ఈ క్లుప్తమైన సమాచారమే క్రీస్తు దైవత్వమును గూర్చి క్రొత్తనిబంధన మనకు ఇస్తున్న సమగ్రమైన సమాచారము అని దీని భావము కాదు. కాని క్రీస్తు దైవత్వమును నిరూపించుటకు ఇది ఒక విధానము.

A. అంతర్నిహితమైన క్రీస్తుశాస్త్రం

1. ప్రభువైన యేసు క్రీస్తు  చేసిన దైవిక కార్యాలు
a. విశ్వముతో సంబంధము కలిగినవి

(1) సృష్టికర్త (యోహాను 1:3; కొలస్సయులకు 1:16; హెబ్రీయులకు 1:2)

(2) నిర్వాహకుడు (1 కొరింథీయులకు 8:6; కొలస్సయులకు 1:17; హెబ్రీయులకు 1:3)

(౩) జీవాధిపతి (యోహాను 1:4, అపొ.కార్యములు 3:15)

(4) అధిపతి (మత్తయి 28:18; రోమా 14;9; ప్రకటన 1:6)

b. మానవాళితో సంబంధము కలిగినవి

(1) రోగులను స్వస్థపరచుట (మార్కు 1:32-34; అపొ. కార్యములు 3:6; 10:38)

(2) అధికారముతో బోధించుట (మార్కు  1:21-22; 13:31)

(3) పాపములను క్షమించుట (మార్కు 2:1-12; లూకా 24:47; అపొ.కార్యములు 6:31; కొలస్సయులకు  3:13)

(4) రక్షణను అనుగ్రహించుట లేక నిత్యజీవము  ఇచ్చుట (అపొ.కార్యములు 4:12; రోమా 10:12-14)

(5) ఆత్మను అనుగ్రహించుట (మత్తయి 3:11; అపొ.కార్యములు 2:17, 33)

(6) మృతులను లేపుట (లూకా 7:11-17; యోహాను 5:21; 6:40)

(7) తీర్పు తీర్చుట (మత్తయి 25:31-46; యోహాను 5:19-29; అపొ.కార్యములు 10:42; 1 కొరింథీయులకు 4:4-6)

2. ప్రభువైన యేసు క్రీస్తు  ప్రతిపాదించిన లేక ఆయనకు ఆపాదించబడిన దైవిక స్థాయి
a. తన తండ్రితో సంబంధము కలిగినవి

(1) దైవిక లక్షణములు కలిగినవాడు (యోహాను 1:4; 10:30; 21:17; ఎఫెసీయులకు 4:10; కొలస్సయులకు 1:19; 2:9)

(2) నిరంతరమున్నవాడు (యోహాను 1:1; 8:58; 12:41; 17:5; 1 కొరింథీయులకు 10:4; ఫిలప్పీయులకు 2:6; హెబ్రీయులకు 11:26; 13:8; యూదా 5)

(3) ఘనతలో సమానత గలవాడు (మత్తయి 28:19; యోహాను 5:23; 2 కొరింథీయులకు 13:14; ప్రకటన 22:13; మరియు 21:6 వచనము కూడా చూడండి)

(4) పరిపూర్ణముగా ప్రత్యక్షపరచువాడు (యోహాను 1:18; 14:9; కొలస్సయులకు 1:15; హెబ్రీయులకు 1:1-3)

(5) సత్య స్వరూపి (యోహాను 1:9,14; 6:32; 14:6; ప్రకటన 3:7,14)

(6) రాజ్యముపైన ఉమ్మడి ఆధీనముగలవాడు (ఎఫెసీయులకు 5:5; ప్రకటన 11:15), సంఘములపైన ఉమ్మడి ఆధీనముగలవాడు (రోమా 16:16), ఆత్మతో ఉమ్మడి ఆధీనముగలవాడు (రోమా 8:9; ఫిలిప్పీయులకు 1:19), దేవాలయముపైన ఉమ్మడి ఆధీనముగలవాడు (ప్రకటన 21:22), దైవ నామమునకు ఉమ్మడి ఆధీనముగలవాడు (మత్తయి 28:19; ప్రకటన 14:1కూడా చూడండి), మరియు సింహాసనము పైన ఉమ్మడి ఆధీనముగలవాడు (ప్రకటన 22:1,3)

b. మానవాళితో సంబంధము కలిగినవి

(1) స్తుతి పొందేవాడు అనగా మనుష్యులు ఆయనకు స్తుతి చెల్లిస్తారు (మత్తయి 21:15-16; ఎఫెసీయులకు 6:19; 1 తిమోతి 1:12; ప్రకటన 5:8-14)

(2) ప్రార్థనలు పొందుకునేవాడు అనగా మనుష్యులు ఆయనకు ప్రార్థన చేస్తారు (అపొ.కార్యములు 1:24; 7:59-60; 9:10-17, 21; 22:16,19; 1 కొరింథీయులకు 1:2; 16:22; 2 కొరింథీయులకు 12:8)

