతలు దైవ ప్రవక్తను దీవిస్తున్నారు. (కనుక) విశ్వాసులారా! మీరు కూడా అతను శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని (దైవాన్ని) ప్రార్థించండి’.

ముస్లింలు ఈ అసత్య అనువాదాలను వదలి సత్యాన్ని అధ్యయనం చేయగలిగిన రోజున తప్పకుండా రక్షణ పొందుతారు.

ఒకవేళ అల్లాహ్ గనుక తనలో బహుళత్వమే లేని అద్వితీయ ఏకత్వము కలిగిన దేవుడైనచో తాను ఎవరికి ఏ విధముగా ప్రార్థన చేశాడో వివరించి మనకు తెలుపగల ముస్లిం అసలు ఎక్కడైనా ఉన్నాడా?

అనుబంధం:- 
దేవుడు ప్రార్థించాడు అని చెప్పేది కేవలం క్రైస్తవ్యము మరియు ఇస్లాం మాత్రమే కాదు; యూదా మతములో కూడా అది చూడగలం.

రబ్బీ యోసే చెప్పిన మాటలను ఉటంకిస్తూ రబ్బీ యోహన్నన్ ఇలా అన్నాడు: “‘నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను’ అని యెషయా 56:7లో లేఖనము చెప్పుచున్నది కావున పరిశుద్ధుడును, స్తుతులకు పాత్రుడును అయినవాడు ప్రార్థిస్తాడని మనము ఎలా తెలుసుకొనగలము?  గమనించవలసిన విషయమేమనగా, ‘వారి ప్రార్థన’ అని ఆయన అనలేదు, అందుకు భిన్నముగా, ‘నా ప్రార్థన’ అని అన్నాడు; కాబట్టి, పరిశుద్ధుడును, స్తుతులకు పాత్రుడును అయినవాడు ప్రార్థన చేస్తాడు అని మనం గ్రహించవచ్చు.”
దేవుడు ఏమని ప్రార్థన చేస్తాడు? రవ్ పేరును ఉదాహరిస్తూ తువియా కుమారుడైన రబ్బీ జుత్ర ఇలా ఉటంకించాడు: “నా కృప నా కోపమును అణచుటయే నా చిత్తముగానుండును గాక, మరియు నా పిల్లల పక్షముగా కర్కశమైన న్యాయపరిధిని సమీపించక నా కృపను చూపునట్లు, నా కృప నా [ఇతర] లక్షణములకు పైగా ప్రబలమవును గాక.”

ఎలీషా కుమారుడైన రబ్బీ ఇష్మాయేలు ఇలా చెప్పాడని అంటారు :- “ఒకసారి నేను ధూపము వేయడానికి పరిశుద్ధ మందిరములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగా, అక్కడ సైన్యములకు అధిపతియైన దేవుడు – అకత్రియేల్ యాహ్, అదోనాయ్ త్సెవా’ఓత్‌ను, అనగా సైన్యములకు అధిపతియైన దేవుని, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన నాతో ‘నా కుమారుడా, నన్ను స్తోత్రించు!’ అన్నాడు. అంతట నేను  ‘నీ కృప నీ కోపమును అణచుటయే నీ చిత్తముగానుండును గాక, మరియు నీ పిల్లల పక్షముగా కర్కశమైన న్యాయపరిధిని సమీపించక నీ కృపను చూపునట్లు, నీ కృప నీ [ఇతర] లక్షణములకు పైగా ప్రబలమవును గాక!’ అని చెప్పితిని. అప్పుడు దేవుడు సమ్మతముగా తన తలను ఊపాడు.”

ఈ సందర్భములో, దీనినుండి మనము నేర్చుకొనినదేమనగా – సాధారణమైన ఒక వ్యక్తి చేయు స్తోత్రమును తక్కువగా ఎంచకూడదు. (బాబిలోనియన్ తాల్మూద్, జెరాయిమ్ I, బెరాకోత్ 7a)

అవ్విధముగా, ఏకేశ్వరోపాసన చేయు మూడు మతములూ వాస్తవానికి దేవుడు ప్రార్థన చేస్తాడు అని బోధిస్తున్నప్పటికి, క్రైస్తవ్యమొక్కటే దేవుడు ప్రార్థిస్తాడనటానికి అర్థవంతమైన వివరణను ఇస్తుంది. అనగా, ఒంటరియైన ఒక దేవుడు తనకు తానే ప్రార్థన చేసుకున్నాడు అనే అర్థములేని భావనకు విరుద్ధముగా, క్రైస్తవ విశ్వాసములో సదా విడి విడిగా ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తమౌతున్న త్రియేక దేవునిలోని ఒకరు మరొకరికి ప్రార్థన చేస్తున్నారు అని బోధిస్తుండటము ఎంతో అర్థవంతముగా కనిపిస్తున్నది కదా!

.

(ఆంగ్లమూలం; If Jesus is God, Then …Was he praying to himself?, by Sam Shamoun)

Leave a Reply