(3) రక్షణనిచ్చు విశ్వాసమునుంచ తగినవాడు అనగా మనుష్యులు రక్షణ పొందునట్లు ఆయనయందు విశ్వాసముంచాలి (యోహాను 14:1; అపొ.కార్యములు 10:43; 16:31; రోమా 10:8-13)

(4) ఆరాధన పొందతగినవాడు అనగా మనుష్యులు ఆయనను ఆరాధించాలి (మత్తయి 14:33; 28:9, 17; యోహాను 5:23; 20:28; ఫిలిప్పీయులకు 2:10-11; హెబ్రీయులకు 1:6; ప్రకటన 5:8-12)

(5) ఆశీర్వాదమునకు ఉమ్మడి కారకుడు (1 కొరింథీయులకు 1:3; 2 కొరింథీయులకు 1:2; గలతీయులకు 1:3; 1 థెస్సలొనీకయులకు 3:11; 2 థెస్సలొనీకయులకు 2:16)

(6) దైవ స్తోత్రమును పొందతగినవాడు (2 తిమోతి 4:18; 2 పేతురు 3:18; ప్రకటన 1:5-6; 5:13)

B. సుస్పష్టమైన క్రీస్తు శాస్త్రము

1. ప్రభువైన యేసునకు ఆపాదించబడిన పాత నిబంధనలోని యెహోవాను సూచిస్తున్న వాక్యభాగములు

a. యెహోవా (నిర్గమకాండము 3:14 మరియు యెషయా 43:11 వచనములు, యేసుకు సూచన ప్రాయంగా యోహాను 8:68లో  చెప్పబడినవి; కీర్తనలు 102:25-27ను హెబ్రీయులు 1:10-12లో ఉటంకించటం జరిగింది; యెషయా 44:6లో యెహోవా గురించి చెప్పబడిన మాటలు  ప్రకటన 1:18లో యేసు గురించి చెప్పబడినవి)

b. యెహోవా పరిశుద్ధత (యెషయా 8:12-13 [29:23 కూడా చూడండి] ను 1 పేతురు 3:14-15లో ఉటంకించడమైనది)

c. యెహోవాను గూర్చిన వివరణలు (యెహెజ్కేలు 43:2 మరియు దానియేలు 10:5-6 ప్రకటన 1:13-16లో యేసుకు చెందినవిగా చెప్పబడింది)

d. యెహోవాకు చెందిన ఆరాధన (యెషయా 45:23 ఫిలిప్పీయులకు 2:10-11లో యేసునకు చెందినదిగా చెప్పబడింది; ద్వితీయోపదేశకాండము 32:43 మరియు కీర్తన 96:7 హెబ్రీయులకు 1:6లో ఉటంకించబడింది)

e. యెహోవా చేసిన సృష్టి కార్యము (కీర్తన 102:25 హెబ్రీయులకు 1:10-10లో ఉటంకించబడింది)

f. యెహోవా రక్షణ (యోవేలు 2:32 రోమా 10:13లో ఉటంకించబడింది; అపొస్తలుల కార్యములు 2:21 చూడండి; యెషయా 40:3 మత్తయి 3:3లో ఉటంకించబడింది)

g. యెహోవా నమ్మదగినతనము (యెషయా 28:16వచనం రోమా 9:33; 10:11; 1 పేతురు 2:6 లలో ఉటంకించబడింది; )

h. యెహోవా తీర్పు (యెషయా 6:10 యేసుకు సూచనప్రాయంగా  యోహాను 12:41లో చెప్పబడింది; యెషయా 8:14 రోమా 9:33లో మరియు 1పేతురు 2:8లో ఉటంకించబడింది)

i. యెహోవా విజయోత్సవం (కీర్తనలు 68:18 ఎఫెసీయులకు 4:8లో ఉటకించబడింది)

2. ప్రభువైన యేసు క్రీస్తు  ప్రతిపాదించిన లేక ఆయనకు ఆపాదించబడిన దైవిక బిరుదులు (నామములు)

 a. మనుష్యకుమారుడు (మత్తయి 16:28; 24:30; మార్కు 8:38; 14:62-64; అపొస్తలుల కార్యములు 7:56)

b. దేవుని కుమారుడు (మత్తయి 11:27; మార్కు 15:39; యోహాను 1:18; రోమా 1:4; గలతీయులకు 4:4; హెబ్రీయులకు 1:2)

c. క్రీస్తు  (మెస్సీయ) (మత్తయి 16:16; మార్కు 14:61; యోహాను 20:31)

d. ప్రభువు (మార్కు 12:36-37; యోహాను 20:28; రోమా 10:9; 1 కొరింథీయులకు 8:6; 12:3; 16:22; ఫిలిప్పీయులకు 2:11; 1 పేతురు 2:3; 3:15)

e. అల్ఫా ఓమెగా (ప్రకటన 22:13; చూడండి: 1:8; 21:6, ప్రభువైన దేవునికి పెట్టబడినవి)

f. దేవుడు (యోహాను 1:1, 18; 20:28; రోమా 9:5; తీతుకు 2:3; హెబ్రీయులకు 1:8; 2 పేతురు 1:1)

Taken from 
Murray J. Harris, Jesus as God, Baker Book House, 1992, ISBN 0-8010-4370-0

Leave a Reply